ఎరుకలపూడి
ఎరుకలపూడి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | కొల్లిపర |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522306 |
ఎస్.టి.డి కోడ్ | 08644 |
ఎరుకలపూడి, గుంటూరు జిల్లా, తెెనాలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ చరిత్ర
[మార్చు]కోటయ్య గారికి ఈ ప్రాంతంలో దాదాపుగా 100 ఎకరాల పొలం ఉండేది. ఇక్కడికి కొంతదూరంలో వారు నివాసం ఉండేవారు. అయితే, కోటయ్యగారికి ఈ ప్రదేశం బాగానచ్చి, ఇక్కడ కొన్ని ఇళ్లను నిర్మింప జేసి, దానిని ఒక గ్రామంగా రూపొందించారు. దానికి "ఎరుకలపూడి" అని పేరు పెట్టి, దానినే తమ ఇంటి పేరుగా మార్చుకున్నరు. అప్పటి నుండి అదే మా ఇంటి పేరు అయింది. 'ఎరుక ' అంటే తెలుసుకుని ఉండటం లేదా తెలివికలిగి ఉండటం.
సీ ఆర్ డీ ఏ
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
[మార్చు]తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామ భౌగోళికం
[మార్చు]ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరానికి 18 కి.మీ. దూరంలో ఉంది. దీనికి దగ్గరగా ఉన్న పెద్ద పట్టణం తెనాలి. ఎరుకలపూడి గ్రామం హౌరా - కొల్ కత రైలు మార్గంలో ఉంది.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
[మార్చు]- డా.చందు సుబ్బారావు, హనుమంతరావు ఆయుర్వేద వైద్యశాల.
- ఎరుకలపూడిలోని మానసిక రోగుల అసుపత్రి ఆ రోజుల్లో చాలా ప్రముఖమయినది. ఇతర ప్రదేశాలలో ఇటువంటీ ఆసుపత్రులు రాకముందు, చాలా మంది ఇక్కడికి చికిత్సకు వచ్చేవారు.
- త్రాగునీటి సౌకర్యం:- కొల్లిపర మండలం వల్లభాపురం ఓవర్ హెడ్ రెగ్యులేటర్ నుండి పైపులైనుల ద్వారా గుడివాడ, ఎరుకలపూడి, తేలప్రోలు గ్రామాలకు మంచినీటి సరఫరా కొరకు 12 కోట్ల రూపాయల వ్యయంతో, ఏర్పాట్లు జరుగుచున్నవి.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]ఈ ప్రాంతంలో మూడు కాలువలు ప్రవహిస్తున్నాయి. వ్యవసాయానికి ముఖ్య ఆధారం అవే. ఇప్పుడు అక్కడ చేపల చెరువులు కూడా వృద్ధి చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ
[మార్చు]- ఈ గ్రామ తొలి సర్పంచిగా శ్రీ చందు సుబ్బారావు 1953లో ఏకగ్రీవంగా ఎన్నికై 5 ఏళ్ళు పనిచేశారు. ఆ తరువాత మళ్ళపూడి వెంకటేశ్వర్లు, తరువాత తాడిబోయినోయిన శంకర రావు గారు గ్రామ పంచాయితీ ఏర్పడిన నాటి నుండి 1988 కాలం వరకు అనగా (18 సం) సర్పంచ్ గా పనిచేసి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేసియున్నారు.ఆ తరువాత ఆయన కుమరుడైన తాడిబోయిన యజ్ఞ నారాయణ రాజు గారు రెండు పర్యాయాలుగా ఏకగ్రీవంగా ఎన్నికై 1989 నుండి 1996, 2001 నుండి 2006 వరకు సర్పంచగా పనిచేశారు.ఆ తరువాత చందుచందు రాజ్యలక్ష్మి, పసుపులేటి విజయలక్ష్మి, సర్పంచ్ గా పనిచేశారు. 1953లో తొలి సర్పంచిగా శ్రీ చందు సుబ్బారావు పనిచేస్తే, అతని కోడలు చందు రాజ్యలక్ష్మి, 1970లో సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికై,1970 నుండి 17 సంవత్సరాలు పనిచేశారు. 2006-11లో ఆమె కుమారుడు చందు శాంతకుమార్ పోటీచేసి గెలుపొందాడు. తాడిబోయిన శంకరరావు, అతని కుమారుడు యజ్ఞనారాయణరాజు, పసుపులేటి వెంకటరమణ, అతని విజయలక్ష్మి గూడా సర్పంచులుగా చేశారు. గడచిన 5 ఏళ్ళలో రు.30 లక్షల అభివృద్ధి పనులు జరిగినవి. ఆర్.ఈ.జి.ఎస్.నిధులతో హిందూ శ్మశానవాటికకు గ్రావెల్ రహదారి, ఎస్.సి.కాలనీ అంతర్గత రహదారులకు రు. 1.5లక్షలు, రు 1.3లక్షలతో చప్టా నిర్మాణం జరిగింది.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కొత్తపల్లి వెంకాయమ్మ ( పొదుపు మహిళ) సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది..
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]ఎరుకలపూడిలో చాల పురాతన రామాలయం ఉంది. ఈ ఆలయానికి మా పూర్వులు ఇదు ఎకరాల భూమిని, ఇంకా అర ఎకరం మొగలితోటని దేవుని మాన్యంగా రాసారు. ఇప్పుడు గ్రామస్థులు ఈ ఆలయాన్ని పునరుద్దరించాలని భావిస్తున్నారు. ఇందులో మేముకూడా పాలుపంచుకోవాలనుకుంటుంన్నాం. సుబ్రహ్మణ్య స్వామి వెలసిన ప్రదేశం మా ఊరు. ముఖ్య పర్వదినాలలో ఇక్కడ ఉత్సవాలు బాగా చేస్తారు.
శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం
[మార్చు]గ్రామంలోని ప్రధాన పంటలు
[మార్చు]గ్రామంలో ఎక్కువగా మాగాణీ భూములు. ముఖ్య పంట 'వరి'.
గ్రామ ప్రముఖులు
[మార్చు]- కొత్తమాసు సత్యనారాయణ, స్వాతంత్ర్యసమరయోధుడు.
- కీ.శే.డా.చందు వెంకటరావు, ఆయుర్వేద మానసిక వైద్య నిపుణులు.
గ్రామ విశేషాలు
[మార్చు]- ఎరుకలపూడి నుండి పట్టభద్రులయిన వారిలో రెండవ వ్యక్తి శంకర రావు ఆయన డీ.యస్.పీ.గా పనిచేసారు.
- ఊరి నుండి డాక్టరుగా మొదటివ్యక్తి శంకరరావు, సుజాతాదేవి కుమారుడు ప్రభాకర్
- శంకరరావు కుమార్తె ప్రొఫెసర్ కిరణ్మయి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పనిచేస్తుంది.
- శంకరరావు రెండవకుమార్తె ప్రొఫెసర్ అరుణవల్లి పద్మావతి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు.
- ఈ ఊరికి చెందిన ముంగర స్వామి వాణిజ్య పన్నుల శాఖలో డెప్యూటీ కమిషనర్ గా పనిచేశారు.
- ప్రముఖ హేతువాది, రచయిత, అనిసెట్టి మాధవరావు కుమారుడు ఉమ్మడి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్నతోద్యోగం, ముప్పై వేల సర్క్యులేషన్ ఉన్న 'ఎన్జీవో సమాచారం' పత్రికకు సంపాదకునిగా చేసి, అనంతరం భాషా శాస్త్ర నిపుణునిగా మైక్రోసాఫ్ట్ లో చేసి, తర్వాత ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో భాషాశాస్త్ర నిపుణునిగా చేస్తున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.