Jump to content

ఊర్మిళ పవార్

వికీపీడియా నుండి
(ఉర్మిల పవార్ నుండి దారిమార్పు చెందింది)
Urmila pawar @ Savitribai Phule Pune University

ఉర్మిల పవార్ (జననం 1945) ఒక భారతీయ రచయిత్రి. ఆమె మరాఠి భాషలో రచనలు చేస్తుంది. ధర్మరాజన్ ప్రకారం తాను రచయిత్రిగా, స్త్రీ గా, దళిత స్త్రీగా ఎదుర్కొన్న ఇబ్బందులు, అనుభవాలు తన రచనలలో ప్రతిబింబుస్తుంటాయి.

జీవిత చరిత్ర

[మార్చు]

భారత దేశ౦ లో మహారాష్ట్ర లోని బోంబే ప్రెసిడెన్సీ రత్నగిరి జిల్లాలో పవార్ జన్మించింది. ఆమె కుటుంబం సాంప్రదాయంగా వెదురు బుట్టలను అల్లే సముదాయానికి చెందినది. బాల్యంలోనే తన తండ్రిని కోల్పోయింది. తన ముగ్గురు చెల్లెళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళను పోషించడాడినికి తన తల్లి బతుకంతా యుద్ధమే చేసింది. పుట్టింది దళిత కుటుంబం అయినా తన పూర్వీకుల వృత్తి మేదరిపని. తల్లి త్యాగం, వ్యవస్థ చేసిన కుల గాయాలు ఆమెను దేశం గర్వించదగిన రచయిత్రినీ, చరిత్రకారిణిని, స్త్రీవాదిని చేశాయి. ఏ తరగతి గదులు ఆమెను 'అంటరానిది, మురికిది' అని ముద్రవేశాయో, ఏ తరగతి గదులు ఆమెను అవమాన పరిచాయో, అవే తరగతి గదుల్లో ఆమె బతుకు పాఠాలు బడి పారాలు అయ్యాయి. తన అసలు పేరు విమల. సహచరుడు అంబేద్కర్ ఆలోచనపరుడూ అయిన హరిశ్చంద్రతో పెళ్లి తర్వాత విమల ఊర్మిళ పవార్ అయ్యింది. ఉర్మిళది అల్లిక సంస్కృతి. ఒక వైపు వాళ్ళ అమ్మ తన జీవిక కోసం బుట్టలు అల్లడం ఇంకో వైపు ఊర్మిళ తన నడిచి వచ్చిన కష్టాలు, నష్టాలు అల్లుకుంటూ ఒక రూపం ఇవ్వడం, ఇద్దరూ ఏకకాలంలో చరిత్ర నిర్మిస్తూ ఉన్నారు.

1970లలో రత్నగిరి నుండి బొంబాయికి మారాక అక్కడి కవులు రచయితలు మేధావుల కలయికతో మొదట మైత్రిని, 'సంవాదిని' అనే సాహితీ మిత్రమండలితో కలిసి స్త్రీవాద సాహిత్య నిర్మాణాలు చేసింది. నాందేవ్ దసాల్, అరుణ్ కాంబై, జెవి పవార్, అర్జున్ డాంగ్లైలు ఇచ్చిన స్ఫూర్తి. షర్మిలారేగి, ఎలె నార్ల సహచర్యంలో ప్రోదిచే సుకున్న బౌదిక జ్ఞానం అట్టడుగున కనిపించని మరాఠ మహిళా చరిత్ర వెలికి తీయడానికి దోహదపడింది. వసంత మూన్ సహచరి మీనాక్షి మూన్‌తో కలిసి మహారాష్ట్ర కేంద్రంగా బయలుదేరిన స్వాభిమాన ఉద్యమాల చారిత్రిక నేపధ్యాన్ని విద్యా వ్యాప్తిని, అనాదిగా దళిత బహుజన కులాల్లో అమానవీ యమైన దేవదాసి వ్యవస్థను, మొదట అంబేద్కర్ రాజకీయ పునాదుల్లో అనామకంగా మిగిలిపోయిన స్త్రీవాద రాజకీయాలను, దళిత స్త్రీవాద నిర్మాణాలకు ఒక రూపం ఇవ్వాలనుకుంది. యాభయ్యోదశకం మొదలు నేటి దాకా సాంస్కృతిక నిర్మాణంలో ఉన్న దాదాపు యాబై మందికి పైగా స్త్రీల బతుకు చిత్రాలను మొదట మరారలో, ఆ తర్వాత గ్లంలో ఆమె వ్రాసిన 'వి అలా మేడ్ హిస్టరీ' మేధావుల విమర్శకుల అభిమానాన్ని పొందింది. రమాబాయి అంబేద్కర్ మొదలు రాధాబాయికాంబై, బేబీకాంప్లె.ఎందరో అట్టడుగున కనిపించని కథలు బయటకు తేవడం దేశ స్త్రీవాద రాజకీయాలకు ఒక మేధో చేయూత నిచ్చింది. ఆమె అనుభవించిన వివక్ష ఉద్వేగాల కొలిమిలోంచి పురుడుపోసుకున్న 'సిక్స్ ఫింగర్, ఉదాన్' 'అయదన్' రెండు ఏకాంకికలతో బాటు యాత్రా కథనాలపై నాందేడ్, వారా, ముంబై. ప్రపంచ వ్యాప్తంగా అనేక పేరుమోసిన విశ్వవిద్యాల యాలలో ఆమె ఆత్మకథ మీద చర్చలు పరిశోధనలు జరుగుతున్నాయి. అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులకు పరిశోధనా పత్రాలు సమర్పించి, వందలాది సదస్సులలో పాల్గొన్న ఆమె ఈ తరానికే కాదు రాబోయే తరాలకూ ఒక ధిక్కార పతాక, 'నేను సావిత్రి బాయిపూలే' నాటకాన్ని రాసి అందులో నటించిన ఆమె సాహిత్యం అనేక భాషల్లోకి అనువాదం జరిగి, రేడియో, వివిధ టీవీ ఛానల్లలో కథా వస్తువు అయ్యాయి. జబ్బార్ పటేల్ తీసిన ఆంబేద్కర్ సినిమాకి కూడా ఆమె పని చేసారు.. పందొమ్మిది వందల డెబ్బైలలో మొదలైన 'దళిత్ పాంథర్స్ దేశ స్వాభిమాన ఉద్యమాలకు ఒక దిక్సూచి. దానిలో మహిళా ప్రాతినిధ్యం లేకపోవడాన్ని సూటిగా ప్రశ్నించింది. ఆకలి, అవమానం, నిరక్ష్యరాస్యత, అంధ విశ్వాసాలతో సతమతం అవుతున్న మహిళలకు రాజకీయ, సాహిత్య నిర్మాణాలు ఉండాలని ఉద్యోగాన్ని, కుటుంబాన్ని వదిలి తన సాహిత్య జీవిత గమనాన్ని నిర్మించుకుంది. పదిహేను ఏళ్ళకింద మరాఠీలో 'ఆయదాన్గా, ఆంగ్లంలో 'వీవ్ అఫ్ మై లైఫ్' పేరుతో రాసుకున్న ఆత్న వ్యధాత్మక కధనం అస్తిత్వ రాజకీయాలలో, స్వాభిమాన పోరాటాలలో చెరిగిపోలేని సంతకం. తన మాతృభాషలో రాసిన దానిని ఆంగ్లంలో ఎఫ్లూ అధ్యాపకురాలు మాయ పండిట్ అనువదించగా ప్రఖ్యాత కొలంబియా విశ్వ విద్యాలయం ప్రచురించింది. ఆమె రచనలు అనేక భాషలలోకి అనువాదం అయ్యాయి. గడిచిన ఏడు దశాబ్దాల దళిత మహిళ గుండె చప్పుడు 'అయదాన్'. 'ఇది కేవలం నా కథ కాదు. నా మూలవాసుల ఆత్మకథ. నేను పొందిన అను భూతులూ అనుభవాలు నాసొంతం కావు. అవి ప్రజల సామూహిక దుఖం నుండి పురుడు పోసుకున్న ఆకాంక్షలు' అని రాసుకుంది. ఇష్టపడి చేసుకున్న హరి శ్చంద్ర, వైద్య విద్య చదువుతున్న ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన క్షోభనుంచి తధాగతుని తత్వాల అనువాదంలో సాంత్వన పొందింది. ఆధిపత్య కులాల, స్త్రీ హక్కుల మధ్య అనాకారిగా మిగిలిన దళిత మహిళ అస్తిత్వ పునాదుల్లో ఊర్మిళా పవార్ నడిపిన రాజకీయాలు ఉన్నాయి. జాత్యహం కార వ్యతిరేక డర్బన్ సదస్సు మొదలు బీజింగ్లో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సు, మహారాష్ట్ర కేంద్రంగా జరిగిన అనేక స్వాభిమాన పోరాటాలలో ఆమె ప్రాతినిథ్యం ఉంది. ఆమె ఈ కాలపు నిజమైన ఆచరణ వాది. పెంచి పెద్దచేసిన తల్లి, తండ్రి, తమ్ముడు, కొడుకు, భర్త ఒక్కొక్కరు దూరం అయిన ఆమె కల్లోల జీవి తానికి రచనావ్యాపకం మాత్రమే సాంత్వన అయ్యింది. 'అసమర్థుని జీవయాత్ర', పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా లాంటి రచనలు చేసిన గొప్ప సాహితీవేత్త గోపీచంద్. అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితం అయిన ఊర్మిళాపవార్డు గోపీచంద్ పేర ఏర్పడిన పురస్కారం లభించడం యాదృచ్ఛికు కాదు.[1]

తను మహారాష్ట్ర ప్రభుత్వ ప్రజా పనుల విభాగంలో ఉద్యగిగా విరమించారు. మహారాష్ట్ర సాహిత్య పరిషద్ చె ఇవ్వబడిన లక్ష్మిబాయ్ థిలక్ పురస్కారాన్ని తను వ్రసిన "ఆయ్ధన్" ఆత్మకథ కొరకు అందుకున్నరు. డా. బి.అర్.ఆంబేత్కర్ 1956 లో బౌద్ద మతం లోనికి మర్చిన అనంతరం తను కూదా తన సముదయం లోని ఇతర సభ్యుల వలే బౌద్ధమతం లోకి మార్చ బడ్దారు.

మహాద్ సత్యాగ్రహా మరి అంతర్ భొజనం

[మార్చు]

తన యొక్క ఆత్మకత "ఆయిధన్"లో అంబెద్కర్ చె నిర్వహింప బడిన మహద్ సత్యగ్రహ లో గాని సవర్కర్ చె నిర్వహింపబడిన అంతర భోజనాలలో గాని తన తండ్రి పాల్గొన లేదని తను ప్రస్తావించింది.

ఆయధన్(నా జీవిత నేత: ఒక దళిత స్త్రీ జ్ఞాపకాలు)[2]

[మార్చు]

తను వ్రాసిన ఆత్మకథ "ఆయిధన్"ను ఆ౦గ్లభాష లొనికి "ద వీవ్ ఆఫ్ మై లైఫ్" : అ దళిత్ ఉమెన్ మెమొఇర్స్ అని తర్జుమా చెయబదినది. ఆంగ్లము లోనికి తర్జుమా చేయబదిన ముందు మాటలో వందన సొనాల్కర్ ఈ పుస్తకం యొక్క టైటిల్ 'నెత' అన్నది పవర్ వ్రాత టెక్నిక్ లోని రూపకంగా వాడబదినది అని పేర్కొన్నరు. తన కుతుంబం లోని ఇతర సభ్యుల యొక్క, తన భర్త కుతుంబము, పొరుగు వారి, క్లాస్మేట్ల జీవితాలను ఒక కథనంగా అల్లి, వాటి ద్వారా క్రమంగా అనుధిన దళితుల జీవితాల లోని వెర్వెరు అంశాలను భహిర్గతం చేసినట్టుగా చెప్పబదినది. అనేక మైన మార్గాలలో ఉద్యమంగా వారు నలిగిన విధానాన్ని చూపుతుంది.

మూలాలు

[మార్చు]
  1. "కొంకణ్ తీరంలో నల్ల కలువ". Archived from the original on 2018-09-07. Retrieved 2018-09-07.
  2. రెగె, షర్మిల. "writing caste writing gender". googlebooks.com. zubaan.