ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్
దర్శకత్వంమైకేల్ ఆండర్సన్
స్క్రీన్ ప్లే
 • జేమ్స్ పో
 • జాన్ ఫారో
 • ఎస్.జె.పెరెల్‌మాన్
దీనిపై ఆధారితంఎరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్
1873 నవల 
by జూల్స్ వెర్న్
నిర్మాతమైకేల్ టాడ్
తారాగణం
 • కాంటిన్ ఫ్లాస్
 • డేవిడ్ నివెన్
 • రాబర్ట్ న్యూటన్
 • షెర్లీ మెక్‌లెయిన్
ఛాయాగ్రహణంలియోనెల్ లిండన్
కూర్పుజీన్ రుగ్గీరొ
హోవర్డ్ ఎప్స్టెయిన్
సంగీతంవిక్టర్ యంగ్
నిర్మాణ
సంస్థ
మైకేల్ టాడ్ కంపెనీ
పంపిణీదార్లుయునైటెడ్ ఆర్టిస్ట్స్
విడుదల తేదీ
అక్టోబరు 17, 1956 (1956-10-17)(US)
సినిమా నిడివి
182 నిముషాలు
దేశంఅమెరికా
భాషఇంగ్లీషు
బడ్జెట్$6 మిలియన్లు[1][2]
బాక్సాఫీసు$42 మిలియన్లు[2]

ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్ 1956లో విడుదలైన అమెరికన్ అడ్వెంచర్ సినిమా. మైకేల్ టాడ్ నిర్మించిన ఈ సినిమాకు మైకేల్ ఆండర్సన్ దర్శకుడిగా పనిచేశాడు. ఇదే పేరుతో 1873లో జూల్స్ వెర్న్ వ్రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీయబడింది. ఇంతకు ముందు 1919లోనే ఇదే నవల ఆధారంగా జర్మనీలో రిఛర్ట్ ఆస్వాల్డ్ ఒక సినిమాను నిర్మించాడు.

సెట్లో మైకేల్ ఆండర్సన్ (దర్శకుడు), మైకేల్ టాడ్ (నిర్మాత), ఫ్రాంక్ సినట్రా (నటుడు)

1872 నాటికి ప్రపంచంలో ఇన్ని రవాణా సౌకర్యాలు లేవు; సమాచార సదుపాయాలు లేవు. అలాటి సమయంలో లండన్ లోని రిఫార్మ్ క్లబ్‌లో ఫిలియాస్ ఫాగ్, థామస్ ప్లానగాన్, సామ్యూల్ ఫాలెంటిన్, జాన్ సల్లివన్‌లు కూర్చుని పేపర్లు చదువుకొంటూ, పిచ్చాపాటిలో పడతారు. ఫాగ్‌కు అప్పట్లో ఓ సేవకుడి అవసరం ఉంటుంది. ఆ ఉద్యోగం కోసం వస్తాడు పాస్పారూ. అతన్ని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగంలోకి తీసుకొంటాడు ఫాగ్. ఆరోజుకు ఒకటి రెండు రోజుల ముందు లండన్‌లో ఓ బ్యాంకు దోపిడీ జరిగి ఉంటుంది. ఆ దోపిడీ గురించి మాట్లాడుతూనే, ఆ స్నేహితులంతా ప్రపంచ ప్రదక్షిణం గురించిన కబుర్లలో పడతారు. ఫాగ్ ఆ పనిని 80 రోజుల్లో పూర్తిచేసే వీలుందంటే, సల్లివాన్ నమ్మడు. చివరికి ఫాగ్ ఆ పనిని తానే చేసి చూపిస్తానని చెప్పి, తన యావదాస్తికీ సమానమైన ఇరవైవేల పౌండ్ల పందెం కాస్తాడు. ఆరోజు రాత్రే 8-45కు ఫాగ్ తన ప్రపంచ యాత్ర ఆరంభించాలి. ఆ ప్రకారమే ఫాగ్, తన కొత్త పనివాడు పాస్పారూతో కలిసి బయలుదేరతాడు. వాళ్లిద్దరూ లండన్ లోని షేరింగ్ క్రాస్ స్టేషన్ దగ్గర రైలు ఎక్కడంతో - ఫాగ్ సాహస యాత్ర గురించి అన్ని పేపర్లూ వార్తలు వేస్తాయి. పాస్పార్దూ, ఫాగ్లు మొదట సూయజ్ హార్బర్ దగ్గర దిగుతారు. అయితే లండన్లో జరిగిన బ్యాంకు దోపిడీలో పోయిన ఇరవైవేల పౌండ్ల ఆచూకీ కనిపెట్టడానికి ఉన్న డిటెక్టివ్ ఫిక్స్, పాస్పార్తూను కలుసుకొని, పాస్పారూ మాటల వల్ల ఇరవై వేల పౌండ్ల ప్రపంచ యాత్ర ఆరంభించిన ఫిలియాస్ ఫాగే దొంగ అయి ఉంటాడని భావిస్తాడు. కానీ పోలీస్ కమీషనర్ నుంచి అరెస్టు వారంటు సమయానికి రాకపోవటంతో, డిటెక్టివ్ ఫిక్స్ ఫాగ్, పాస్పార్టులను ఏమీ చేయలేక పోతాడు. ఈలోగా ఫాగ్, పాస్పారులు బొంబాయికి బయలుదేరిపోతారు. బొంబాయి నుంచి కలకత్తాకు వెళ్లే దారిలో, రైలుపట్టాలు పాడవటంతో వీళ్లు అలహాబాద్ లో 12 గంటలు ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో అయూదా అనే రాజకుమారిని వీళ్లు సతీసహగమన చితినుంచి కాపాడతారు. కలకత్తా రైల్వేస్టేషన్లో కూడా వీళ్లను అరెస్టు చేయించాలని చూస్తాడు ఫిక్స్. కానీ వేరే నేరంలో దొరికి పోయిన పాస్పారును జుర్మానా చెల్లించి విడిపించుకొని, ఫాగ్ మళ్లీ తన యాత్ర ఆరంభిస్తాడు. అయితే ఓ తుఫాను కారణంగా వాళ్ల నౌక హాంకాంగ్‌కు ఇరవైనాలుగు గంటలు లేటుగా చేరుతుంది. హాంకాంగ్ పాస్పారూ మత్తుమందులు తీసుకోవటంతో, ఇద్దరు పోలీసు అధికారులు అతన్ని తీసుకెళ్లి స్టీమర్లో పడేస్తారు. ఈ సంగతి తెలియని ఫాగ్ ఒడ్డుమీద ఉండగానే, స్టీమర్ కదిలివెళ్లిపోతుంది. అయితే, ఓక్లహామా మీదుగా శాన్ ఫ్రాన్సిస్కో చేరుస్తానని చెప్పి, దారిలోనే వాళ్లను ఆ స్టీమర్‌కు చేరుస్తాడు మరో వ్యక్తి. ఇదే సమయంలో ఫాగ్ ఒక నేరస్థుడని, అతన్ని ఎలాగైనా అరెస్టు చేయిస్తానని ఫిక్స్, పాస్పారుకు చెప్తాడు. ఇదిలా ఉండగా, శాన్ ఫ్రాన్సిస్కో నుండి న్యూయార్క్ వెళ్తున్న వీళ్ల రైలుమీద రెడ్ ఇండియన్లు దాడి చేస్తారు. చివరికి ఎలాగైతేనేం వాళ్లు న్యూయార్కు మీదుగా లివర్‌పూల్ చేరతారు. అక్కడ ఫిక్స్, ఫాగ్‌ను అరెస్టుచేయిస్తాడు. అయినా ఆ కష్టంనుంచీ బయటపడి, ఫాగ్ ఒక హాట్- ఎయిర్ బెలూన్లో లండన్ చేరతాడు. కానీ, తను అనుకొన్నట్లు 80 రోజులకే తిరిగి రాలేకపోయానని, కొన్ని గంటల తేడాయే అయినా, తాను ఆలస్యంగానే వచ్చానని ఫిలియాన్ ఫాగ్ భావిస్తాడు. నిజానికి ఆయన 80 రోజులకన్నా ఒకరోజు ముందే లండన్ కు వచ్చేసి ఉంటాడు. లండన్ నుంచి తూర్పు దిశగా ప్రయాణం ఆరంభించి, ప్రపంచ పర్యటన పూర్తిచేసి, పశ్చిమ దిశ నుంచి లండన్‌కు చేరటంవల్ల ఫిలియాస ఫాగ్‌కు ఒకరోజు సమయం కలిసి వస్తుంది. కానీ ఆ విషయాన్ని ఆయన గుర్తించడు. ఫాగ్ ప్రపంచ పర్యటన పూర్తిచేసి వచ్చిన సంగతి తెలిసి, అతన్ని అభినందించడానికి వచ్చిన స్నేహితుల ద్వారా తాను ప్రపంచ యాత్రను ఆశించిన దానికన్నా ముందే పూర్తిచేసిన సంగతి గుర్తిస్తాడు ఫాగ్. అతని ఆనందానికి హద్దే ఉండదు. ఇటు ఇలా పందెం గెలిచిన ఫిలియాస్ ఫాగ్‌కు, భారతీయ అందాల సుందరి అయూదా కూడా దక్కుతుంది.[3]

స్పెయిన్‌లోని చిన్‌చోన్ పట్టణంలో ఈ చిత్రానికై ఏర్పాటు చేసిన బుల్‌ రింగ్ సెట్టింగ్

నటీనటులు

[మార్చు]

ఈ సినిమాలో ప్రధాన నటులతో పాటు సుమారు 40 మంది ప్రముఖ హాలీవుడ్ నటులు అతిథి పాత్రలలో కనిపిస్తారు.

ప్రధాన నటులు

[మార్చు]
 • డేవిడ్ నివెన్ - ఫిలియాస్ ఫాగ్ పాత్రలో
 • కాంటిన్ ఫ్లాస్ - జీన్ పాస్పరూ
 • షెర్లీ మెక్‌లెయిన్ -రాకుమారి అయుదా
 • రాబర్ట్ న్యూటన్ - ఇన్‌స్పెక్టర్ ఫిక్స్

అతిథి నటులు

[మార్చు]
 • ఎడ్వర్డ్ ఆర్.ముర్రో - వ్యాఖ్యాత
 • ఎ.ఇ.మాథ్యూస్ - రీఫార్మ్‌ క్లబ్ సభ్యుడు
 • రోనాల్డ్ ఆడం - రీఫార్మ్‌ క్లబ్ నిర్వాహకుడు
 • వాల్టర్ ఫిట్జ్‌గెరాల్డ్ - రీఫార్మ్‌ క్లబ్ సభ్యుడు
 • ఫిన్లే క్యూరీ - రీఫార్మ్‌ క్లబ్ సభ్యుడు
 • రాబర్ట్ మోర్లే - రీఫార్మ్‌ క్లబ్ సభ్యుడు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాడ్ గవర్నర్
 • ఫ్రెడరిక్ లీస్టర్ - రీఫార్మ్‌ క్లబ్ సభ్యుడు
 • రోనాల్డ్ స్క్వైర్ - రీఫార్మ్‌ క్లబ్ సభ్యుడు
 • బాసిల్ సిడ్నీ - రీఫార్మ్‌ క్లబ్ సభ్యుడు
 • నోయెల్ కోవర్డ్ - రోనాల్డ్, ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ మేనేజెర్
 • సర్ జాన్ గీల్గడ్ - ఫాస్టర్, ఫాగ్ మాజీ సేవకుడు
 • ట్రెవర్ హోవర్డ్ - డెనిస్ ఫాలెంటిన్, రీఫార్మ్‌ క్లబ్ సభ్యుడు
 • హార్కోర్ట్ విలియమ్స్ - రీఫార్మ్‌ క్లబ్ సభ్యుడు
 • మార్టిన్ కెరోల్ - ప్యారిస్ రైల్వే స్టేషన్‌లో అమ్మాయి
 • ఫెర్నాండెల్
 • ఛార్లెస్ బోయర్ - బెలూనిస్ట్
 • ఎవిలిన్ కీస్ - పారిస్ వేశ్య
 • జోస్ గ్రెకో - ఫ్లామెంకో డ్యాన్సర్
 • లూయిస్ మిగెల్ డొమింగ్విన్ - బుల్ ఫైటర్
 • గిల్బర్ట్ రోనాల్డ్ - అహ్మద్ అబ్దుల్లా
 • సీజర్ రోమియో - అబ్దుల్లా అనుచరుడు
 • ఫ్రాంక్ సినట్రా - పియానో వాద్యకారుడు
 • జేమ్స్ డైమ్[4]

పురస్కారాలు

[మార్చు]
అవార్డు విభాగం విజేత(లు) ఫలితం
అకాడమీ పురస్కారాలు[5] ఉత్తమ చిత్రం మైకేల్ టాడ్ గెలుపు
ఉత్తమ దర్శకుడు మైకేల్ ఆండర్సన్ ప్రతిపాదన
ఉత్తమ స్క్రీన్ ప్లే జేమ్స్ పో, జాన్ ఫారో, ఎస్.జె.పెరెల్‌మాన్ గెలుపు
ఉత్తమ కళాదర్శకత్వం - కలర్ జేమ్స్ డబ్ల్యూ. సుల్లివాన్, కెన్ ఆడం, రాస్ డౌడ్ ప్రతిపాదన
ఉత్తమ ఛాయాగ్రాహకుడు - కలర్ లియోనెల్ లిండన్ గెలుపు
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - కలర్ మైల్స్ వైట్ ప్రతిపాదన
ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్ జీన్ రుగ్గీరొ, హోవర్డ్ ఎప్స్టెయిన్ గెలుపు
ఉత్తమ సంగీతం విక్టర్ యంగ్ (మరణానంతరం) గెలుపు
డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డులు ఉత్తమ దర్శకుడు మైకేల్ ఆండర్సన్ ప్రతిపాదన
గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు ఉత్తమ చిత్రం గెలుపు
ఉత్తమ నటుడు కాంటిన్ ఫ్లాస్ గెలుపు
ఉత్తమ దర్శకుడు మైకేల్ ఆండర్సన్ ప్రతిపాదన
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డులు ఉత్తమ సినిమా గెలుపు
టాప్ టెన్ సినిమాలు గెలుపు
న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ఉత్తమ సినిమా ప్రతిపాదన
ఉత్తమ స్క్రీన్ ప్లే ఎస్.జె.పెరెల్‌మాన్ ప్రతిపాదన
ఫోటో ప్లే అవార్డులు ప్రత్యేక బహుమతి మైకేల్ టాడ్ గెలుపు
రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డులు ఉత్తమ కామెడి రచన జేమ్స్ పో, జాన్ ఫారో, ఎస్.జె.పెరెల్‌మాన్ గెలుపు

విశేషాలు

[మార్చు]
 • ఈ సినిమా 70ఎం.ఎం. ఫార్మాట్‌లో నిర్మించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా.
 • ఈ సినిమాను నిర్మించక ముందు 1946లో మైకేల్ టాడ్ రేడియో నాటకంగా తీశాడు.
 • ఈ సినిమా షూటింగును 1955 సెప్టెంబర్‌లో ప్రారంభించి డిసెంబరులో ముగించారు. మొత్తం 13 దేశాల్లో 112 లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ చేశారు.
 • సినిమా నిర్మాణానికి 30 లక్షల డాలర్లు అవుతుందని అంచనా వేసుకున్నా, దానికి రెట్టింపుగా 60 లక్షల డాలర్లను మించిపోయింది. విడుదలైన రెండు సంవత్సరాలలో నిర్మాతకు పదిరెట్లు అంటే ఆరున్నర కోట్ల డాలర్ల ఆదాయం లభించింది.
 • ఈ సినిమా ప్రీమియర్ షో 1956 అక్టోబర్ 17న న్యూయార్క్‌లోని రివోలీ థియేటర్‌లో[6] ప్రదర్శించబడి 15 నెలలపాటు హౌస్‌ఫుల్‌గా నడిచింది. ఆ థియేటర్‌లో 102 వారాలపాటు 1,564 ప్రదర్శనలను 2,173,238 మంది ప్రేక్షకులు వీక్షించారు. టికెట్ల ద్వారా $4,872,326 ఆదాయం ఆ థియేటర్‌ నుండి లభించింది.[7]

మూలాలు

[మార్చు]
 1. "సినిమా: ది న్యూ పిక్చర్స్". టైమ్. October 29, 1956. Archived from the original on January 5, 2013. Retrieved October 1, 2010.
 2. 2.0 2.1 "Around the World in 80 Days (1956)". బాక్స్ ఆఫీస్ మోజో. ఐఎమ్‌డిబి. Retrieved March 2, 2013.
 3. పాలకోడేటి సత్యనారాయణరావు (1 April 2007). హాలీవుడ్ క్లాసిక్స్ మొదటి భాగం (1 ed.). హైదరాబాదు: శ్రీ అనుపమ సాహితి. pp. 105–108.
 4. ఫ్రీస్, జీన్ స్కాట్ (April 10, 2014). హాలీవుడ్ స్టంట్ పర్ఫార్మర్స్, 1910s-1970s: ఎ బయోగ్రాఫికల్ డిక్షనరీ (2వ ed.). మెక్ ఫార్‌లాండ్& కంపెనీ. p. 75. ISBN 9780786476435.
 5. న్యూయార్క్ టైమ్స్, అకాడమీ అవార్డులు.
 6. క్రౌదర్, బోస్లీ (October 18, 1956). "మమ్మోత్ షో". న్యూయార్క్ టైమ్స్. Retrieved October 1, 2010.
 7. "న్యూయార్క్ రివోలి రన్ సమ్మరీ". వెరైటీ. October 8, 1958. p. 7. Retrieved March 10, 2019.

బయటి లింకులు

[మార్చు]