ఉత్తర ఉన్ని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉత్తర ఉన్ని ఒక భారతీయ సినీ నటి.[1] ఆమె ఎక్కువగా తమిళ, మలయాళ సినిమా సినిమాల్లో నటించింది. 2012లో సురేష్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా వవ్వల్ పేసంగతో తెరంగేట్రం చేసింది ఉత్తర. ఆమె మొట్టమొదటి మలయాళ చిత్రం ఎదవప్పతీ. ఈ సినిమాకు లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని నటనకు ఆమె కేరళ రాష్ట్ర సినీ విమర్శకుల పురస్కారం- ఉత్తమ నూతన నటి అవార్డు గెలుచుకుంది.[2][3] లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వంలో ఆమె నటించిన మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.[4][5] ధాత్రి రియల్ స్లిమ్ ఆయిల్ ఎడ్వర్టైజ్మెంట్ లో మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ఉత్తర, శ్రీ కుమారన్స్, భీమా జ్యుయెలర్స్, ఎమ్మాన్యువల్ సిల్క్స్ వంటి యాడ్ లలో నటించింది.

గాయని అయిన ఉత్తర పతిరపొనెత్రిల్ అనే ఆల్బంను ఇటీవల విడుదల చేసింది.[6] బహ్రయిన్లో అంగొపంగా అనే నృత్య పాఠశాల స్థాపించింది ఉత్తర.[7] ఆమె ప్రపంచ ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి కూడా. యునెస్కో ప్రపంచ నాట్య కౌన్సిల్ లో ఉత్తర సభ్యురాలు. బహ్రయిన్ తో పాటు ముంబైలోని టెంపుల్ స్టెప్స్ లో కూడా ఆమె నాట్య పాఠశాలలు ఉన్నాయి.[8] ఆమె దర్శకత్వం వహించిన రండాం వరవు అనే లఘుచిత్రానికి 5 ఉత్తమ దర్శకురాలు పురస్కారాలు లభించాయి.

మూలాలు[మార్చు]

  1. "Uthara Unni-Picture Gallery". manoramaonline. Retrieved 2015-04-27. Cite web requires |website= (help)[permanent dead link]
  2. Edavappaathy Shooting Location. youtube. URL accessed on 2015-05-10.
  3. Manisha Koirala praises Uthara Unni. timesofindia: (2012-04-22). URL accessed on 2015-05-10.
  4. Vijaypath Ek Mission-Rahul-Uthara Unni-Vavval Pasanga-Watch Free Full Movie. youtube. URL accessed on 2015-04-27.
  5. Tamil-Movies-Vavval Pasanga-Cast & Crew. filmibeat. URL accessed on 2015-04-27.
  6. Pathirapontheril Malayalam Album Song-Uthara Unni. youtube. URL accessed on 2015-04-27.
  7. Maattumantha, MS Das (16 March 2015). ബഹറിനിൽ ഊർമിള ഉണ്ണിയും ഉത്തര ഉണ്ണിയും ഡാൻസ് സ്കൂൾ തുടങ്ങി. pp. 42,43,44,45 Cinema Mangalam. URL accessed on 5 October 2016.
  8. Utthara Unni heads Dance Academy. indiaglitz: (2015-03-05). URL accessed on 2015-05-10.