Coordinates: 34°5′10″N 74°2′0″E / 34.08611°N 74.03333°E / 34.08611; 74.03333

ఉరి (జమ్మూ కాశ్మీర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉరి
పట్టణం
ఉరి is located in Jammu and Kashmir
ఉరి
ఉరి
భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్‌లో స్థానం
ఉరి is located in India
ఉరి
ఉరి
ఉరి (India)
Coordinates: 34°5′10″N 74°2′0″E / 34.08611°N 74.03333°E / 34.08611; 74.03333
దేశంభారతదేశం ( India)
రాష్ట్రంజమ్మూ కాశ్మీర్
జిల్లాబారాముల్లా జిల్లా
Government
 • Typeతాలూకా
Population
 (2011)
 • Total9,366
భాషలు
 • అధికారిక భాషలుగుజారీ భాష, పహారీ, కాశ్మీరీ భాష, ఉర్దూ, హిందీ, డోగ్రీ భాష, ఆంగ్ల భాష [1][2]
Time zoneUTC+5:30 (IST)
PIN
193123
టెలిఫోన్ కోడ్01956
Vehicle registrationJK 05
లింగ నిష్పత్తి1.13
అక్షరాస్యత83%
ఉరి పాత మార్కెట్

ఉరి భారతదేశం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, బారాముల్లా జిల్లాలో ఉన్న పట్టణం.[3] ఇది జీలం నది ఒడ్డున పాకిస్తాన్‌ నియంత్రణ రేఖకు తూర్పున 10 కిలోమీటర్లు (6.2 మైళ్ళు) దూరంలో ఉంది.

వ్యుత్పత్తి శాస్త్రం[మార్చు]

19వ శతాబ్దానికి చెందిన బ్రిటీష్ యాత్రికుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రదేశం కాశ్మీరీ భాషలో "ఉరి" అని పిలువబడే రాలన్ (కేసల్పినియా డెకాపెటాలా) చెట్లతో నిండి ఉండడం వలన ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది.[4]

స్థానం[మార్చు]

ఉరి, శ్రీనగర్ నుండి 76 మైళ్ళు (122 కి.మీ), ముజఫరాబాద్ నుండి 42 మైళ్ళు (68 కి.మీ), పూంచ్ నుండి 49 మైళ్ళు (79 కి.మీ) దూరంలో ఉంది. ఉరికి పశ్చిమాన కాశ్మీర్ వ్యాలీ ఉంది, ఇది జీలం వ్యాలీ రోడ్‌లో ఉంది. కాశ్మీర్ విభజనకు ముందు, ఈ రహదారి ఉరి, రావల్పిండి, శ్రీనగర్‌లను కలిపేది. మరొక ముఖ్యమైన రహదారి హాజీ పీర్ పాస్ ద్వారా ఉరి నుండి పూంచ్‌ను కలుపుతుంది.[5]

చరిత్ర[మార్చు]

హరి సింగ్ నల్వా (క్రీ.శ 1820-1823), మహారాజా రంజిత్ సింగ్ సంబంధించిన  సిక్కు కమాండర్-పరిపాలకుడు ఉరి కోటను నిర్మించాడు.[6][7]మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం (1845-1846), అమృతసర్ ఒప్పందం (1846) తరువాత, రాజా గులాబ్ సింగ్, జమ్మూ కాశ్మీర్ మహారాజుగా ప్రకటించబడ్డాడు, రావి నది, సింధు నది మధ్య ఉన్న అన్ని భూములను స్వాధీనం చేసుకున్నాడు.[8]  ఉరి కాశ్మీర్ ప్రావిన్స్‌లోని ముజఫరాబాద్ జిల్లాలో ఒక తాలూకాగా మారింది. 1947 అక్టోబరు 22న, పాకిస్తాన్ ఆదివాసీల దండయాత్రతో ముజఫరాబాద్, ఉరిలను స్వాధీనం చేసుకోవాలనుకుంది. కానీ ఆదివాసులు బారాముల్లా వద్ద ఆగిపోయారు. అక్టోబరు 26న భారతదేశం వైమానిక దళాలను కాశ్మీర్ లోయకు తరలించింది, వారు నవంబర్ మధ్య నాటికి బారాముల్లా, ఉరిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. భారత ప్రభుత్వం ఉరి రక్షణకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చింది. మరోవైపు ముజఫరాబాద్ పాకిస్తాన్ నియంత్రణలోకి వచ్చింది, అది ఆజాద్ కాశ్మీర్ రాజధానిగా మారింది. ఉరి తాలూకా తదనంతరం బారాముల్లా జిల్లాలో విలీనం చేయబడింది.[3]

2016 ఉరి దాడులు[మార్చు]

18 సెప్టెంబర్ 2016 ఉదయం 5.30 గంటలకు, ఉరిలోని భారత సైనిక శిబిరాల వద్ద ఉగ్రవాదులు గ్రెనేడ్‌లు విసిరి, శిబిరాల్లో ఉన్న పద్దెనిమిది మందికి పైగా సైనికులను చంపారు, పలువురు గాయపడ్డారు.[9] ఈ దాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ కూడా కేసు నమోదు చేసింది.[10]

ఎదురుదాడి[మార్చు]

ఉరి సైనిక శిబిరంపై దాడికి ప్రతీకారంగా, భారత సైన్యం 28 సెప్టెంబర్ 2016న పాక్ ఆక్రమిత ఆజాద్ కాశ్మీర్‌లోకి ప్రవేశించి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.[11]

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఉరి మునిసిపాలిటీ మొత్తం జనాభా 9,366. వారిలో 6674 మంది పురుషులు, స్త్రీలు 2992 మంది ఉన్నారు. జనాభాలో ముస్లింలు 50211%, హిందువులు 39.47%, క్రైస్తవులు 9.34%, ఇతరులు 0.30% ఉన్నారు. ఆరేళ్ల లోపు పిల్లల సంఖ్య 879. లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 403 స్త్రీలు. అక్షరాస్యత రేటు 88.46%. పురుషుల అక్షరాస్యత 95.27%, స్త్రీల అక్షరాస్యత 70.02%.[12]

మూలాలు[మార్చు]

  1. "The Jammu and Kashmir Official Languages Act, 2020" (PDF). The Gazette of India. 27 September 2020. Retrieved 27 September 2020.
  2. "Parliament passes JK Official Languages Bill, 2020". Rising Kashmir. 23 September 2020. Archived from the original on 24 సెప్టెంబర్ 2020. Retrieved 23 September 2020. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  3. 3.0 3.1 "Administrative Setup in District Baramulla". Baramulla District. Retrieved 21 September 2016.
  4. Bellew, Henry Walter (1989). Kashmir and Kashghar: A Narrative of the Journey of the Embassy to Kashghar in 1873-74. Asian Educational Services. ISBN 978-81-206-0510-7.
  5. K. D. Mani, Uri: The historical town, Daily Excelsior, 6 November 2017.
  6. Bansal, Bobby Singh (2015), Remnants of the Sikh Empire: Historical Sikh Monuments in India & Pakistan, Hay House, Inc, p. 174, ISBN 978-93-84544-93-5
  7. Lone, F. A. (2005), The Exploration Of Uri Sector: Kashmir Valley, Shipra Publications, p. 42, ISBN 978-81-7541-222-4
  8. Singh, Bawa Satinder (1971), "Raja Gulab Singh's Role in the First Anglo-Sikh War", Modern Asian Studies, 5 (1): 35–59, doi:10.1017/s0026749x00002845, JSTOR 311654, S2CID 145500298
  9. Berlinger, Mukhtar Ahmad,Rich Phillips,Joshua (2016-09-18). "Soldiers killed in army base attack in Indian-administered Kashmir". CNN. Retrieved 2023-07-21.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  10. "ஊரி தாக்குதல்: தேசிய புலனாய்வு முகமை வழக்கு பதிவு | Dinamalar". web.archive.org. 2021-09-22. Archived from the original on 2021-09-22. Retrieved 2023-07-21.
  11. "பழிக்குப்பழி: யூரி ராணுவ முகாம் தாக்குதலுக்கு இந்திய ராணுவம் பதிலடி: பாக்., பகுதிக்குள் புகுந்து பயங்கரவாத முகாம்களை அழித்தது". Dinamalar. 2016-09-30. Retrieved 2023-07-21.
  12. "Uri Municipal Committee City Population Census 2011-2023 | Jammu and Kashmir". www.census2011.co.in. Retrieved 2023-07-21.