ఎముక విరుపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎముక విరుపు
వర్గీకరణ & బయటి వనరులు
Internal and external views of an arm with a compound fracture, both before and after surgery
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 4939
MeSH {{{m:en:MeshID}}}

ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడినప్పుడు ఎముకలు విరిగిపోతుంటాయి. ఎక్కువగా చేతులు, కాళ్ళ ఎముకలు ఇలా విరుగుతుంటాయి. ఇలా ఏ కారణం చేతనైనా ఎముకలు విరగడాన్ని ఎముక విరుపు (Bone Fracture) అంటారు. అయితే కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే ఎముకలు బలహీనంగా ఉన్నందువలన కూడా విరగవచ్చును. ఆస్టియోపోరోసిస్ (Osteoporosis), కాన్సర్ (Cancer) దీనికి ఉదాహరణలు.

ఎముక విరుపులోని రకాలు

[మార్చు]
  • సామాన్య ఎముక విరుపు (Simple or Closed fracture) : ఈ రకమైన విరుపులో ఎముక పూర్తిగా లేదా కొమ్త భాగం విరగవచ్చును. విరిగిన చోట ఎలాంటి గాయం కనిపించదు. దీనినే మూసివున్న ఎముక విరుపు అని కూడా అంటారు.
  • చాలాచోట్ల ఎముక విరుపు (Compound or Open fracture) : ఇందులో ఎముక విరిగిన దగ్గర కొన్ని ముక్కలుగా అయి, దానితో పాటు ఆ ప్రదేశంలో గాయం కనిపిస్తుంది. విరిగిన ఎముక కొనలు చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తాయి. జరిగిన రక్తస్రావం బయటకు తెలుస్తుంది.
  • జటిలమైన ఎముక విరుపు (Complicated fracture) : ఈ రకమైన విరుపులో ఎముక విరగడంతో పాటు ముఖ్య అవయవాలైన కాలేయం, మెదడు, పేగులు మొదలైన భాగాలు దెబ్బతింటాయి.
  • విఖండిత విరుపు:
  • లేత ఎముక విరుపు: ఇందులో ఎముకకు ఒకవైపు భాగం మాత్రమే విరిగి ఎముక వంగుతుంది. ఇది లేతగా ఉండే చిన్నపిల్లలలో కనిపిస్తుంది.

ఎముక విరుపు గుర్తించడం

[మార్చు]
  • ఎముక విరిగిన చోట నొప్పిగా ఉంటుంది. ఒత్తిడిని ఏ మాత్రం భరించలేదు.
  • విరిగిన చోట చుట్టూ వాపు ఉంటుంది.
  • విరిగిన శరీర భాగాన్ని మామూలుగా కదల్చలేరు.
  • విరిగిన చోట విరిగిన లేదా రాసుకున్న శబ్దం వస్తుంది లేదా తెలుస్తుంది.
  • విరిగిన చోట కదలక అసామాన్యంగా ఉంటుంది.
  • చెయ్యి లేదా కాలు వంకరపోవచ్చును. దీనికి కారణం ఎముక విరిగినప్పుడు దానికి అంటిపెట్టుకొని వున్న కండరాలు సంకోచించి, విరిగిన ఎముకల కొనలను ఒక దానిపై మరొకటి వచ్చేలా లాగుతాయి. దానితో ఆ భాగం పొట్టిగా అవుతుంది.

వ్యాధి నిర్ధారణ

[మార్చు]

ఎముక విరుపు(Bone fracture)ను కొన్ని X-రే లేదా ఎక్స్ రే (X-ray) చిత్రపటాలను చూసి నిర్ధారిస్తారు. దీని గురించి విరిగిన శరీర భాగాన్ని నిర్ధిష్టమైన విధంగా ఉంచి రెండు కంటే ఎక్కువ కోణాల నుండి చిత్రపటాల్ని తీయవలసి వుంటుంది.

చికిత్స

[మార్చు]

ఎముక విరుపుకు ప్రథమ చికిత్స

[మార్చు]
X-ray showing the proximal portion of a fractured tibia with an intramedular nail.
  • ప్రమాదం జరిగిన చోటనే ప్రథమ చికిత్స చేయాలి.
  • రక్తస్రావం జరుగుతున్నప్పుడు గాయాన్ని శుభ్రపరచి రక్తస్రావాన్ని అరికట్టాలి.
  • దెబ్బ తగిలిన భాగానికి కర్రబద్దలతో ఆధారం కల్పించాలి. జాగ్రత్తగా, గట్టిగా కట్టుకట్టాలి.
  • విరిగిన ఎముక కదలకుండా కర్రబద్దలు ఉపయోగింగి కట్టుకట్టాలి. బ్యాండేజీ విరిగిన ఎముక మీద కాకుండా దానికి అటూ, ఇటూ కట్టాలి. అయితే రక్త ప్రసరణ ఆగిపోయేంత గట్టిగా కట్టకూడదు.
  • ప్రమాదానికి గురైన వ్యక్తిని దగ్గరలోని వైద్యుని వద్దకు తీకుకొని వెళ్ళాలి.

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]