ఊత్తుక్కాడు వేంకట కవి / వేంకటసుబ్బయ్యర్
ఊత్తుక్కాడు వేంకటకవి | |
---|---|
దస్త్రం:Oothukkadu Venkata Kavi Painting.jpg | |
జననం | 1700 మన్నార్ గుడి, తమిళనాడు |
మరణం | 1765 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | వాగ్గేయకారుడు |
తల్లిదండ్రులు |
|
ఊత్తుక్కాడు వెంకట కవి / ఊత్తుక్కాడు శ్రీ వెంకట సుబ్బయ్యర్ (1700 - 1765) కర్ణాటక సంగీత కృతికర్త. కమలనయని, రామచంద్ర వాతూల దంపతులకు ఆవణి మాసం(శ్రావణ) మహా నక్షత్రంలో తమిళనాడులోని దక్షిణ ద్వారకగా పేరుపొందిన మన్నార్ కుడి అనే ఊరిలో జన్మించారు. పుట్టినది తల్లిగారి స్వథలమైన మన్నారికుడి అయినా పెరిగినదంతా పాపనాశం సమీపానున్న దేనుజవాసపురం అనమ్బడే ఊత్తుక్కాడు గ్రామంలోనే.
చిన్నతనంలోనే ఈయనకు సంగీతం మీదమక్కువ ఉండేది. నీడామంగళం నటేశరత్న భాగవతుల వద్ద సంగీతం నేర్చుకున్నారు. అతితక్కువ కాలంలోనే ఈయన సంగీత సాధన పూర్తయినది. "ఇంగ నేర్పడానికి నా దగ్గర ఏమీలేదు. నాకు తెలిసినదెల్లా నేర్పించేశాను. వేరే ఎవరైనా గురువుని వెతుక్కుని నేర్చుకోవలసినది ఏమైనా ఉంటేనేర్చుకో" అన్నారు గురువులు నటేశరత్నం గారు. అప్పటిలో గురువులెవ్వరు దొరకక తల్లిగారి మాట విని ఆ శ్రీకృష్ణ పరమాత్మనే గురువులుగా ఎన్నుకున్నారు వంకట సుబ్బయ్య గారు. రోజురోజుకీ ఈయనకు కృష్ణుతత్వంలో లీనమైపోయారు. కృష్ణుని లీలలను రచించడం మొదలుపెట్టారు.
ఈయనకున్న ఏకైక శిష్యుడు రుద్రపశుపతి నాయకుడు. మిగిలిన శిష్యులందరూ సుబ్బయ్య గారి సోదరుల పుత్రికలే. సోదరడు కాట్టు కృష్ణయ్యర్ గారి పుత్రిక వంశంలోని 6వ తరంవారు నీడామంగళం కృష్ణమూర్తి భాగవతులు ఇప్పటికీ ఈయన రచనలను పాడుతూ, పుస్తకరూపంలో అచ్చు వేయిస్తూనూ ఉన్నారు. కాట్టుకృష్ణయ్యర్ గారి మరో పుత్రిక వంశస్తులైన కళ్యాణసుందరం, రాజగోపాలన్, ముత్తుకృష్ణన్ ముగ్గరూ కలిసి "ఊత్తుక్కాడు సోదర్లు" అనే పేరుతో వెంకట సుబ్బయ్యగారి పాటలను ఆలపిస్తున్నారు.
జీవిత విశేషాలు
[మార్చు]సంగీత ప్రతిభ , ప్రయోగాలు
[మార్చు]కీర్తనలు
[మార్చు]సప్తరత్నాలు
[మార్చు]- భజనామృత – నాట
- అగణిత మహిమ – గౌళ
- మాధవ హృది కేళిని' – మేచకళ్యాణి రాగము
- బాలసరస మురళి – కీరవాణి
- జటాధర – హనుమతోడి రాగం
- అలవదెన్నలో – పరస్
- సుందర నందకుమార – మధ్యమావతి
కామాక్షి నవవర్ణాలు
[మార్చు]- శ్రీ గణేశ్వర – షణ్ముఖప్రియ
- వచసి యది కుశలమ్ – మేచకళ్యాణి రాగము
- సంతతం అహం – దేశాక్షి రాగము
- భజస్వ శ్రీ త్రిపుర సుందరి – నాదనామక్రియ రాగము
- సర్వజీవ దయాపరి – శుద్ధసావేరి రాగము
- యోగ యోగేశ్వరి – ఆనందభైరవి రాగము
- నీలలోహిత రమణి – బాలహంస రాగము
- సదానందమయి – హిందోళ రాగము
- సకలలోకనాయికే – ఆరభి రాగము
- శంకరి శ్రీ రాజరాజేశ్వరి – మధ్యమావతి రాగము
- నతజన కల్పవల్లి – పున్నాగ వరాళి రాగము
- శ్రీ చక్ర మాతంగి – సురటి రాగము
ఆంజనేయ పంచరత్నాలు
[మార్చు]- పవనకుమార – వసంత
- వీక్షితోహం – కేదారగౌళ
- అంజనానంద అంబోధి చంద్ర – తోడి
- శ్రీరాఘవ దూతం – సురుటి
- అంజనానంద అంబోధి చంద్ర – తోడి
- భక్తభాగధేయ – మధ్యమావతి