Jump to content

ఉండేలు

వికీపీడియా నుండి

క్యాట్ బాల్ ను కాట్ బాల్, కాడ్ బాల్, ఉండేలు అని కూడా అంటారు. దీనిని ఇంగ్లీషులో slingshot అంటారు.

క్యాట్ బాల్ అనేది చేతితో ఉపయోగించే ఒక చిన్న రక్షణ ఆయుధం.

భారతదేశంలో వాడే తోలు ఉండేలు
Simple slingshot
A 1922 diagram showing the construction of an arrow-firing slingshot.
A folding, steel framed wrist brace slingshot using tubular bands. Marketed by the Benjamin Air Rifle Company.

మన్నికగా Y - ఆకారంలో తయారుచేసుకున్న దీనిని V ఆకారానికి కింది భాగాన పిడికిలితో గట్టిగా పట్టుకునేందుకు అనువుగా ఉంటుంది.

క్యాట్ బాల్ కు పై భాగాన ఉన్న రెండు చివరల పొడవుగా సాగే గుణము ఉన్న రెండు మన్నికయిన రబ్బర్లు కట్టబడి ఉంటాయి. వేరొక వైపు ఉన్న రెండు రబ్బర్లను కలుపుతూ జేబు ఆకారంలో ఉండే ఒక గట్టితోలును కడతారు.

దీని తయారికి సాధారణంగా గట్టి కర్ర లేదా చెక్కను ఉపయోగిస్తారు.

ఉపయోగించే విధానం

[మార్చు]

జేబు ఆకారంలో ఉండే తోలులో తగిన పరిమాణంలో ఉండే చిన్న రాయిని ఉంచి లాగి వదలడం ద్వారా అందులోని రాయి క్యాట్ బాల్ గురిపెట్టిన వైపు వేగంగా, దూరంగా వెలుతుంది.

ఉపయోగాలు

[మార్చు]

పక్షులను, కోతులను తరమడానికి దీనిని ఉపయోగిస్తారు.

చెట్టుకున్న కాయలు కొట్టడానికి దీనిని ఉపయోగిస్తారు.

ప్రమాదాలు

[మార్చు]

పిల్లలు ఒకరిపై ఒకరు తమాషాగా క్యాట్ బాల్ ను ప్రయోగించడం వలన దెబ్బలు తగిలే అవకాశముంది.

సామెతలు

[మార్చు]

పిల్ల కాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఒడిసెల

"https://te.wikipedia.org/w/index.php?title=ఉండేలు&oldid=3875824" నుండి వెలికితీశారు