ఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్
నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 7 నవంబర్ 1929 హైదరాబాదు, హైదరాబాదు రాష్ట్రం | ||
మరణం | 4 మార్చి 2015 (aged 86) హైదరాబాదు,తెలంగాణ | ||
సంతానం | 2 కుమారులు, 5 కుమార్తెలు, 10 మనుమలు and 5 మునిమనుమలు | ||
నివాసం | భారతదేశము | ||
మతం | హిందూ |
నెల్లి లక్ష్మీనారాయణ నారాయణ ముదిరాజ్ (1929 నవంబరు 7 – 2015 మార్చి 4) మహరాజ్ గంజ్ మాజీ శాసన సభ్యులు, స్వాతంత్ర్య సమరయోధుడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]తెలంగాణ తొలిదశ ఉద్యమ కాలంలో లక్ష్మీనారాయణ ముదిరాజ్ (1969-70) నగర మేయర్‌గా పనిచేశారు. అతని హయాంలోనే గన్‌పార్కులోని అమరవీరుల స్తూపాన్ని నిర్మించడంతో అప్పటి ప్రభుత్వం జైలుకు పంపింది.అనంతరం 1972 నుంచి 1978 వరకు మహరాజ్ గంజ్ శాసన సభ్యుడుగా (ప్రస్తుతం గోషామహల్), బీసీ కమిషన్ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షునిగా, ఏపీ టింబర్ మర్చెట్స్ సంఘ అధ్యక్షునిగా అతను పనిచేశారు.[2] భారత స్వాతంత్ర్యోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. రజాకర్లకు వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]లక్ష్మీనారాయణకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు.
మరణం
[మార్చు]అనారోగ్యంతో ఉన్న ఆయన హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మూలాలు
[మార్చు]- ↑ "Former Hyderabad mayor Laxminarayan Mudiraj dead - The Hindu". thehindu.com. Retrieved 2015-03-04.
- ↑ "Former Mayor Laxminarayana Mudiraj Passed Away - The Hans India". thehansindia.com. Retrieved 2015-03-04.