ఎడవ బషీర్
ఎడవ బషీర్ | |
---|---|
జననం | 1943 డిసెంబరు 2 ఎడవ, తిరువనంతపురం, కేరళ |
మరణం | 2022 మే 28 అలప్పుజా, కేరళ |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | గాయకుడు, గాయక బృందం నిర్వాహకుడు |
ఎడవ బషీర్ (1943 డిసెంబరు 2 - 2022 మే 28) మలయాళ సినిమా నేపథ్య గాయకుడు. అతను 'గాన మేళా'తో ఎంతో ప్రాముఖ్యత సంపాందించుకున్నాడు. అకార్డియన్ వంటి ఆధునిక వాయిద్యాలు మొదట గాయక బృందానికి పరిచయం చేసాడు. ఏసుదాస్, రఫీ పాటలతో అభిమానులను ఉర్రూతలూగించేవాడు. కేరళలో సంకీర్తనల రూపురేఖలు మార్చిన ఘనత ఆయనది.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అతను కొల్లాం జిల్లాకు ఆనుకుని ఉన్న తిరువనంతపురం జిల్లాలోని ఎడవ గ్రామంలో జన్మించాడు. ఎనిమిదో తరగతి వరకు అక్కడే చదివాడు. ఆ తరువాత కుటుంబం కొల్లంకు వెళ్లి, క్రీస్తురాజ్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివాడు. సంగీత విద్వాంసుడు కోడంపల్లి గోపాల్ పిళ్లై వద్ద శాస్త్రీయ సంగీతంలో మొదట పాఠాలు నేర్చుకున్నాడు. రత్నాకరన్ భాగవతార్, వేచూర్ హరిహర సుబ్రమణ్యంల వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించాడు. కొల్లాంలోని మ్యూజిక్ మ్యూజియంలో అతను బస చేసేవాడు. స్వాతి తిరునాళ్ మ్యూజిక్ అకాడమీ నుంచి అకాడమిక్ డిగ్రీ 'గానభూషణం' పట్టా పుచ్చుకున్నాడు. 1972లో కొల్లంలో 'సంగీతాలయ' గాన మేళాన్ని ప్రారంభించాడు. ఎడవ బషీర్ తన పాఠశాల రోజుల నుంచి పాటలు పాడుతూ సంగీతంలో అనేక అవార్డులు, బహుమతులు అందుకున్నాడు. ఆయన దేశవిదేశాలలో ఎన్నో పాటల ప్రదర్శనిచ్చారు. రఘువంశం అనే సినిమాకు మొదటిసారిగా నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఆల్ కేరళ మ్యూజిషియన్స్ అండ్ టెక్నిషియన్స్ వెల్ఫేర్ అసోషియేషన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు.[2]
మరణం
[మార్చు]2022 మే 28న తన 78 ఏళ్ళ వయసులో అలప్పుజాలో జరిగిన బ్లూ డైమండ్ ఆర్కెస్ట్రా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా వేదికపై పాట పాడుతూనే కూప్పకూలి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.[3] ప్రముఖ గాయకుడు ఏసుదాసు పాడిన మానో హో తుమ్ అనే హిందీ పాటను ఆలపిస్తుండగా అతనికి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. అతనికి ఇద్దరు భార్యలు రషీదా, రెహ్నా, పిల్లలు ఉల్లాస్, బీమా, ఉమేశ్, ఉషుస్ సీత్తా ఉన్నారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Reporter, Staff (2022-05-28). "Singer Edava Basheer dead". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-06-07.
- ↑ "Singer Edava Basheer dies during a live concert - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-06-07.
- ↑ "Veteran Malayali Singer Edava Basheer Dies At 78 During Music Live Concert - Sakshi". web.archive.org. 2022-05-30. Archived from the original on 2022-05-30. Retrieved 2022-05-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Singer Edava Basheer collapses on stage, dies". English.Mathrubhumi (in ఇంగ్లీష్). Retrieved 2022-06-07.