ఉర్లగత్తు
Appearance
ఉర్లగత్తు | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°56′N 79°19′E / 13.94°N 79.31°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కడప |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516101 |
ఎస్.టి.డి కోడ్ |
ఉర్లగత్తు , వైఎస్ఆర్ జిల్లా, కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1] ఈ పంచాయతీ పరిధిలోని పొట్టిపాటి వారి పల్లె (కాపు పల్లె) లో 1927 లో జన్మించిన శ్రీ పొట్టిపాటి ఓబుల్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన నిప్పో బ్యాటరీస్ పరిశ్రమ వ్యవస్థాపకులు. వీరి తండ్రి పేరు గూడా వీరి పేరే - "ఓబుల్ రెడ్డి" యే. తల్లి పిచ్చమ్మ. వీరు ప్రాథమిక విద్యను ఇక్కడే పూర్తిచేసుకొని, పై చదువులకై మద్రాసు (ఇప్పటి చెన్నై) వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ చదివినారు. పారిశ్రామిక రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నా పుట్టిన వూరులో 2001 లో కోదండ రామాలయం నిర్మించారు. గ్రామంలో వీధులన్నీసిమెంట్ రహదారులుగా చేశారు. కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విరాళాలిచ్చారు. వీరు 2008 లో కాలధర్మం చెందినారు.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.