ఎం.బాగారెడ్డి
Jump to navigation
Jump to search
ఎం.బాగారెడ్డి | |||
మాజీ ఎమ్మెల్యే , మాజీ ఎంపీ
| |||
నియోజకవర్గం | మెదక్ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 17 జూన్ 1930 మలిచల్మ గ్రామం , జహీరాబాద్ మండలం , మెదక్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం | ||
మరణం | 4 జూన్ 2004 | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | యశోద రెడ్డి | ||
సంతానం | ఒక కుమార్తె , ఇద్దరు కుమారులు(మోగిలిగుండ్ల జైపాల్ రెడ్డి) | ||
నివాసం | హైదరాబాద్ |
మొగలిగుండ్ల బాగారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఎం.బాగారెడ్డి 17 జూన్ 1930లో తెలంగాణ రాష్ట్రం , మెదక్ జిల్లా , జహీరాబాద్ మండలం , మలిచల్మ గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా అందుకున్నాడు.
రాజకీయ జీవితం
[మార్చు]- మలిచల్మ గ్రామ సర్పంచ్[2]
- 1957 నుండి 1972 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడు
- 1957 నుండి 1962 జహీరాబాద్ శాసనసభ్యుడు
- 1962 నుండి 1964 మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్
- 1962 నుండి 1967 - జహీరాబాద్ శాసనసభ్యుడు
- 1967 నుండి 1972 - జహీరాబాద్ శాసనసభ్యుడు
- 1972 నుండి 1978 - జహీరాబాద్ శాసనసభ్యుడు
- 1978 నుండి 1983 - జహీరాబాద్ శాసనసభ్యుడు
- 1978 నుండి 1983 - రాష్ట్ర పంచాయతీరాజ్, భారీ పరిశ్రమలు, రెవెన్యూ శాఖ మంత్రి [3]
- 1983 నుండి 1985 - జహీరాబాద్ శాసనసభ్యుడు
- 1984 - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్
- 1985 నుండి 1989 - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత
- 1985 నుండి 1989 - జహీరాబాద్ శాసనసభ్యుడు
- 1989 నుండి 1991 - మెదక్ లోక్‌సభ ఎంపీ
- 1991 నుండి 1996 - మెదక్ లోక్‌సభ ఎంపీ
- 1996 నుండి 1998 - మెదక్ లోక్‌సభ ఎంపీ
- 1998 నుండి 1999 - మెదక్ లోక్‌సభ ఎంపీ
ఆయన చివరిసారి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆలె నరేంద్ర చేతిలో ఓడిపోయాడు.[4][5]
మరణం
[మార్చు]ఎం.బాగారెడ్డి 4 జూన్ 2004లో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్య పొందుతూ మరణించాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ EENADU (26 April 2024). "పంచాయతీ నుంచి లోక్‌సభకు." Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
- ↑ BBC News తెలుగు (31 October 2018). "ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
- ↑ Sakshi (28 March 2019). "ప్రజా నాయకుడు". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
- ↑ News18 Telugu (10 March 2019). "మెదక్ పార్లమెంటు స్థానం.. దిగ్గజనేతల రాజకీయ ప్రస్థానం". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Zee News (4 June 2004). "Congress leader Bagareddy dead" (in ఇంగ్లీష్). Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
http://loksabhaph.nic.in/writereaddata/biodata_1_12/3392.htm