ఉపాధ్యాయ ప్రవీణ్ రిషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రస్తుత జైన మత గురువులలో ఒకరు శ్రీ ఉపాధ్యాయ్ రిషి ప్రవీణ్‌జీ ఈయన ఓ మనస్తత్వవేత్త, తత్వవేత్తగా పేర్గాంచారు. ఉపాధ్యాయ్ 7 అక్టోబర్ 1957న ఘోడేగావ్ (అహ్మద్‌నగర్, మహారాష్ట్ర)లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శ్రీమతి చంపాబాయి దేసార్దా,శ్రీ దగ్దులాల్జీ దేసార్దా.శ్రీ రిషి ప్రవీణ్‌జీ పదో తరగతి వరకు చదువుకున్నారు. కాలక్రమేణా, ధర్మం పట్ల అతనికి కల్గిన ఆసక్తి ఆయనను నిర్లిప్తత దిశగా పయనించేలా చేసింది. కేవలం 16 సంవత్సరాల వయస్సులో, 24 మార్చి 1974న భుసావల్‌లో (ఖండేష్, మహారాష్ట్ర) శ్రమన్ సంఘ్‌కు చెందిన ఆచార్య శ్రీ ఆనంద్రిషిజీ పాద పద్మాల వద్ద జైన సన్యాసి (దీక్ష) ప్రమాణాన్ని స్వీకరించారు.