ఎన్.గోపాలకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎన్.గోపాలకృష్ణ తెలుగు సినిమా దర్శకులు, రచయిత. ఆయన లక్ష్మణరేఖ అనే తెలుగు సినిమా ద్వారానే అందరికీ సుపరిచితులు. వివిధ అంశాలపై పలు గ్రంథాలను వెలువరించిన ఆయన ఋషుల గురించి రాసిన గ్రంథం చాలా విలువైనది.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయనది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట గ్రామం. ఆయన అక్టోబరు 27, 1942 న తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం లో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. ఆయన ఇంటర్మీడియట్ అమలాపురం లోనూ, బి.ఎస్.సి రాజమండ్రి లో చేసారు. ఆయనకు ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడే నాటకాలపై అభిరుచి ఉండేది. సినిమాలపై కూడా ఆసక్తి ఉండేది. క్రమంగ సినిమా మేకింగ్ పైన, నటన పైనా ఆయనకు ఆసక్తి పెరిగింది. ఆయన ఆసక్తిని గమనించిన ఆయన స్నేహితుడు "దంతవేదాంతం" అనే నాటకంలో స్త్రీ పాత్ర వేయమని సలహా యిచ్చారు. ఆయన ఆ పాత్రలో మొట్టమొదట నటించారు. అది సక్సెస్ కావడంతో "బెస్ట్ హీరోయిన్ ఆఫ్ ది కాలేజ్" అనే అవార్డు ఆయనకు వచ్చింది.[2]

సినీరంగ ప్రవేశం[మార్చు]

ఆయన కళాశాల హాస్టల్ లో ఉన్నప్పుడు అదే హాస్టల్ లో ఉన్న చంద్రమోహన్ తో స్నేహం ఏర్పడింది. చంద్రమోహన్ ఆడవేషాలు వేయమని అడిగేవాడు. గోపాలకృష్ణ ఆడవేషాలు వేస్తే దానికే తరువాత పరిమితమయిపోతారనే భయంతో తరువాత ఆడ వేషాలకు ఒప్పుకోలేదు. నాటకాలలో పేరు రావడంతో సినిమాలలో ట్రై చేయ్యమని మిత్రులు సలహాలు ఇస్తూ ఉండడంతో ఆయన సెకండ్ యియర్ పూర్తి కాకుండానే చెన్నై వెళ్ళిపోయారు. అద్దార నారాయణరావు అనే హాస్యనటుడు ఆయనకు దూరపు చుట్టం. ఆయన ద్వారా రాజబాబు తో పరిచయం జరిగింది. అద్దార నారాయణ రావు గారు డిగ్రీ పూర్తి అయిన తర్వాత వస్తే అవకాశాలు చూడవచ్చని సలహా యివ్వడంతో మరలా కళాశాలలో చేరి మూడవ సంవత్సరం కూడా పూర్తిచేసారు. తరువాత మరలా చెన్నై వెళ్ళి నారాయణరావుని కలిసారు. ఆయన ఆసక్తిని గమనించిన ఆయన దర్శకత్వ శాఖలో చేరమని సలహా యిచ్చాడు. ఆయన దర్శకుడు తాపీ చాణక్య వద్ద అప్రంటిస్ గా అవకాశం వచ్చేటట్లు చేసారు. "వారసత్వం" సినిమా పూర్తి కావడంతో చాణక్య గారి వద్ద సినిమాలు లేకపోవడంతో ఆయన దర్శకుడు వి. మధుసూదనరావు దగ్గర చేరారు. "వీరాభిమన్యు" చిత్రంలో పనిచేసారు. వీరాభిమన్యు చిత్రం తరువాత మధుసూధనరావు దగ్గర మంచికుటుంబం, ఆస్తిపరులు, లక్ష్మీనివాసం, తదితర చిత్రాలకు పనిచేసారు. ఆ తరువాత ఆయన కమలాకర కామేశ్వరరావు, డి,యోగానంద్, కె.విశ్వనాథ్, వరప్రసారరావు, వంటి చాలా మంది దర్శకుల దగ్గర 14 సంవత్సరాలపాటు అసోసియేట్ దర్శకునిగ పనిచేసారు. ఎన్.టి రామారావుతో ఎక్కువగా చిత్రాలలో పనిచేయడం వలన ఆయనతో ఎక్కువగా గోపాలకృష్ణ గారికి సన్నిహిత్యం లభించింది.[2]

లక్ష్మణ రేఖ (1975 సినిమా)

దర్శకునిగా[మార్చు]

తెలుగులో ఎన్.గోపాలకృష్ణ (లక్ష్మణరేఖ గోపాలకృష్ణ) దర్శకత్వంలో వెలువడిన తొలి చిత్రం ‘లక్ష్మణ రేఖ’ జయసుధ కు కూడా తొలి చిత్రమే. అది 1975లో ఆయనకు గుర్తింపు తెచ్చేలా చేసింది. [3] ఆయన మొదటి చిత్రం 'లక్ష్మణరేఖ' కావడంతో అందరూ ఆయనని 'లక్ష్మణరేఖ గోపాలకృష్ణ' అని పిలిచేవారు.[4]

అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2015[మార్చు]

లక్ష్మణరేఖ గోపాలకృష్ణ రూపొందించిన గ్లోబల్‌ ఫిలిం ఫ్రటెర్నిటి ప్రపంచ సినిమా జెండాను ప్రెంచ్‌ దర్శకులు గెేబ్రిలీ బ్రిన్‌ ఎన్‌ విడుదల చేసి రూపకర్త గోపాలకృష్ణను అభినందించారు. తనతో ఈ జెండాను తీసుకొని వెడతానని ప్యారిస్‌లో ప్రదర్శిస్తామని అన్నారు. అలాగే గోపాలకృష్ణ రచించిన గాన, స్వర మాంత్రికులు సంగీత దర్శకులు గాయకులపై రచించిన పుస్తకాన్ని ఓపెన్‌ ఫోరమ్‌లో ఇంటర్నేషనల్‌ ఫిలింఫెస్టివల్‌ డైరెక్టర్‌ సెంథిల్‌ రాజన్‌ విడుదల చేశారు. తెలుగు పుస్తకం ‘ఇఫి’లో విడుదల చేయడం గొప్ప విషయమని రచయితను అభినందించారు.[5]

రచనలు[మార్చు]

  • మనఋషులు
  • రఘుపతి వెంకయ్య సినీవారసులు [6]

మూలాలు[మార్చు]

  1. మన ఋషులు(Mana Rushulu) By Lakshmana Rekha N. Gopalakrishna - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige.
  2. 2.0 2.1 సినిమాలో హీరోగా నటించాలనుకున్నాను- ఎన్.గోపాలకృష్ణ - నవ్య మ్యాగజైన్ - 30 మే 2012[permanent dead link]
  3. "My article about జయసుధ 22-5 -1016న హరివిల్ లు (మన తెలం గాణా". Vskesavarao's Blog (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-01. Retrieved 2017-11-17.
  4. "అదే రాజబాబు గొప్పతనం!." ap7am.com. Retrieved 2017-11-17.[permanent dead link]
  5. "అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2015 | Telangana Magazine". magazine.telangana.gov.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-11-17.
  6. రఘుపతి వెంకయ్య - సినీ వారసులు(Raghupathi Venkaiah Cine Varasulu) By Lakshmana Rekha N. Gopalakrishna - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige.

ఇతర లింకులు[మార్చు]