ఎఫ్-16 (యుద్ధ విమానం)
ఎఫ్-16 (యుద్ధ విమానం) - చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు తైవాన్ తన సైన్య సంపత్తిని మెరుగుపరుస్తోంది. నవంబరు 18, 2021న అమెరికా సాయంతో అప్‌గ్రేడ్ చేసిన అధునాతన ఎఫ్-16 యుద్ధ విమానాల మొదటి వింగ్‌ను తన వైమానిక దళంలోకి ప్రవేశపెట్టింది. అత్యంత అధునాతన ఎఫ్-16ఎస్, ఎఫ్-16వీ ఫైటర్ జెట్‌ల మొదటి స్క్వాడ్రన్‌ను తైవాన్ అధ్యక్షురాలు సయ్ ఇంగ్ వెన్ చియాయిలోని వైమానిక స్థావరంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమెరికా దౌత్యవేత్త సాండ్రా ఔడ్కిర్క్ పాల్గొన్నారు.
తైవాన్ కు చెందిన 141 ఎఫ్-16ఏ/బీ ఫైటర్ జెట్‌లను అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ కార్పొరేషన్, తైవాన్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏఐడీసీ) సంయుక్త ఆధ్వర్యంలో ఎఫ్-16వీ వేరియంట్‌లోకి అప్‌గ్రేడ్ చేస్తోంది. అధునాతన ఏవియానిక్స్, రాడార్ సిస్టమ్ వీటి ప్రత్యేకత.[1]
భారతదేశంలో తొలి ఎఫ్-16 రెక్కను తయారు చేసిన ఘనత హైదరాబాద్, తెలంగాణకు దక్కింది. టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఎఫ్-16 యుద్ధ విమానం ప్రొటోటైప్ రెక్కలను తయారు చేసింది. వీటిని డిసెంబరు 7, 2021న స్థానికంగా ప్రదర్శించారు. దీంతో హైదరాబాద్ ఏరోస్పేస్, రక్షణ రంగాల కిరీటంలో మరో కలికితురాయి చేరినట్టయింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Taiwan: ఎక్కడా తగ్గని తైవాన్.. అప్‌గ్రేడెడ్ ఎఫ్-16 యుద్ధ విమానాల దళం ప్రారంభం". EENADU. Retrieved 2021-12-10.
- ↑ "హైదరాబాద్‌లో ఎఫ్-16 విమాన రెక్కల తయారీ". andhrajyothy. Retrieved 2021-12-10.