ఉషా మెహతా
ఉషా మెహతా Usha Mehta | |
---|---|
జననం | |
మరణం | 2000 ఆగస్టు 11 | (వయసు 80)
వృత్తి | ప్రొఫెసర్, కార్యకర్త |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | స్వాతంత్ర్య పోరాటం |
పురస్కారాలు | పద్మ విభూషణ్ |
ఉషా మెహతా (1920 మార్చి 25 - 2000 ఆగస్టు 11[1] ) భారతదేశానికి చెందిన గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధురాలు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో 1942 సంవత్సరంలో కాంగ్రెస్ రేడియో నిర్వహించినందుకు ఈమె జనాదరణ పొందింది.1998 లో, భారత ప్రభుత్వం , ఈమెకు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను అందజేసింది.
తొలినాళ్లలో
[మార్చు]ఉషా మెహతా గుజరాత్ రాష్ట్రం సూరత్ సమీపంలోని సరస్ గ్రామంలో జన్మించింది. [2] ఈమె ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మొదటి సారి అహమ్మదాబాదులో గాంధీజీని కలిసింది. ఆ తర్వాత కొంత కాలానికి గాంధీజీ స్థాపించిన ఒక ఆశ్రమంలో జరిగిన కార్యక్రమాలలో ఉష చురుకుగా పాల్గొంది.
1928 లో, ఉష తన ఎనిమిదేళ్ళవయసులో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన కవాతులో పాల్గొంది. మద్యం దుకాణాల మూసివేత, బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేక పోరాటాలలో ఉష పాల్గొంది.
ఉష తండ్రి బ్రిటిష్ రాజ్లో న్యాయమూర్తిగా పనిచేసేవాడు. ఈ కారణంచేత ఆమె తండ్రి నుండి సరైన ప్రోత్సాహం లభించలేదు, ఆ తరువాత 1930 ఆమె తండ్రి పదవి విరమణ పొందిన తరువాత ఈమె స్వాతంత్ర్య పోరాటంలో మరింత చురుకుగా పాల్గొంది.
స్వాతంత్ర్య పోరాటంలో
[మార్చు]గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా 1942 ఆగస్టు 9న ముంబైలోని గోవలియా ట్యాంక్ మైదానం వద్ద ర్యాలీని ప్రకటించింది.
1942 ఆగస్టు 14 నుండి ఉషా కొంతమంది మద్దతుదారులతో కలిసి రహస్యంగా కాంగ్రెస్ రేడియోని స్థాపించి నడపడం మొదలెట్టింది. ఆగస్టు 27వ తారీకు నుండి ప్రజలకు ఈ రేడియో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రేడియో బ్రాడ్కాస్టింగ్ లో గాంధీ ఇచ్చిన సందేశాలతో పాటు వివిధ ముఖ్యమైన నాయకుల ప్రసంగాలను ప్రసారం చేశారు.అయితే రహస్యంగా నడుపుతున్నా ఈ రేడియో స్టేషన్ గురించి కనుక్కున్న పోలీసులు 1942 నవంబర్ 12న ఉషా మెహతాతో సహా మిగిలిన నిర్వాహకులు అందరిని అరెస్టు చేసి జైల్లో వేశారు.
బాహ్య లింకులు
[మార్చు]- డాక్టర్ ఉషా మెహతా Archived 2007-06-30 at the Wayback Machine
మూలాలు
[మార్చు]- ↑ Noted Gandhian Usha Mehta Dead Archived 2022-11-26 at the Wayback Machine, M.K. Gandhi.org.
- ↑ Abdul, Geneva (2021-05-13). "Overlooked No More: Usha Mehta, Freedom Fighter Against British Rule in India". The New York Times. ISSN 0362-4331. Retrieved 2021-06-05.