Jump to content

ఎలక్ట్రోడ్

వికీపీడియా నుండి
లోహపు ఆర్క్ వెల్డింగ్లో ఉపయోగించే ఎలక్ట్రోడ్

ఎలక్ట్రోడ్ అంటే ఒక విద్యుత్ వలయం (సర్క్యూట్) లోని అలోహ భాగాలను కలపడానికి వాడే ఒక విద్యుత్ వాహకం. ఈ పదాన్ని మైకేల్ ఫారడే అభ్యర్థన మేరకు విలియం వెవెల్ అనే శాస్త్రవేత్త కల్పించాడు. ఇది ఎలక్ట్రాన్, హోడోస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక.[1][2] ఆనోడ్, కాథోడ్ అనేవి రెండు ఎలక్ట్రోడులు.

విద్యుత్ రసాయనిక ఘటాల్లో ఆనోడ్, కాథోడ్ లు

[మార్చు]

విద్యుత్ రసాయనిక ఘటాల్లో ఎలక్ట్రోడులని ఆనోడ్ లేదా కాథోడ్ లని వ్యవహరిస్తారు. ఆనోడ్ అంటే ఎలక్ట్రాన్లు వదిలివెళ్ళే ఎలక్ట్రోడ్. ఇక్కడ ఆక్సీకరణం (oxidation) జరురుగుతుంది. దీన్ని "–" చిహ్నంతో సూచిస్తారు. కాథోడ్ అంటే ఎలక్ట్రాన్లు ప్రవేశించే ఎలక్ట్రోడ్. ఇక్కడ క్షయకరణం జరుగుతుంది. దీన్ని "+" చిహ్నంచే సూచిస్తారు. ఒక ఘటంలో విద్యుచ్ఛక్తి ప్రవహించే దిశను బట్టి ఏదైనా ఎలక్ట్రోడు ఆనోడ్ లేదా కాథోడ్ గా మారవచ్చు. ఒక ఘటంలో ఆనోడు గానూ, మరో ఘటంలో కాథోడు గానూ వ్యవహరించే ఎలక్ట్రోడును బైపోలార్ ఎలక్ట్రోడ్ అంటారు.

ప్రాథమిక విద్యుత్ ఘటం

[మార్చు]

ప్రాథమిక విద్యుత్ ఘటం ఒక ప్రత్యేకమైన విద్యుత్ రసాయనిక ఘటము. ఇందులో చర్యను వెనక్కు తిప్పలేము.[3] కాబట్టి ఇందులో ఆనోడు, కాథోడు స్థిరంగా ఉంటాయి. ఆనోడు ఎప్పుడూ ఋణ ఎలక్ట్రోడే. ఈ ఘటాన్ని డిశ్చార్జి చేయగలం కానీ రీచార్జి చేయలేం.

ద్వితీయ విద్యుత్ ఘటం

[మార్చు]

ద్వితీయ విద్యుత్ ఘటంలో, ఉదాహరణకు రీచార్జ్ చేయగలిగే బ్యాటరీ, రసాయనిక చర్యలు రెండు వైపులా జరిగే వీలుంటుంది. ఘటం చార్జి అవుతున్నపుడు ఆనోడు ధన ఎలక్ట్రోడు గాను, కాథోడు ఋణ ఎలక్ట్రోడుగా మారిపోతుంది. ఎలక్ట్రోలిటిక్ సెల్ లో కూడా ఇదే తరహా చర్యలు జరుగుతాయి.

మూలాలు

[మార్చు]
  1. Weinberg, Steven (2003). The Discovery of Subatomic Particles Revised Edition. Cambridge University Press. pp. 81–. ISBN 978-0-521-82351-7. Archived from the original on 13 May 2016. Retrieved 18 February 2015.
  2. Faraday, Michael (1834). "On Electrical Decomposition". Philosophical Transactions of the Royal Society. Archived from the original on 2011-07-20. Retrieved 2018-04-06. In this article Faraday coins the words electrode, anode, cathode, anion, cation, electrolyte, and electrolyze.
  3. Sivasankar (2008). Engineering Chemistry. Tata McGraw-Hill Education. ISBN 9780070669321. Archived from the original on 2017-12-21.