ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి అంటూ సాగే ఆంధ్ర మహాభారతంలోని ఉద్యోగ పర్వము తృతీయాశ్వాసములో తిక్కన రాసిన సీస పద్యం. శ్రీకృష్ణుడు పాండవుల తరఫుని కురుసభకు రాయబారిగా వెళ్ళే సందర్భంలో ద్రౌపది కృష్ణునితో సంభాషించే సందర్భంలోని పద్యమిది. రాయబారిగా కృష్ణుడు యుద్ధాన్ని నివారించి, సంధి చేసుకురావాలని పాండవులంతా శాంతి వచనాలు పలికేప్పుడు, ద్రౌపది మాత్రం ఆవేశం పట్టలేక తనకు జరిగిన ఘోరాలకు ప్రతీకారం గురించి ఈ పద్యంలో చెప్తుంది.
పద్యం
[మార్చు]సీ. ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి
దొలుతగాఁ బోరిలో, దుస్ససేను
తను వింత లింతలు తునియలై చెదరి రూ
పఱి యున్నఁ గని ఉడుకాఱుఁ గాక
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది
పెనుగద వట్టిన భీమసేను
బాహుబలంబునుఁ బాటించి గాండీవ
మను నొక విల్లెప్పుడును వహించు
ఆ.వె. కఱ్ఱి విక్రమంబుఁ గాల్పనే యిట్లు
బన్నములు వడిన ధర్మనందనుడును
నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁ
గానఁ బడయమైతి మేనిఁ గృష్ణ!