ఊర్మిళ ఉన్ని
ఊర్మిళ ఉన్ని | |
---|---|
జననం | స్వాతి ఊర్మిళా రాజా 1962 జూన్ 14 తిరువళ్ల, కేరళ, భారతదేశం |
జాతీయత | ఇండియన్ |
క్రియాశీల సంవత్సరాలు | 1989 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అంకారత్ రామన్ ఉన్ని (m. 1981) |
పిల్లలు | ఉత్తర ఉన్ని |
తల్లిదండ్రులు |
|
బంధువులు | సంయుక్త వర్మ |
ఊర్మిళ ఉన్ని (జననం 1962 జూన్ 14) భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి, నటి. ఆమె ప్రధానంగా మలయాళ సినిమాల్లో పనిచేస్తుంది.[2] ఆమె కుమార్తె ఉత్తర ఉన్ని కూడా నటి.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఊర్మిళ ఉన్ని 1962 జూన్ 14న తిరువళ్లలోని నెడుంపురం ప్యాలెస్‌లో కె. సి. అనుజంరాజా కొట్టకల్ కోవిలకం, నేదుపురం కొత్తరాతిల్ మనోరమ దంపతుల కుమార్తెగా రాజకుటుంబంలో జన్మించింది. ఆమె తన ప్రాథమిక విద్యను ఇన్‌ఫాంట్ జీసస్ కాన్వెంట్, త్రిస్సూర్ లో చదివింది. త్రిస్సూర్‌లోని శ్రీ కేరళ వర్మ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసింది. మోహినియాట్టం, భరతనాట్యం, కథాకళి, వీణ నేర్చుకుంది. ఆమె చిత్రకారిణి కూడా.[4]
ఆమె అంకారత్ రామన్ ఉన్నిని వివాహం చేసుకుంది. ఈ జంటకు నటి, నృత్యకారిణి అయిన ఉత్తర ఉన్ని అనే కుమార్తె ఉంది.[5] ప్రస్తుతం వారు ఎర్నాకుళంలోని కడవంత్రాలో నివసిస్తున్నారు. వారు బహ్రెయిన్‌లో అంగోపంగా నృత్య పాఠశాలను ప్రారంభించారు.[6] నటి సంయుక్త వర్మ ఆమె మేనకోడలు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Swathi thirunal Urmila Raja". Official website of Urmila Unni. Archived from the original on 2 ఏప్రిల్ 2011. Retrieved 8 October 2011.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-03. Retrieved 2022-10-30.
- ↑ Parvathy S Nayar (17 September 2011). "Urmila Unni gets busy in Kollywood". The Times of India. Archived from the original on 3 December 2013. Retrieved 8 October 2011.
- ↑ "CINIDIARY - A Complete Online Malayalam Cinema News Portal". cinidiary.com. Archived from the original on 2015-05-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-03. Retrieved 2022-10-30.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-02. Retrieved 2022-10-30.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-05. Retrieved 2022-10-30.
- కేరళ నటీమణులు
- మలయాళ సినిమా నటీమణులు
- భారత చలనచిత్ర నటీమణులు
- భారత శాస్త్రీయ నృత్య ప్రదర్శనకారులు
- శ్రీ కేరళ వర్మ కళాశాల పూర్వ విద్యార్థులు
- కేరళ నృత్యకారులు
- భారతీయ మహిళా శాస్త్రీయ నృత్యకారులు
- 20వ శతాబ్దపు భారతీయ నటీమణులు
- 21వ శతాబ్దపు భారతీయ నటీమణులు
- భారత టెలివిజన్ నటీమణులు
- మలయాళ టెలివిజన్ నటీమణులు
- తమిళ సినిమా నటీమణులు
- 1962 జననాలు