ఎం.టి. పద్మ
ఎం.టి. పద్మ | |||
మత్స్య, గ్రామీణాభివృద్ధి, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1991 – 1996 | |||
పదవీ కాలం 1987 – 1996 | |||
ముందు | మణిమంగళత్ కుట్టియాలీ | ||
---|---|---|---|
తరువాత | పి. విశ్వన్ | ||
నియోజకవర్గం | కోయిలండి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1943 జనవరి 9 కన్నూరు, కేరళ | ||
మరణం | 2024 నవంబర్ 12 ముంబై | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | ఎం. గోవిందన్, కౌసల్య | ||
జీవిత భాగస్వామి | ఎం. రాధాకృష్ణన్ | ||
సంతానం | 1 కొడుకు, 1 కూతురు | ||
మూలం | [1] |
ఎం.టి. పద్మ (9 జనవరి 1943 - 12 నవంబర్ 2024) కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె కోయిలండి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 1991 నుండి 1995 వరకు కె. కరుణాకరన్, ఎ.కె.ఆంటోనీ మంత్రివర్గంలో మత్స్య, గ్రామీణాభివృద్ధి, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా పని చేసింది.
రాజకీయ జీవితం
[మార్చు]ఎం.టి. పద్మ లా కాలేజీలో చదువుతున్న సమయంలో కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్‌యూ)తో ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి జిల్లా ఉపాధ్యక్షురాలిగా, కేఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేసి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి కెపిసిసి సభ్యురాలిగా, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, సేవాదళ్ కుటుంబ సంక్షేమ కమిటీ సభ్యురాలిగా, కోజికోడ్ డిసిసి కోశాధికారిగా, కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేసి 1982 కేరళ శాసనసభ ఎన్నికలలో నాదపురం శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. ఆమె 1987 కేరళ శాసనసభ ఎన్నికలలో కోయిలండి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
ఎం.టి. పద్మ 1991 కేరళ శాసనసభ ఎన్నికలలో కోయిలండి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1991 నుండి 1995 వరకు కె. కరుణాకరన్, ఎ.కె.ఆంటోనీ మంత్రివర్గంలో మత్స్య, గ్రామీణాభివృద్ధి, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా పని చేసింది. ఆమె ఆ తరువాత 1999లో పాలక్కాడ్, 2004లో వడకర లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి అనంతరం 2013లో కోజికోడ్ కార్పొరేషన్ ఎన్నికలలో గెలిచి కార్పొరేషన్‌లో ప్రతిపక్ష నాయకురాలిగా పని చేసింది.
మరణం
[మార్చు]ఎం.టి. పద్మ 81 సంవత్సరాల వయస్సులో 2024 నవంబర్ 12న ముంబైలో మరణించింది.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (12 November 2024). "Former Kerala Minister and Congress leader M.T. Padma dies in Mumbai" (in Indian English). Archived from the original on 19 November 2024. Retrieved 19 November 2024.
- ↑ The Times of India (12 November 2024). "Former minister and senior Cong leader MT Padma dies in Mumbai". Archived from the original on 14 November 2024. Retrieved 19 November 2024.
- ↑ The New Indian Express (13 November 2024). "Veteran Congress leader M T Padma passes away at 81" (in ఇంగ్లీష్). Archived from the original on 15 November 2024. Retrieved 19 November 2024.