ఎం.తుమ్మలపల్లె
ఎం.తుమ్మలపల్లె కడప జిల్లా వేముల మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. ఇక్కడ 2007 వ సంవత్సరంలో యుసిఐఎల్ ఆధ్వర్యంలో యురేనియం ప్లాంట్ ఏర్పాటయింది.
ఎం.తుమ్మలపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°19′17″N 78°16′03″E / 14.32152°N 78.26763°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | వేముల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516349 |
ఎస్.టి.డి కోడ్ |
పులివెందుల అర్భన్/ వేముల, జూలై 28 (కెఎన్‌ఎన్) వైఎస్ ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం మబ్బుచింతలపల్లె మజరా ఎం. తుమ్మలపల్లె గ్రామం ఇప్పుడు ప్రపంచ భౌగోళిక చిత్రపటంలో స్థానం సంపాదించుకుంది. శేషాచల అడవుల్లో భాగంగా ఎం తుమ్మలపల్లె సమీపంలోని కొండల్లో మరిన్ని యురేనియం నిక్షేపాలు ఉన్నాయని యుసిఐఎల్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఓ తరానికి సరిపడు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు మారు మూల ప్రాంతంగా, అన్నిటికీ దూరంగా ఉన్న తుమ్మలపల్లె సరిహద్దుల్లో అపారమైన యురేనియం నిక్షేపాలు ఉండటంతో యురేనియం ప్రాంతాలైన భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, మబ్బుచింతలపల్లె, కెకే కొట్టాల గ్రామాలు పురోగతి పరిపూర్ణంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి.