Jump to content

ఎన్.ప్రభాకర్

వికీపీడియా నుండి
ఎన్.ప్రభాకర్
జననం(1954-04-18)1954 ఏప్రిల్ 18
తమిళనాడు
మరణం2015 ఆగస్టు 15(2015-08-15) (వయసు 61)
వృత్తిక్షిపణి శాస్త్రవేత్త
పురస్కారాలుపద్మశ్రీ
డిఆర్‌డివో సైటిస్ట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం
డిఆర్‌డివో పాత్ బ్రేకింగ్ టెక్నాలజీ పురస్కారం
డిఆర్‌డివో పెర్ఫార్మన్స్ ఎక్సెలెన్స్ పురస్కారం
ఏస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా పురస్కారం

ఎన్.ప్రభాకర్ భారతీయ శాస్త్రవేత్త, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లోని సిస్టమ్ అనాలిసిస్ అండ్ మోడలింగ్ సెంటర్ (SAM-C)[1][2] కు చీఫ్ కంట్రోలరు.[3][4][5] అతను అన్నామలై విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (BE) లో పట్టభద్రుడయ్యాడు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చేరాడు, అక్కడ అతను మాస్టర్స్ డిగ్రీ (ME) పొందాడు. [3] [4] అతను షణ్ముఘ ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ & రీసెర్చ్ అకాడమీలో తన పరిశోధనను కొనసాగించి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో డాక్టరల్ డిగ్రీని పొందాడు. 1980 లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (DRDL) లో చేరాడు.[3][4]

ప్రభాకర్ DRDOలో AD (మిషన్) ప్రాజెక్టు డైరెక్టరుగా, అస్త్ర ప్రోగ్రాము డైరెక్టరుగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీ (DRDL)కి అసోసియేట్ డైరెక్టరుగా వివిధ హోదాలలో పనిచేశాడు. అతను పృథ్వీ కోసం ట్రాజెక్టరీ ఆప్టిమైజేషన్, AD వెపన్ సిస్టమ్ డిజైన్, బాలిస్టిక్ క్షిపణి ఇంటర్‌సెప్ట్ మిషన్‌ల కోసం ఆప్టిమల్ గైడెన్స్ అల్గారిథమ్‌ల అభివృద్ధికి దోహదపడ్డాడు. అంతేకాకుండా, భారతీయ వ్యూహాత్మక క్షిపణి కార్యక్రమాలన్నిటి కోసం సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేశాడు.[3][4]

ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా), ఆపరేషనల్ రీసెర్చ్ సొసైటీ (యుకె) ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లలో ఫెలో అయిన ప్రభాకర్, 2001 లో డిఆర్‌డిఓ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2007 లో పాత్ బ్రేకింగ్ టెక్నాలజీ అవార్డు, 2009లో పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు వంటి మూడు డిఆర్‌డిఓ పురస్కారాలను అందుకున్నాడు.[6] [7] అలాగే 2009 లో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి ASI అవార్డు అందుకున్నాడు.[8][3][4] భారత క్షిపణి కార్యక్రమానికి అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం 2015 లో ఆయనను నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది.[9]

ఇవి కూడా చూడండి

[మార్చు]

 

మూలాలు

[మార్చు]
  1. Krishnan, Anantha (9 February 2014). "SAM-C to Assess DRDO Weapon Systems". Archived from the original on 10 February 2014. Retrieved 6 May 2018.
  2. "Indian Defence". Indian Defence. 2015. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 10 March 2015.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "DRDO". DRDO. 2015. Retrieved 10 March 2015."DRDO". DRDO. 2015. Retrieved 10 March 2015.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "Defence Engineering Watch". Defence Engineering Watch. 2015. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 10 March 2015.. Defence Engineering Watch. 2015. Archived from the original on 2 April 2015. Retrieved 10 March 2015.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  5. "DRDO Newsletter" (PDF). DRDO Newsletter. 2015. Archived from the original (PDF) on 23 September 2015. Retrieved 10 March 2015.
  6. "DRDO Research Award". Press Information Bureau. 2006. Retrieved 10 March 2015.
  7. "DRDO Award". Press Information Bureau. 2009. Retrieved 10 March 2015.
  8. "ASI Award". Astronautical Society of India. 2015. Retrieved 10 March 2015.
  9. "Padma Awards". Padma Awards. 2015. Archived from the original on 28 January 2015. Retrieved 16 February 2015.