ఉపాధ్యాయ అర్హత పరీక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టెట్ లేదా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా ఉపాధ్యాయ అర్హత పరీక్ష భారతదేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించగోరే అభ్యర్థులకు నిర్వహించే అర్హత పరీక్ష.1 నుండి 5 తరగతుల బోధించే ఉపాధ్యాయులకు పేపర్ 1 పరీక్ష అలాగే 6వ తరగతి నుండి 10 తరగతి బోధించే ఉపాధ్యాయులకు పేపర్ 2 పరీక్షలు ఉంటాయి.దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. కేంద్రప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తుంది. ఉపాధ్యాయ ఉద్యోగ ఎంపికకు ఈ పరిక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. రాష్ట్రప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్షలో కూడా టెట్ కు వెయిటేజీ ఇస్తారు.[1]

చరిత్ర[మార్చు]

బోధనలో ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను 2011 లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది.[2] [3]ఈ పరీక్ష రాయడానికి D.ed,B.ed పూర్తి చేసి ఉండాలి. ఈ పరీక్షలో 60% కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారికే డీఎస్సీకి అర్హుడు.ఈ పరీక్ష సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ[మార్చు]

జిల్లా ఎంపిక కమిటీ (డి.ఎస్‌.సి) ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. డీఎస్సీలో 20% వెయిటింగ్ ఉంటుంది.టెట్‌లో పేపర్‌-1, పేపర్‌-2 ఉంటాయి. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేవారు (ఎస్‌జీటీ) పేపర్‌-1 పరీక్ష రాయాలి. 6 నుంచి 8వ తరగతి వరకు బోధించేవారు (స్కూల్‌ అసిస్టెంట్‌) పేపర్‌-2 పరీక్ష రాయాలి. మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌లో 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి.క్వాలిఫైయింగ్‌ మార్కులు జనరల్‌ అభ్యర్థులు 90 మార్కులు, బీసీ అభ్యర్థులు75 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ / దివ్యాంగులు 60 మార్కులు సాధించాలి. టెట్‌ మార్కులు ఏడేళ్ల పాటు చెల్లుబాటవుతుంది.[4][5][6]

కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష[మార్చు]

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (సీటెట్). దీన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది.1వ తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు బోధించడానికి ఈ అర్హత పరీక్ష రాయాలి. ఈ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన వారు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లతో పాటు రాష్ట్రస్థాయి పాఠశాలలో టీచర్ ఉద్యోగాల దరఖాస్తుకు అవసరమైన అర్హత లభిస్తుంది. సీటెట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. ఉత్తీర్ణులకు ఏడేళ్ల గుర్తింపుతో సర్టిఫికెట్ జారీ చేస్తారు. రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. 1వ నుంచి 5వ తరగతుల బోధనకు సంబంధించి పేపర్ 1 నిర్వహిస్తారు. 6-8 తరగతుల బోధనకు సంబంధించి పేపర్ 2 నిర్వహిస్తారు.[7]

మూలాలు[మార్చు]

  1. "State TET Links , CTET / TET Coaching, CTET Preparation , CTET Centre, CTET Online , CTET Test Series". www.niit.com. Retrieved 2020-08-13.
  2. Jul 30, Abhishek Choudhari / Updated:; 2011; Ist, 05:20. "86% flunk teacher eligibility test | Nagpur News - Times of India". The Times of India (in ఆంగ్లం). Retrieved 2020-08-13.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  3. Jul 30, Abhishek Choudhari / Updated:; 2011; Ist, 05:20. "86% flunk teacher eligibility test | Nagpur News - Times of India". The Times of India (in ఆంగ్లం). Retrieved 2020-08-15.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  4. "APTET". web.archive.org. 2014-03-14. Retrieved 2020-08-15.
  5. "ఆంధ్ర ప్రదేశ్ టెట్ పరీక్ష". m.andhrajyothy.com. Retrieved 2020-08-15.[permanent dead link]
  6. "::. TS TET .::". www.eenadupratibha.net. Retrieved 2020-08-15.
  7. "అధికార వెబ్సైటు". ctet.nic.in. Archived from the original on 2020-08-14. Retrieved 2020-08-15.

బయటి లంకెలు[మార్చు]