ఎపిక్యూరియనిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎపిక్యూరస్ చిత్రము

ఎపిక్యూరియనిజం. సుఖ జీవన వాదం. క్రీస్తు పూర్వం 341-270 సంవత్సరాల మధ్య గ్రీసు దేశంలో జీవించిన తత్త్వవేత్త ఎపిక్యూరియస్‌ ప్రతిపాదించిన సిద్ధాంతం ఎపిక్యూరియనిజం. ప్రతి వ్యక్తీ సుఖమయమైన జీవితాన్నే కోరుకొంటాడు. ఐతే, మనస్సుకూ, శరీరానికీ హాయి కలిగించే సత్‌ ప్రవర్తనతో కూడిన జీవితమే సుఖాన్ని ఇస్తుందని ఆయన భావం. సుఖంగా ఉండటం అంటే ‘తినడం, తాగడం, తిరగడం’ అని అర్థం వచ్చేలా ఎపిక్యూరియస్‌ వాదానికి వ్యాఖ్యానాలు కొన్ని వచ్చాయి. కాని, అవన్నీ ఆయన ఆదర్శాన్నీ, ఆశయాన్ని పొరపాటుగా అర్థం చేసుకొని వ్రాసిన వ్యాఖ్యానాలేనని పలువురు మేధావులు స్పష్టం చేశారు. ఏదైనా ఒక పదార్థాన్ని తింటే గానీ, తాగితేగాని రేపు తలనొప్పి వస్తుందని తెలిసినప్పుడు దానిని తినడమో, తాగడమో సరికాదని ఆయన ఒక సందర్భంలో వివరణ ఇచ్చారు. కాని తినడం, తాగడం, తిరగడం ఆయన చెప్పిన ప్రబోధం కాదు. కోర్కెలు కలగటం తప్పు కాదు. వాటిని అదుపులో ఉంచాలి. ‘అతి’ మంచిది కాదు. అది వర్జించవలసినదే. జీవిత గమ్యం మనశ్శాంతి కలిగి, సుఖంగా, ఆనందంగా గడపటమేనని ఆయన చేసిన బోధల సారాంశం. ఇప్పటికి రెండు వేల మూడు వందల సంవత్సరాలకు పూర్వమే ఆయన సమస్త విశ్వం అణువులతో నిర్మితమైనదని ప్రతిపాదించాడు. మనిషి దేహంలో ఉండేవి కూడా అణువులే అన్నాడు. ఎపిక్యూరియస్‌ నాస్తికుడు కాడు. కాని, దేవుడికి భయపడ వలసిన పని లేదన్నాడు. ఆయన తన శిష్యుల కోసం ఒక వనాన్ని (The Garden) ఏర్పాటు చేశాడు. అక్కడే వారితో సత్సంగాలు జరుగుతుండేవి. ప్రశాంత జీవితం, పదవుల కోసం ఆరాటపడకుండా ఉండటం ఆయన చేసిన సూచనలు.

ఇవి కూడా చూడండి[మార్చు]

ఎగ్జిస్టెన్షియలిజం

  • [పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 ]