Jump to content

ఎర్రపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 16°24′30″N 79°35′49″E / 16.408311°N 79.596863°E / 16.408311; 79.596863
వికీపీడియా నుండి

ఎర్రపాలెం, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఎర్రపాలెం
—  రెవిన్యూయేతర గ్రామం  —
ఎర్రపాలెం is located in Andhra Pradesh
ఎర్రపాలెం
ఎర్రపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°24′30″N 79°35′49″E / 16.408311°N 79.596863°E / 16.408311; 79.596863
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం దుర్గి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 612
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

[మార్చు]

శ్రీ హరిహర బాలనాగేంద్రస్వామివారి ఆలయం:- 16 సంవత్సరాల క్రితం, గ్రామానికి చెందిన కిలారు వెంకటకోటమ్మ అను భక్తురాలి ద్వారా వెలుగులోనికి వచ్చిన ఈ ఆలయంలోని స్వామివారు, నిత్య పూజలందుకొనుచున్నారు. అప్పట్లోనే పలువురు భక్తులు, ఒక కోటి రూపాయలతో ఈ ఆలయప్రాంగణంలో శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి, శివుడు, దుర్గామాత, శ్రీ నాగేంద్రస్వామి ఆలయాలను నిర్మించారు. ప్రతి ఆదివారం వందలాదిమంది భక్తులు, ఈ ఆలయంలోని స్వామివారి సన్నిధికి చేరుకొని, పూజలుచేసి, కోరిన కోర్కెలు తీరేటందుకు ఆలయంలో జాగరణ చేసెదరు. ప్రతి సంవత్సరం స్వామివారి జన్మదినమైన మాఘశుద్ధపౌర్ణమికి స్వామివారికి వార్షిక ఉత్సవ వేడుకలు నయనానందకరంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించెదరు. దాతల విరాళాలతో ఆలయ సన్నిధిలో విశేష అన్నప్రసాద వితరణ చేసెదరు. సాయంత్రం స్వామివారికి గ్రామంలో రథోత్సవం నిర్వహించెదరు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు.

మూలాలు

[మార్చు]