ఎంఎంఓఎఫ్
ఎంఎంఓఎఫ్ | |
---|---|
దర్శకత్వం | యెన్.ఎస్.సి |
నిర్మాత | ఎన్.రాజశేఖర్ |
ఛాయాగ్రహణం | గరుడవేగ అంజి |
కూర్పు | గరుడవేగ అంజి |
సంగీతం | ఎన్.రాజశేఖర్ |
నిర్మాణ సంస్థ | ఆర్.ఆర్.ఆర్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 26 ఫిబ్రవరి 2021 |
సినిమా నిడివి | 108 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎంఎంఓఎఫ్(MMOF/70MM) 2021లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్.ఆర్.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్.రాజశేఖర్ నిర్మించిన ఈ సినిమాకు యెన్.ఎస్.సి దర్శకత్వం వహించాడు. జె. డి. చక్రవర్తి, సాయి అక్షత, బెనర్జీ, అక్షిత ముద్గల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 26 ఫిబ్రవరి 2021న విడుదలైంది.[1]
కథ
[మార్చు]దీపక్ (జేడీ చక్రవర్తి) కార్ఖాన సెంటర్‌లో ఓ ధియేటర్ ఓనర్. వాళ్ళ నాన్న గారి చేసిన అప్పులతో ఆస్తులన్ని పోయి ఒక్క థియేటర్ మాత్రమే మిగులుతుంది. చివరికి అదే వాళ్ల ఇల్లు అవుతుంది. నాన్న చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి గత్యంతరం లేక ఆ థియేటర్‌లో సెక్స్ సినిమాలు ఆడిస్తూ జీవతం నడిపిస్తుంటాడు. అయితే సడెన్ గా ఆ థియేటర్‌లో సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళలో కొంతమంది చచ్చిపొతుంటారు. వాళ్ళు అలా ఎందుకు చచ్చిపోతున్నారు. వాళ్ళని ఎవరైనా హత్య చేసారా ? అసలు ఆ థియేటర్ లో ఏముంది ? ఆ సమస్యల నుంచి దీపక్ ఎలా బయట పడ్డాడు అనేది మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
[మార్చు]- జె. డి. చక్రవర్తి
- సాయి అక్షత [3]
- అక్షిత ముద్గల్
- బెనర్జీ
- శ్రీ రాంచంద్ర
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆర్.ఆర్.ఆర్ ప్రొడక్షన్స్
- నిర్మాత: ఎన్.రాజశేఖర్
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: యెన్.ఎస్.సి
- సంగీతం: సాయి కార్తీక్
- సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి
- ఎడిటర్: ఆవుల వెంకటేష్
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (26 February 2021). "MMOF Movie: Showtimes". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
- ↑ The Times of India (26 February 2021). "JD Chakravarthy's MMOF – 70 MM will not disappoint you - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
- ↑ The Times of India (22 February 2021). "I learned a lot from JD Chakravarthy during the film shooting, says 70 MM actress Akshatha Srinivas - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.