ఎగ్గోని పుష్పలత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రెవరెండ్ ఎగ్గోని పుష్పలత మహిళా బిషప్‌. నంద్యాల చర్చి బిషప్‌. పుష్పలలిత భారతదేశంలో చర్చి బిషప్‌గా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ. ఐర్లాండ్ చర్చి బిషప్‌గా ఒక మహిళ రెవరెండ్ ప్యాట్రిక్ స్టోరేను నియమించిన తర్వాత రోజే పుష్పలలితను నంద్యాల చర్చి బిషప్ నియమించడం జరిగింది.సెప్టెంబర్ 30న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి బిషప్ జి. దేవకదాశం చేతులమీదుగా పుష్పలలిత బాధ్యతలు స్వీకరించారు[1].కర్నూలు జిల్లాలోని దిగువపాడు గ్రామంలో జన్మించిన పుష్పలలిత 1984లో క్రైస్తవ మత గురువుగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు చర్చి సమాజాలకు పుష్పలలిత ఛైర్ పర్సన్‌గా పనిచేశారు. 2005 నుంచి రెండేళ్లపాటు నంద్యాల చర్చి ప్రాంతీయ పరిధిలో కోశాధికారిగా కూడా ఆమె విధులు నిర్వహించారు. 400 గ్రామాల్లోని ప్రజలకు విద్యా, ఆరోగ్య విషయాలపై అవగాహన కలిగించారు. దేశంలో రెండో బిషప్‌గా పుష్పలలిత నియామకం కాగా మొదటగా 1996లో రెవరెండ్ అలివేలి కాదక్షమ్మను గుడ్ సమరిటన్ ఎవంజిలికల్ లూథరన్ చర్చి తన బిషప్ గా నియమించుకుంది[2]

మూలాలు[మార్చు]