ఎం.సీతారామమూర్తి
మంథాట సీతారామమూర్తి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 మార్చి 18 | |||
నియమించిన వారు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం | ||
---|---|---|---|
పదవీ కాలం 2016 మార్చి 2 – 2020 జనవరి 15 | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1958, జనవరి 16 కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
జీవిత భాగస్వామి | శ్రీమాత | ||
సంతానం | శ్రుత కీర్తి, ఎంఎస్. అచ్యుత్ చిట్టెన్న | ||
పూర్వ విద్యార్థి | ఆంధ్రా యూనివర్సిటీ |
మంథాట సీతారామమూర్తి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2016 మార్చి 2 నుండి 2020 జనవరి 15 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించాడు. ఎం.సీతారామమూర్తి 2021 మార్చి 18న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నియమితుడై,[1] 24న బాధ్యతలు చేపట్టాడు.[2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఎం.సీతారామమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలో 1958 జనవరి 16న జన్మించాడు. ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేసి న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.
వృత్తి జీవితం
[మార్చు]ఎం.సీతారామమూర్తి లా పూర్తి చేశాక న్యాయవాదిగా 12 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేసి, 1996లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యాడు. ఆయన 1996–97లో బెస్ట్ ట్రైనీ జిల్లా జడ్జిగా బంగారు పతకం అందుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీబీఐ స్పెషల్ జడ్జి, విశాఖపట్నం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, విజయనగరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, రంగారెడ్డి ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా, హైకోర్టు రిజిస్టర్ జనరల్‌గా విధులు నిర్వహించాడు.
ఎం.సీతారామమూర్తి 2013 అక్టోబర్ 23న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుడై రాష్ట్ర విభజన తర్వాత 2016 మార్చి 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 2020 జనవరి 15న హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు. ఎం.సీతారామమూర్తి 2021 మార్చి 18న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నియమితుడై,[3] 24న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
మూలాలు
[మార్చు]- ↑ Prajatantra News (17 March 2021). "రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామ మూర్తి". Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.
- ↑ Sakshi Education (26 March 2021). "ఏపీ హెచ్ఆర్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్ న్యాయమూర్తి". Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.
- ↑ Sakshi (18 March 2021). "హెచ్చార్సీ చైర్మన్‌గా జస్టిస్ సీతారామమూర్తి". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.