మైకేల్ ఫారడే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Michael Faraday
Engraving by John Cochran after a portrait by Henry William Pickersgill, ca. 1820
జననం(1791-09-22) 1791 సెప్టెంబరు 22
Newington Butts, Surrey, England
మరణం1867 ఆగస్టు 25 (1867-08-25)(వయసు 75)
Hampton Court, Surrey, England
నివాసంEngland
జాతీయతBritish
రంగములుPhysics and chemistry
విద్యాసంస్థలుRoyal Institution
ప్రసిద్ధిFaraday's law of induction
Electrochemistry
Faraday effect
Faraday cage
Faraday constant
Faraday cup
Faraday's laws of electrolysis
Faraday paradox
Faraday rotator
Faraday-efficiency effect
Faraday wave
Faraday wheel
Lines of force
ప్రభావాలుHumphry Davy
William Thomas Brande
ముఖ్యమైన అవార్డులుRoyal Medal (1835 & 1846)
Copley Medal (1832 & 1838)
Rumford Medal (1846)
Signature

మైకేల్ ఫెరడే, FRS (సెప్టెంబర్ 22, 1791ఆగష్టు 25, 1867) ఒక ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త మరియు భౌతిక శాస్త్రవేత్త (లేదా ఆనాటి పరిభాషలో సహజ తత్వవేత్త ). ఆయన విద్యుదయస్కాంతం మరియు విద్యుత్ రసాయన శాస్త్రం రంగాలలో గొప్ప పరిశోధనలు చేసారు.

DC విద్యుత్ ప్రవాహంతో కూడిన ఒక వాహకం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని ఫారడే అధ్యయనం చేసి, భౌతిక శాస్త్రములో విద్యుత్ అయస్కాంత ప్రేరణ అనే క్రొత్త సిద్ధాంతాన్ని నెలకొల్పారు. అయిన విద్యుదయస్కాంత ప్రేరణ, డయా అయస్కాంతత్వం, మరియు విద్యుత్ విశ్లేషణ సూత్రాలను కనుగొన్నారు. అయస్కాంత శక్తి కాంతి కిరణాల మీద ప్రభావం చూపుతుందని మరియు ఈ రెండు ప్రక్రియలకు సంబంధం ఉందని అయిన నిర్ధారించాడు.[1][2] ఆయన రూపొందించిన విద్యుదయస్కాంత ప్రేరణ సాధనాలే విద్యుత్ మోటార్ టెక్నాలజీకి పునాదిగా నిలిచాయి. ఈనాడు సాంకేతిక రంగములో విద్యుత్ వాడకము ఈయిన ప్రయత్నాల వల్లే సాధ్యమయింది.

ఒక రసాయన శాస్త్రవేత్తగా ఈయన బెంజీన్ ను కనుగొన్నారు. క్లోరిన్ యొక్క క్లాత్రేట్ హైడ్రేట్ మీద పరిశోధనలు చేసి బున్సన్ బర్నర్ యొక్క తొలి రూపాన్ని కనుగొన్నారు. ఆక్సీకరణ సంఖ్య వ్యవస్థను రూపొందించారు. ఎనోడ్, కాతోడ్, ఎలేక్ట్రోడ్, అయాన్ వంటి పదాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు.

ఆయన అతి తక్కువే చదువుకున్నా, ఫుచ్క్ ఉన్నారు. కొందరు చరిత్రకారులు,[3] ఫెరడే ను విజ్ఞానం యొక్క చరిత్రలో అతి ఉత్తమ పరిశోదకడుగా పెర్కున్నారు.[4] కాపాసిటన్స్ యొక్క SI యూనిట్ అయిన ఫారడ్, ఆయన పేరును బట్టే పెట్టబడింది. అలాగే, ఫెరడే కాన్స్తంట్, ఒక ఎలెక్ట్రాన్మొల్లో ఉన్న చార్జి (సుమారు 96,485 కూలూమ్బ్ లు) కు కూడా ఈయిన పేరే పెట్టబడింది. ఫెరడే యొక్క ఇండక్షన్ సూత్రం ప్రకారం, నిర్ణీత సమయములో మారుతున్న అయస్కాంత ఫ్లక్స్, ఎలెక్ట్రోమోటివ్ ఫోర్స్ ను సృష్టిస్తుంది.

ఫెరడే నే రాయల్ ఇన్స్టిట్యూషన్ అఫ్ గ్రేట్ బ్రిటిన్ యొక్క మొట్ట మొదటి ఫుల్లెరియన్ రాసాయ శాస్త్ర ప్రొఫెసర్. ఈ పదవికి ఈయిన జీవిత కాలానికి నియమితలయ్యారు.

ఐసక్ న్యూటన్ మరియు జేమ్స్ క్లెర్క్ మాక్స్వెల్ చిత్రపటాలతో పాటు ఫెరడే చిత్రపటాన్ని కూడా ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన గదిలో పెట్టుకునేవారు.[5]

ఫెరడే చాలా మత నమ్మకం కలిగిన వారు; 1730లో స్తైంచబడిన సండమేనియన్ చర్చ అనే ఒక క్రైస్తవ మాట శాఖలో సభ్యుడుగా ఉన్నారు. ఈ మతశాఖ సభ్యులు సంపూర్ణమైన విశ్వాసం మరియు అంకితభావం కలిగి ఉండాలి. "ఫెరడే జీవితమూ మరియు పనులలో దైవం మరియు ప్రకృతి రెండూ ఎకమే అనే భావం ఉండేది" అని ఫెరడే జీవితచరిత వ్రాసిన రచయితలు పెర్కున్నారు.[6]

ప్రారంభ సంవత్సరాలు[మార్చు]

మైకేల్ ఫెరడే, థోమస్ ఫిలిప్స్ చే చిత్రించబడిన చిత్రము 1841-1842[7] చూడండి

ప్రస్తుతం లండన్ బోరో అఫ్ సౌత్వార్క్లో భాగంగా ఉన్న నేవింగ్టన్ బట్స్[8]లో ఫెరడే జన్మించారు; అప్పట్లో ఇది సర్రీ శివారులో, లండన్ బ్రిడ్జ్ కు ఒక మైలు దూరములో ఉండేది.[9] వారిది సంపన్న కుటుంబమేమీ కాదు. అతని తండ్రి జేమ్స్, గ్లాసియాట్ అనే క్రైస్తవ శాఖలో సభ్యుడుగా ఉండేవారు. 1790-91 శీతాకాలములో జేమ్స్ ఫెరడే, తన భార్యా ఇద్దరు పిల్లలతో సహా, వెస్ట్మోర్ల్యాండ్ లోని ఔత్గిల్ నుండి లండన్ కు వెళ్లారు. ఔత్గిల్ లో ఆతను గ్రామ కమ్మరికి సహాయకుడుగా ఉండేవారు.[10] ఆ సంవత్సరములో శరత్ కాలములో మైకేల్ జన్మించాడు. నలుగురు పిల్లల్లో మూడవ వాడిగా జమ్మించిన మైకేల్ ఫెరడే కు అతని చిరు ప్రాయములో అతి తక్కువ స్థాయి ప్రాథమిక విద్య అందుబాటులో ఉండింది. అందువల్ల అతను స్వయంగానే తనంతట తనే చదువుకోవలసి ఉండేది.[11] తన పదనాల్గవ సంవత్సరములో, బ్లాన్ద్ఫోర్డ్ స్ట్రీట్[12] లోని జార్జ్ రైబా అనే స్థానిక బుక్ బైందర్ మరియు పుస్తక విక్రయదారుడు దగ్గిర సహాయకుడుగా చేరాడు. ఏడు సంవత్సరాలు సహాయుకుడుగా పనిచేసిన కాలములో, ఇసక్ వాట్స్ రచించిన ది ఇంప్రూవ్మెంట్ అఫ్ ది మైండ్ వంటి అనేక పుస్తకాలను అతను చదివాడు. ఆ పుస్తకములో ఉన్న సిద్ధాంతాలను సూచనలను ఉత్సాహంగా పాటించాడు. అతనికి విజ్ఞానంలో ముఖ్యంగా విద్యుత్తు మీద ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా, జెన్ మార్సేట్ రచించిన కన్వర్సేషన్స్ ఇన్ కెమిస్ట్రీ అనే పుస్తకం అతన్ని ప్రభావితం చేసింది.[13]

1812లో, తన ఇరవయవ వయస్సులో శిక్షణ పూర్తి అయ్యే సమయములో, రాయల్ ఇన్స్టిట్యూషన్ మరియు రాయల్ సొసైటీ కు చెందిన ప్రముఖ ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త హంఫ్రీ డేవీ మరియు సిటీ ఫిలసాఫికల్ సొసైటీని స్థాపించిన జాన్ టాటుం వారి ప్రసంగాలకు ఫెరడే హాజరయ్యేవారు. అనేక సార్లు ఈ ప్రసంగాలకు టికట్ లను విల్లియం డాన్స్ (రాయల్ ఫిలార్మోనిక్ సొసైటీ స్థాపకుల్లో ఒకరు) ఫెరడేకు ఇచ్చేవారు. తరువాత, ఫెరడే డేవీ ప్రసంగాలపై మూడు వందల పేజీల పుస్తకం ఒకటి రాసి అతనికి పంపించాడు. అతడు దానికి వెంటనే సానుకూలంగా, దయతో స్పందించారు. నైట్రోజెన్ ట్రైక్లోరైడ్ వలన జరిగిన ఒక ప్రమాదములో డేవీకి కంటిచూపు దెబ్బ తిన్నప్పుడు, ఫెరడేను తన కార్యదర్శిగా నియమించాలని నిర్ణయించారు. రాయల్ ఇన్స్టిట్యూట్ సహాయకులలో ఒల్జొల్న్ పెన్ ను ఉద్యోగమునుండి తొలగించినప్పుడు, ఆ ఖాళీని భర్తీ చేయమని సర్ హంఫ్రీ డేవిని కోరారు. అతను ఫెరడేను రాయల్ ఇన్స్టిట్యూట్‌లో కెమికల్ అసిస్టెంట్ గా 1813 మార్చి 1 న నియమించారు.[1]

అప్పట్లో వర్గాల వారీగా విడిపోయి ఉన్న ఆంగ్ల సమాజంలో ఫేరడేను జంటిల్మన్‌గా పరిగణించేవారు కాదు. 1813 లో డేవీ ఐరోపా సందర్శన తలపెట్టినపుడు అతని పరిచారకడు వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఫెరడే డేవీకి వైజ్ఞానిక సహాయుకుడుగా వెళ్తుంటే, పారిస్‌లో మరొక పరిచారకుడు దొరికే వరకు ఫెరడేనే ఆ పని కూడా చేయమన్నారు. అందువలన, ఆ పర్యటన అంతటా ఈ రెండు పనులూ చేయవలసి వచ్చింది. డేవీ భార్య, జెన్ అప్రీస్, ఫెరడేను తమతో సమానమైన వ్యక్తిగా చూడలేదు. (ప్రయాణంలో కోచ్ కు బయట ఉండమని, పనివారితో కలిసి భోంచేయమని చెప్పేది). దీని మూలాన ఫెరడే ఘోరమైన నరకం అనుభవించాడు. విజ్ఞానాన్ని పూర్తిగా వదిలేసి, ఒంటరిగా తిరిగి ఇంగ్లాండ్‌కు వెళ్ళిపోదామా అని కూడా ఆలోచించాడు. అయితే, ఆ ప్రయాణం అతన్ని యురోపియన్ శాస్త్రజ్ఞులతొ పరిచయం కల్పించింది. అనేక ఉత్తేజం కలిగించే ఆలోచనా విధానాలకు పురిగొల్పింది.[1]

ఫెరడే క్రైస్తవ మతములో అత్యంత నమ్మకము కలిగినవాడు. అతని శాండిమేనియన్ విభాగము చర్చ్ ఆఫ్ స్కోట్లాండ్ కు ఒక అనుసంధానము. డీకన్గానూ మరియు రెండు విడతలు ఒక ఎల్డర్ గానూ, అతను తన యుక్త వయసులోని సమావేశ గృహములో, వివాహము అయిన తరువాత కూడా పనిచేశాడు. అతని చర్చ్బార్బికన్ లోని పాల్స్ యాలీలో నెలకొని ఉంది. ఈ సమావేశ గృహము 1862 లో ఐలింగ్టన్ లోని బార్న్సబరి గ్రూవ్ కు మార్చబడింది. ఈ ఉత్తర లండన్ ప్రాంతములోనే ఫెరడే ఎల్దర్ గా రెండవ విడతలో తన చివరి రెండు సంవత్సరాలు పనిచేసి, ఆ బాధ్యత నుండి విరమించుకున్నాడు.[14][15]

ఫెరడే సారా బెర్నార్డ్ ను 1821 జూన్ 12 న వివాహమాడినా కూడా (1800–1879),[16] వారికి పిల్లలు కలుగలేదు.[8] వారు వారి కుటుంబాల ద్వారా శాండిమేనియన్ చర్చ్ లో కలిశారు. అతను తనకు శాండిమేనియాన్ కాన్గ్రిగేషన్ అందు కల నమ్మకాన్ని తన వివాహము జరిగిన నెల తరువాత ఒప్పుకున్నాడు.

శాస్త్రీయ విజయాలు[మార్చు]

రసాయన శాస్త్రం[మార్చు]

మైకేల్ ఫెరడే, అతని పరిశోధనాశాలలో. c1850 లలో వాటర్ కలర్లలో ఫెరడే జీవితాన్ని చిత్రీకరించిన చిత్రకారుడు హర్రీట్ జెన్ మూర్.
టెట్రాక్లొరొ ఇథిలీన్ బృహదణువు

ఫెరడే యొక్క తొలి రసాయనిక కర్తవ్యం హంఫ్రీ డేవీ యొక్క ఒక సహాయకుడిగానే. ఫెరడే క్లోరిన్ పై ప్రత్యేక అధ్యయనము చేసి, కార్బన్ యొక్క రెండు క్రొత్త క్లోరైడ్ లను కనుగొన్నాడు. అతను వాయువుల యొక్క వ్యాపకం గురించి తొలిసారిగా స్థూల పరిశోధనలు గావించగా, ఆ విషయాన్ని తొలిసారిగా జాన్ డాల్టన్ గుర్తించాడు. దీని యొక్క బాహ్య ప్రాముఖ్యత థామస్ గ్రాహం మరియు జోసఫ్ లోస్చ్మిడ్ట్ ల ద్వారా పూర్తి వెలుగులోనికి వచ్చింది. అతను అనేక వాయువులను ద్రవ రూపములోనికి మార్చడంలో సఫలీక్రుతుడయ్యాడు; అతను స్టీల్ యొక్క మిశ్రమలోహం గురించి పరిశోధించి, దృష్టి అవసరాలకు వాడదగిన పలు క్రొత్త రకాల గాజు పదార్ధాలను తయారుచేశాడు. అటువంటి బరువాటి గ్లాసులలో ఒకటి తదుపరి కాలములో ఫెరడే గ్లాస్ ను అయస్కాంత ప్రదేశంలో పెడితే, అది వెలుతురు యొక్క పోలరైసేషన్ వాలును పరిభ్రమించునట్లు చేస్తుందని, ఆ పదార్ధము తొలుతగా అయస్కాంతము యొక్క ధ్రువాలను వికర్షిస్తుందని గ్రహించటం ఒక చారిత్రాత్మకంగా ముఖ్యమైనదిగా పరిణమించింది. అతను శ్రమించి,రసాయన శాస్త్రములోని సామాన్య పద్ధతులను, వాటి ఫలితాలను ఒక ప్రత్యేక శాస్త్రముగా, ప్రాచుర్యములోనికి తీసుకురావటంలో కొంతమేరకు సాఫల్యమును సాధించాడు.

బున్సెన్ బర్నర్గా తరువాయి దశలో పిలువబడి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని శాస్త్రీయ పరిశోధనాగారాలలో సుళువుగా వేడిమిని కల్పించేందుకు వాడబడిన ఈ పరికరము యొక్క ప్రాథమిక రూపకల్పనను అతడే కనిపెట్టాడు.[17][18] ఫెరడే రసాయన శాస్త్ర రంగంలో విస్తృతంగా పనిచేసి, బెంజీన్ (దానిని అతను బికార్బురేట్ ఆఫ్ హైడ్రోజన్ అని పిలిచాడు)వంటి రసాయనిక పదార్ధాలు మరియు ద్రవంగా మారు చెందే వాయువులయిన క్లోరిన్ వంటి వానిని కనుగొన్నాడు. వాయువులు ద్రవరూపములోనికి మారటంతో వాయువులు కేవలం అతి తక్కువ మరిగే స్థానం ఉన్న ద్రవాల యొక్క ఆవిరులు మాత్రమేనని నిర్ధారించి, బృహదణువు యొక్క సముదాయము అనే ఆలోచనా ధోరణులకు తగిన ఆధారాలను అందించింది. 1820 లో ఫెరడే కార్బన్ మరియు క్లోరిన్ నుండి తయారు చేయబడిన మొట్టమొదటి మిశ్రమదాతువులు C2Cl6 మరియు C2Cl4 గురించి తెలిపి, తరువాత తన పరిశోధనా ఫలితాలను ఆ మరుసటి సంవత్సరం ప్రచురించాడు.[19][20][21] ఫెరడే, హంప్రీ డేవీ 1810 వ సంవత్సరములో కొనుగొన్న క్లోరిన్ క్లాతరేట్ క్రిస్టల్స్ యొక్క కూర్పును తెలుసుకున్నాడు.[22][23]

ఫెరడే ఎలక్త్రోలసిస్ సూత్రాలను కూడా కనిపెట్టాడు.యానోడ్, కాతోడ్,ఎలక్త్రోడ్, మరియు అయాన్ వంటి పదాలను విలియం వీవేల్ సృష్టించగా, ఫెరడే వాటిని బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చాడు.

మెటాలిక్ నానోపార్టికల్స్గా తరువాతి కాలంలో పిలువబడిన వానిలో తొలిగా నివేదించినది ఫెరడే నే. 1847 లో అతను బంగారపు కొల్లోయిడ్ స్ యొక్క ఆప్టికల్ లక్షణాలు బల్క్ లోహానికి భిన్నంగా ఉన్నాయని కొనుగోన్నాడు. ఇదే బహుశా అతనిచే క్వాంటం పరిమాణము యొక్క ప్రభావాలు గురించి మొదటిగా నమోదయి నివేదించబడిన విషయము, మరియు ఇదే నానోసైస్ యొక్క ఆవిర్భావానికి నాందిగా భావించటం జరిగింది.[24]

విద్యుచ్ఛక్తి మరియు అయస్కాంతశక్తి[మార్చు]

ఫెరడే తాను విద్యుచ్ఛక్తి మరియు అయస్కాంతశక్తి పై జరిపిన అనేక పరిశోధనలకుగానూ ప్రసిద్ధి చెందాడు. అతను నమోదు చేసిన మొట్టమొదటి పరీక్ష, ఏడు సగం పెన్స్ ముక్కలు కలిగి, ఏడు డిస్క్ ఆకారములోని జింకు రేకులతో పేర్చబడిన మరియు ఆరు ఉప్పు నీటిలో నానిన కాగితపు ముక్కలతో నిర్మించబడిన వోల్టాయిక్ పైల్. ఈ ఇలా పేర్చబడిన వానితో అతను సల్ఫేట్ ఆఫ్ మాగ్నీషియాను (1812 జూలై 12 నాటి అబ్బాట్ కు మొదటి ఉత్తరం) విడదీశాడు.

ఒక వోల్తైక్ పైల్
ఫెరడే యొక్క ఎలేక్ట్రోమాగ్నేటిక్ ఎక్స్పరిమెంట్, కా. 1821[25]
ఒక సోలేనోయిడ్

1821లో డేనిష్ భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త అయిన హన్స్ క్రిస్టియన్ ఆర్స్టెడ్ విద్యుత్-ఐస్కాంత తత్వాన్ని కనుగొన్న వెనువెంటనే, డేవి మరియు బ్రిటిష్ శాస్త్రవేత్త విల్లియం హైడ్ వల్ల్స్టన్ ఒక విద్యుత్ మోటార్ ను రూపొందించడానికి ప్రత్నించి విఫలమయ్యారు.[2] ఈ ఇద్దరుతో సమస్యను చర్చించిన అనంతరం, ఫెరడే విద్యుత్-ఐస్కాంత తిరుగుడును ఉత్పన్నం చేయగల రెండు సాధనాలను రూపొందించారు: ఒక తీగ చుట్టూ ఉన్న గుండ్రని ఐస్కాంత బలమునుండి నిరంతర గుండ్రని కదిలికను ఇస్తుంది. మరొక సాధనంలో ఒక తీగను ఐస్కాంతం ఉన్న పాదరసం ద్రవంలో పెట్టి ఒక రసాయన బేటరీ నుండి విద్యుత్ ను పంపినప్పుడు, ఆ ఐస్కాంతం తిరుగుతుంది. ఈ రెండవ సాధానము హోమోపోలర్ మోటర్ అని పిలవబడుతుంది. ఈ ప్రయోగాలు, క్రొత్త ఆవిష్కరణలు ఆధునిక విద్యుత్-ఐస్కాంత సిద్ధాంతానికి పునాదిగా ఉన్నాయి. ఉత్సాహం, అదివరకి వోల్లాస్టన్, డేవి చేసిన పనులను ప్రస్థాపించకుండా తాను కనుగొన్న ఫలితాలను ఫెరడే ప్రచురించాడు. ఈ విషయం రాయల్ సొసైటీలో వివాదానికి దారి తీసి డేవితో తనకు ఉన్న గురువనే సత్సంబంధం క్షీణించింది. బహుశా దీని వలెనే చాలా సంవత్సరాలు ఫెరడే విద్యుత్-ఐస్కాంత పరిశోధనలకు దూరంగా ఉంచి అతనికి ఇతర కార్యకలాపాలు ఇవ్వబడ్డాయి.[26][27]

1821లో అతని ప్రారంభ విద్యుత్-ఐస్కాంత (EM) ఆవిష్కరణ నుండి, ఫెరడే ప్రయోగశాలలో ప్రయోగాలను కొనసాగిస్తూ, పదార్ధాల గుణగణాలను అన్వేషిస్తూ, మంచి అనుభవాన్ని సంపాదించారు. 1824లో, ఫెరడే ఒక సర్క్యూట్ ను రూపొందించి ఒక ఐస్కాంత ప్రాంతం ప్రక్కన ఉన్న ఒక తీగలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించ గలదా అని పరిశోధన చేసాడు. అయితే రెండిటికి సంభందం ఏమి బయటబడలేదు.[28] ఈ పరిశోధనశాలలో ఇటువంటి పరిశోధన మూడు సంవత్సరాల క్రితం కాంతి మరియు ఐస్కాంతం మీద ఇదే పరిశోధన జరిగింది. అయితే ఫలితాలు అలాగే ఉన్నాయి.[29][30] మరుసటి ఏడు సంవత్సరాలలో, ఫెరడే ఆప్టికల్ ప్రమాణంతో కూడిన (ఎక్కువ బరువుగల) గాజును, అనగా సీసం యొక్క బోరో-సిలికేట్[31] ను తయారించడంలో ఎక్కువ సమయం గడిపాడు. కాంతికి ఐస్కాంత తత్వానికి ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేయడానికి దీనిని వాడాడు.[32] ఆప్టిక్స్ ప్రిశోదనల నుండి కొంత విరామం దొరికినప్పుడు, ఫెరడే తన పరిశోధనలను ప్రచురిస్తూ ఉన్నారు (వీటిలో కొన్ని EM సంబందిన్చానవి). అతను డేవితో ఐరోపా పర్యటనకు వెళ్ళినప్పుడు పరిచయమైన విదేశీ శాస్త్రవేత్తలతో సంప్రదింపులు కొనసాగిస్తూ ఉన్నారు.[33] డేవి మరణించిన రెండు సంవత్సరాల అనంతరం, 1831లో ఫెరడే కొన్ని వరుస పరిశోధనలు చేయడం ప్రారంబించి, విద్యుత్-ఐస్కాంత ఇండక్షన్ ను కనుగున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితమే, జోసెఫ్ హెన్రీ బహుశా సెల్ఫ్-ఇండక్షన్ ను కనుగున్నాడు. ఇద్దరూ కూడా ఫ్రాన్సేస్కో జంటేడేస్చి ఇటలిలో 1829 మరియు 1830లలో చేసిన పరిశోధనలను ఆధారంగా తీసుకున్నారు.[34]

ఆంగ్లేయ రసాయనిక శాస్త్రవేత్తలు జాన్ డేనియల్ (ఎడమ) మరియు మైకేల్ ఫెరడే (కుడి), ఎలేక్త్రోకేమిస్ట్రీ యొక్క స్థాపకులుగా ఈనాడు ప్రసిద్ధి చెందినవారు.

ఫెరడే రెండు ఇన్సులేట్ చేయబడిన తీగచుట్టులను ఒక ఇనుప వలయం చుట్టూత చుట్టినప్పుడు, ఒక తీగాచుట్టలో విద్యుత్ ను పంపినప్పుడు, తాత్కాలికంగా రెండవ తీగాచుట్టులోనూ విద్యుత్ ఇండ్యూస్ చేయబడింది.[2] ఈ ప్రక్రియను పరస్పర ఇండక్షన్ అని పిలుస్తారు. ఈ ఇనుప వలయం-తీగచుట్టు సాధనం ఇప్పాటికి రాయల్ ఇన్స్టిట్యూషన్ లో ప్రదర్శించబడుతుంది. ఒక ఐస్కాన్తాన్ని ఒక తీగవలయం మధ్యలో కదిలిస్తే, ఆ తెగలో విద్యుత్ కరంట్ ప్రవహిస్తుందని తరువాత చేసిన పరిశోధనలలో ఆయినా కనుగున్నారు. ఆ వలయాన్ని కదిలికలేని ఒక ఐస్కాంతం పైన కదిలించినా, కరంట్ ప్రవహించింది. మారుతూ ఉన్న ఒక ఐస్కాంత ప్రదేశం విద్యుత్ ప్రదేశాన్ని సృష్టిస్తుందని అతని ప్రదర్శనలు నిర్ధారించాయి. ఈ సంబంధాన్ని జేమ్స్ క్లెర్క్ మాక్స్వెల్ గణితపరంగా రూపొందించి, దానికి ఫెరడే సూత్రం అని పేరు పెట్టారు. ఇదే తరువాత నాలుగు మాక్స్వెల్ సమీకరణాలలో ఒకటిగా చెప్పబడింది. ఇవే తరువాత ఫీల్డ్ సిద్ధాంతం అని చెప్పబడ్డాయి.

తరువాత ఫెరడే ఈ సూత్రాన్ని ఉపయోగించి, నూతన శక్తి జనరేటర్లకు మూలం అయిన ఎలెక్ట్రిక్ డైనమో ను నిర్మించాడు.

1839 లో అతను విద్యుత్చ్చక్తి యొక్క ప్రాథమిక లక్షణాలను కనిపెట్టేందుకు ఉద్దేశించిన ఒక శ్రేణి పరిశోధనలు పూర్తి చేశాడు. ఫెరడే "స్టాటిక్", బ్యాటరీలు, మరియు "జంతు విద్యుత్చ్చక్తి" ని ఉపయోగించి ఎలేక్ర్టోస్టాటిక్ ఆకర్షణను, ఎలాక్ట్రోలసిస్, అయస్కాంతశక్తి, మొదలగు వానినీ సృష్టించాడు. ఆ కాలములోని శాస్త్రీయ ఆలోచనా విధానానికి భిన్నంగా, విద్యుత్చ్చక్తిలో వివిధ "రకాలు" ఉన్నాయనే విషయము అవాస్తవమని నిర్ణయానికి వచ్చాడు. ఫెరడే ఒకే రకమైన "విద్యుత్చ్చక్తి" ఉంటుందని తెలిపి, వివిధ రకాల ప్రాకృతిక అంశాలు పరిమాణము మరియు తీవ్రతలో కలిగే మార్పుల(కరంట్ మరియు వోల్టేజి) వలననే ఉత్పన్నమౌతాయనే విషయాన్ని నివేదించాడు.[2]

అతని వృత్తి తుది దశలలో, ఫెరడే ఎలేక్ట్రోమాగ్నేటిక్ శక్తులు కండక్టర్ చుట్టూ ఉండే ఖాళీ స్థాలములోనికి వ్యాపిస్తాయని సూచించాడు. ఈ ఆలోచన అతని తోటి శాస్త్రజ్ఞులచే నిరాకరింపబడినా, అంతిమంగా దానిని ఆమోదించారని తెలుసుకోవటానికి ఫెరడే జీవించి లేడు. ఫెరడే ఊహ ప్రకారం, చార్జ్ కలిగిన వస్తువులు మరియు అయస్కాంతాల నుండి లైన్స్ ఆఫ్ ఫ్లక్స్ వస్తాయనే విషయము, ఆధారంగా ఎలక్ట్రిక్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ లను వీక్షించే అవకాశం లభించింది. 19వ శతాబ్దంలో మిగిలిన కాలములో ఇంజనీరింగ్ పరిశ్రమను ఏలిన ఎలెక్ట్రో-మెకానికల్ సాధానాలు విజయవంతంగా రూపొందించడానికి ఆ మానసీక మాడలే కీలకంగా నిలిచింది.

డయామాగ్నేటిసం[మార్చు]

మైకేల్ ఫెరడే 1845 లో అతను ఒక గాజు బార్ ను వాడి అయస్కాంతశక్తి కాంతిని ఒక డైఎలక్ట్రిక్ పదార్ధములో ప్రభావితం చేయగలదు అని చూపుతున్నట్లు.[35] చూడండి

అనేక పదార్ధాలు ఐస్కాంత ప్రాంతమునుండి బలహీనమైన వికర్షణ చూపుతాయని 1845లో ఫెరడే కనిపెట్టి, దీనికి డయామాగ్నేటిసం అని పేరు పెట్టారు.

ఒక సరళిలో పోలరైజ్ అయిన క్రాంతి కిరణం యొక్క పోలరైజేషన్ తలాన్ని, ఆ క్రాంతి కిరణం కదులుతున్న దిశలోనే ఉన్న ఒక వేలుపరి ఐస్కాన ప్రాంతాన్ని వాడి, తిప్పవచ్చు అని ఫెరదే కనుగున్నారు. ప్రస్తుతం దీనిని ఫెరడే ఎఫెక్ట్ అని పిలుస్తారు. అయిన తన నాట్ పుస్తకములో ఈ విధంగా వ్రాశారు, "నేను చివరిగా ఒక ఐస్కాంత రేఖ లేదా బల రేఖ ను క్రాన్తింప చేయడములో మరియు ఒక క్రాంతి కిరణాన్ని ఐస్కాంత పరచడములో సఫలమయాను."

1862లో తన వయోప్రోయములో, ఫెరడే స్పెక్ట్రోస్కోప్ ను ఉపయోగించి ఐస్కాంత ప్రభావం వలన క్రాంతి రేఖలలో మరియు క్రాంతి కిరణాల యొక్క వివిధ మార్పులను పరిశీలించారు. అయితే, అప్పట్లో అందుబాటులో ఉన్న పరికరాలు క్రాంతి రేఖ మార్పులను నిర్దారించడానికి సరిపోలేదు. తరువాత పీటర్ జీమన్ ఒక మెరుగైన పరికరాలను ఉపయోగించి దీనిని అధ్యయనం చేసి, 1897లో ఫలితాలను ప్రచురించారు. దానికి అతనికి 1902లో నోబల్ పురస్కారం లభించింది. 1897 ప్రచురణ లోను,[36] నోబల్ ప్రసంగములోను[37] జీమన్ ఫెరడే పనుల గురించి ప్రస్తావించారు.

ఫారడే పంజరం[మార్చు]

ఒక బాహ్య విద్యుత్ ఫీల్డు చార్జ్ లను పునఃసవరణ చేసి అంతర్భాగములో ఉన్న ఫీల్డ్ ను నిర్వీర్యం చేస్తుంది.

స్టాటిక్ విద్యుత్ శక్తి మీద చేసిన పరిశోధనలలో, ఒక చార్జి కలిగిన ఒక వాహకి వేలుపరి బాగాములో మాత్రమే చార్జ్ ఉంటుందని, వేలపాలో ఉన్న చార్జ్, వాహకి లోపల ఏ ప్రభావం మీద చూపించదని ఫెరడే నిర్ధారించారు. ఇది ఎందుకంటే, వెలుపల ఉన్న చార్జులు పునర్ పంపిణి అయి లోపల వాటి ఫీల్డులు రద్దవుతాయి. ఈ షీల్దింగ్ ప్రబావాన్ని ఫెరడే పంజరం అని ఇప్పుడు పిలబడే సాధనంలో వాడుతారు.

ఫెరడే ఒక అధ్బుతమైన పరిశిదోదనా కారుడు. తన ఆలోచలను స్పష్టమైన సులబమైన భాషలో చెప్పేవారు. అయితే, గణితములో అతని సామర్ధ్యం చాల తక్కువగా ఉండేది. ట్రీగ్నామెట్రి వరకు కూడా అతని గణితా జ్ఞానం లేదు. సాధారణ ఆల్జీబ్రా మాత్రమే అతనికి తెలిసింది. జేమ్స్ క్లీర్క్ మాక్స్వెల్ ఫెరడే మరియు ఇతరులు కనిపెట్టివాటిని సమకూర్చి, సమీకరణాలను రూపొందించారు. ఇవే ఆధునిక విద్యుత్-ఐస్కాంత ప్రక్రియకు పునాదిగా నిలిచాయి. ఫెరడే వాడిన బల గీతలు గురించి మాక్స్వెల్ ఈ విధంగా రాసారు, "వాస్తవంగా ఫెరడే ఒక అత్యుత్తమ గణిత నిపుణుడు - బవిష్యత్తు గణిత నిపుణులు ఫెరడే నుండి అనేక విష్యాలు నేర్చుకుంటారు."[38]

రాయల్ ఇన్స్టిట్యూషన్ మరియు ప్రజా సేవ[మార్చు]

మైకేల్ ఫెరడే ఫాథర్ థేమ్స్ ను కలవటం, పంచ్ (1855 జూలై 21) నుండి
మధ్య 1800 లలోని లైట్ హౌస్ లాంతరు గది

ఫెరడే నే రాయల్ ఇన్స్టిట్యూషన్ అఫ్ గ్రేట్ బ్రిటిన్ యొక్క మొట్ట మొదటి ఫుల్లెరియన్ రాసాయ శాస్త్ర ప్రొఫెసర్. ఈ పదవికి ఈయిన జీవిత కాలానికి నియమితలయ్యారు. అతని స్పాన్సార్ మరియు గురువు, జాన్ 'మ్యాడ్ జాక్' ఫుల్లెర్. రాయల్ ఇంస్టిట్యూషన్ లో ఈ పదవిని సృష్టించారు. 1824లో ఫెరడే రాయల్ సొసైటి సభ్యుడుగా ఎన్నికయ్యారు. 1825లో ప్రయోగశాల అధ్యక్షుడుగా నియమితలయ్యారు; 1833లో సంస్థలో జీవితకాల ఫుల్లెరియన్ రాసాయశాస్త్ర ప్రొఫెసర్ గా, ఎటువంటి ప్రసంగాలు ఇవ్వవలసిన అవసరం లేకుండా, నియమితలయ్యారు.

రాయల్ ఇన్స్టిట్యూషన్ లో రసాయన శాస్త్రం, విద్యుత్, ఇసకంత తత్వం వంటి రంగాలలో టి వైజ్ఞానిక పరిశోధనలు చేయడమే కాకుండా, ప్రైవేట్ సంస్థలకు, బ్రిటిష్ ప్రభుత్వానికి సమయం ఎక్కువ తీసుకుంటున్న అనేక సేవా ప్రాజక్టులను చేపట్టారు. బొగ్గు గనులలో పెలుడ్లను దర్యాప్తు చేయడం, న్యాయస్థానంలో ఒక నిపుణుడుగా సాక్షి ఇవ్వడం, ఉన్నత నాణ్యత కలిగిన ఆప్టికల్ గాజు తయారు చేయడం వంటి పనులను చేపట్టేవారు. 1846లో, హస్వేల్ కౌంటి డుర్హాం లోని గనిలో సంబవించిన 95 కార్మికులను బలికోన్న భయంకరమైన పేలుడు గురించి పూర్తీ వివరాలతో కూడిన ఒక పెద్ద నివేదికను ఫెరడే చార్లెస్ లయేల్తో కలిసి తయారు చేసారు. ఇది క్షుణ్ణంగా రూపొందించబడిన ఫోరెన్సిక్ దర్యాప్తు నివేదిక. ఈ పేలుడు తీవ్రతకు కారణం బొగ్గు డస్ట్ అని సూచించారు. బొగ్గు డస్ట్ వలన పేలుడు అపాయం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది. కాని 60 సంవత్సరాల వరకు 1913 సేన్ఘేన్య్ద్ కొలియరి ప్రమాదం జరిగే వరకు ఈ నివేదకను పట్టించుకోలేదు.

ప్రఘాడమైన నౌకా సంబంధమైన ఉత్సుకత కల దేశంలోని ఒక గౌరవనీయుడైన శాస్త్రవేత్తగా ఫెరడే అధిక సమయము లైట్ హౌస్ ల నిర్మాణము మరియు పనితీరు వంటి విషయాలను సాధించటం ఫై దృష్టి పెట్టి, నౌకల అడుగు భాగాలు అరిగిపోవటం జరగకుండా నివారించటానికి తగిన చర్యలు చేపట్టాడు.

ఫెరడే పర్యావరణ శాస్త్రము, లేక ఇంజనీరింగ్ గా ప్రస్తుతము పిలువబడుతున్నవిద్యలో కూడా చురుకుగా ఉండేవాడు. అతను స్వాన్ సీ లోని పారిశ్రామిక కాలుష్యము గురించి పరిశోధించటమే కాక రాయల్ మింట్ అందలి గాలిలో కాలుష్యము గురించి కూడా సంప్రదించబడ్డాడు. జూలై 1855 లో ఫెరడే థ టైమ్స్ కు థేమ్స్ నది యొక్క అధమ పరిస్థితి గురించి లేఖ వ్రాయగా, దాని ఆధారంగా పలుసార్లు తిరి అచ్చు వేయబడిన పంచ్ అనే ఒక కార్టూను రూపుదిద్దుకుంది. (ఇది కూడా చూడండి థ గ్రేట్ స్టింక్.)

ఫెరడే 1851 లో లండన్ లో జరిగిన గొప్ప ప్రదర్శన కొరకు ప్రదర్శింపబడే వస్తువులకు సంబంధించి యోజనాలు చేయటం మరియు నిర్ణయించటంలో సహాయపడ్డాడు. అతను నేషనల్ గ్యాలరీ ని శుభ్రపరచటంలోను, అందలి కళా ఖండాలను రక్షించటంలోనూ వారికి సలహాలు ఇవ్వటమే కాక, నేషనల్ గ్యాలరీ సైట్ కమిషన్ లో 1857 లో పనిచేశాడు.

ఫెరడే సేవలు అందుకున్న మరొక విభాగము విద్యాబోధన. అతను ఒక విషయము ఫై 1854 లో థ రాయల్ ఇన్స్టిట్యూషన్ లో ఉపన్యాసము ఇచ్చాడు. 1862 లో అతను పబ్లిక్ పాఠశాలల కమిషన్ ముందు హాజరయి గ్రేట్ బ్రిటన్ లో విద్యావిధానము గురించి తన ఆలోచనలను తెలిపాడు. ఫెరడే మోసాలు, మాయలు, మరణించినవారితో సంభాషించే సభలు వంటివాని అందు ప్రజలకు ఉన్న ఆసక్తిని గురించి నిరసించి, పబ్లిక్ మరియు రాష్ట్ర విద్యావిధానాన్ని తూలనాడాడు.[39]

ఫెరడే రాయల్ ఇంస్టిట్యూషన్లో మంటలకు సంబంధించి రసాయన శాస్త్రములోనూ మరియు భౌతిక శాస్త్రములోనూ అనేక సఫలీకృత ప్రసంగాలు చేసి, వాటిని థ కెమికల్ హిస్టరీ ఆఫ్ ఎ కాండిల్ పేరుతో నమోదు చేశాడు. ఇది యువతకు ఉద్దేశించి చేసిన తొలినాటి క్రిస్మస్ ప్రసంగాలలో ఒకటిగా పేర్కొనబడి, ఇప్పటికీ ప్రతి సంవత్సరము ప్రసంగించబడుతున్నాయి. 1827 మరియు 1860 మధ్య కాలంలో ఫెరడే రికార్డు స్థాయిలో పందొమ్మిది సార్లు క్రిస్మస్ ప్రసంగాలు చేశాడు.

తర్వాత జీవితము[మార్చు]

వృద్దాప్యంలో ఫెరడే.
మైకేల్ ఫెరడే 1856 లో క్రిస్మస్ ప్రసంగం చేస్తునట్లుగా

జూన్ 1832 లో థ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ ఫెరడే కు ఎ డాక్టర్ ఆఫ్ సివిల్ లా డిగ్రీని ప్రధానం చేసింది(గౌరవనీయమైన). అతని జీవిత కాలములో ఫెరడే నైట్హుడ్ ను నిరాకరించటమే కాక, రెండు సార్లు ప్రసిడెంట్ ఆఫ్ రాయల్ సొసైటీ పదవిని కూడా నిరాకరించాడు. ఫెరడే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు 1838 లో విదేశీ సభ్యునిగా ఎన్నికయి,ఫ్రెంచ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్లో 1844 లో ఎన్నుకోబడిన ఎనిమిదిమంది సభ్యులలో ఒకనిగా ఉన్నాడు.[40]

1848 లో ప్రిన్స్ కన్సోర్ట్ అభ్యర్ధనల మేరకు మైకేల్ ఫెరడే కు గ్రేస్ ఎండ్ ఫేవర్ హౌస్ ను హంప్తాన్ కోర్ట్,సర్రేలో బహుకరించి, అన్ని ఖర్చులు, నిర్వహణ ఖర్చుల నుండి మినహాయింపు ఇచ్చారు. ఇదే మాస్టర్ మేసన్ యొక్క గృహము. దీనినే తరువాత కాలములో ఫెరడే హౌస్ గానూ, మరియు ప్రస్తుతము నంబరు 37 హంప్టన్ కోర్ట్ రోడ్డు గానూ పిలిచారు. 1858 లో ఫెరడే పదవీవిరమణ గావించి, అక్కడ నివసించటం మొదలుపెట్టాడు.[41]

బ్రిటీషు ప్రభుత్వము క్రైమియన్ యుద్ధము(1853–1856) కొరకు రసాయనిక ఆయుధాల ఉత్పత్తి గురించి సలహా అడిగినప్పుడు, ఫెరడే దానిలో పాల్గొనటానికి నైతిక కారణాల వలన నిరాకరించాడు.[42]

ఫెరడే హాంప్టన్ కోర్ట్ లోని తన నివాసములో 25 ఆగస్టు నాడు మరణించాడు.[43]. వెస్ట్ మిన్స్టర్ యాబ్బే వద్ద ఖననం చేయటానికి అతను గతంలో వ్యతిరేకించాడు.కానీ అతనికి ఇస్సాక్ న్యూటన్ సమాధికి దగ్గరలో ఒక స్మారక చిహ్నము అక్కడ ఉంది. ఫెరడేను చర్చ్ నిబంధనలను వ్యతిరేకించే (నాన్-ఆంగ్లికన్) విభాగములో హైగేట్ సిమెట్రీలో ఖననం చేశారు.

== స్మారక చిహ్నాలు ==

మైకేల్ ఫెరడే, సేవోయ్ ప్లేస్ లో విగ్రహము, లండన్. శిల్పకారుడు జాన్ హెన్రీ ఫోలీ ఆర్ ఏ

ఫెరడే యొక్క శిల్పము ఒకటి సేవోయ్ ప్లేస్,లండన్ లో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎండ్ టెక్నోలజీ బయట నిలిచి ఉంది. ఇంకా లండన్ లో, థమైకేల్ ఫెరడే మెమోరియల్ అను బ్రుటలిస్ట్ అనే శిల్పకారుడు రాడ్నీ గోర్డాన్ చే రూపకల్పన చేయబడి, 1961 లో పూర్తిచేయబడిన స్మారక చిహ్నము ఎలిఫంట్ మరియు కాసిల్ గైరేటరీ ప్రక్రియలో, ఫెరడే యొక్క జన్మస్థలం అయిన న్యూయింగ్టన్ బట్స్ వద్ద ఉంది.

ఫెరడే గార్డెన్స్ అను ఒక చిన్న ఉద్యానవనము వాల్వర్త్, లండన్ లో అతని జన్మస్థలమైన న్యూయింగ్తాన్ బట్స్ కు దగ్గరలోనే ఉంది. ఈ ఉద్యానవనము ఫెరడే యొక్క స్థానిక కౌన్సిల్ ప్రాంగణం అయిన లండన్ బోరో ఆఫ్ సౌత్వార్క్లో ఉంది.

లౌబోరో యూనివర్సిటీ లోని ఒక హాలుకు ఫెరడే పేరు 1960లో పెట్టారు. భోజనాల గది వద్దనున్న ద్వారము దగ్గర ఇత్తడితో తయారుచేసిన ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పోలిన నమూనా మరియు లోపల అతని చిత్రపటము ఒకటి, రెండూ ఫెరడే గౌరవార్ధం ఉంచబడినవి. యూనివర్సిటీ ఆఫ్ ఎడింబర్గ్యొక్క ఇదు అంతస్తుల భవనమైన శాస్త్ర మరియు ఇంజనీరింగ్ ప్రాంగణమునకు ఫెరడే పేరు పెట్టబడి, అలాగే ఈ మధ్యకాలంలో క్రొత్తగా కట్టిన బ్రన్నేల్ యూనివర్సిటీ అందలి నివాసయోగ్యమైన హాలుకు మరియు స్వాన్ సి యూనివర్సిటీ వద్ద్ధనున్న ప్రధాన ఇంజనీరింగ్ భవనానికి కూడా అతనిపేరు పెట్టారు. గతంలో యుకె ఫెరడే స్టేషను అయి అంటార్క్టికాలో ఉన్న స్టేషను కు అతని పేరే పెట్టారు.

అనేక బ్రిటీషు నగరాలలోని వీధులకు ఫెరడే పేరు పెట్టబడి ఉన్నాయి (ఉదా. లండన్, ఫైఫే, స్విన్దన్, బెసింగ్స్టోక్, నోట్టిన్ఘాం, విట్బై, కిర్క్బై, క్రాలీ, న్యూబారీ, ఐల్స్బారీ మరియు స్టీవెనేజ్) ఇవే కాక ఫ్రాన్స్ లో (పారిస్), జర్మనీ (హీర్మ్స్డోరఫ్), కెనడా (క్యూబెక్), మరియు థ యునైటెడ్ స్టేట్స్ (రేస్టన్, వియె).

1991 నుండి 2001 వరకు ఫెరడే యొక్క చిత్రము సీరీస్ యు £20 బ్యాంకునోట్ల ఫై ముద్రించబడి, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వారిచే విడుదల చేయబడినవి. అతను రాయల్ ఇన్స్టిట్యూషన్ లో మాగ్నేతో-ఎలక్ట్రిక్ స్పార్క్ పరికరాలతో ఒక ప్రసంగం చేస్తున్నట్లుగా చూపించారు.[44]

గ్రంథ పట్టిక[మార్చు]

ఫెరడే యొక్క పుస్తకాలు, కెమికల్ మానిపులేషన్ తప్ప, మిగిలినవన్నీ శాస్త్రీయ ఆధారాలు కలిగిన ప్రసంగా పాటాల యొక్క సంపుటులు.[45] అతని మరణానంతరం, ఫెరడే యొక్క డయరీ ప్రచురించబడటమేకాక, అనేక ఇతర ఉత్తరాలు మరియు ఫెరడే, డేవీతో కలసి 1813–1815 వరకూ చేసిన యాత్రల తాలూకు పుస్తకము కూడా ప్రచురణకు నోచుకున్నాయి.

ఉల్లేఖనాలు[మార్చు]

మూస:Copy section to Wikiquote

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
 • "ప్రకృతి సూత్రాలను అనుసరిస్తే అధ్బుతమైన ఏదీ కూడా నిజమనుకోవటానికి లేదు మరియు అటువంటి విషయాలలో ప్రయోగమే వాని స్థిరత్వానికి అత్యుత్తమ పరీక్ష."[46]
 • పని పూర్తిగావించు ప్రచురించు." — అతని సలహా యువకుడైన విలియం క్రూక్స్ కొరకు
 • "ముఖ్యమైన విషయమేమంటే అన్ని విషయాలనూ ప్రశాంతంగా ఎలా తీసుకోవాలో తెలుసుకోవటం."
 • తరువాత ఏమిటి అను ప్రశ్నలకు సంబంధించి, "ఊహాగానాలు? నాకు ఏమీ లేవు. నేను ఖచ్చితమైన విషయాల మీదే మనసు నిల్పుతున్నాను."
 • "నేను వచ్చే ఆదివారం నాటికి (22 న) 70 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాను. కాబట్టి నా జ్ఞాపకశక్తి తగ్గితే ఆశ్చర్యపోనవసరం లేదు. — మరియు ఈ ౭౦ సంవత్సర కాలంలో నాకు ఎంతో ఆనందమయమైన జీవితం ఉంది. అది ఇంకా సంతోషంగానే ఉంటుంది ఎందుకంటే నేను ఇంకా ఆశ మరియు సంతృప్తితోనే జీవిస్తాను కాబట్టి.[47]
 • కాలేజ్ విల్లె, పెనిల్వేనియా లో ఉన్న ఉర్సినుస్ కాలేజీ లోని ఫాలేర్ హాల్ అఫ్ సైన్స్ ముఖద్వారాల పైన ఉన్న శిలాశాసనంలో ఈ విధంగా మైకేల్ ఫెరదే చెప్పిన మాటలు రాసి ఉంది "కాని ఇంకా ప్రయత్నించండి, ఎందుకంటే ఏమి జరగవచ్చో ఎవరికీ తెలుసు...."[48]
 • "మీ అభిప్రాయాన్ని ...... విజ్ఞాన వంతులచే అంగీకరిమ్పచేయండి; మీరు విజ్ఞానానికి గొప్ప సేవ అందించిన వారవుతారు. మీ ఫలితాలకు వారిచే అవుననో కాదనో చెప్పించాకలిగితే, భవిష్యత్తు పురోగాతిగి అది గొప్ప సహాయం అవుతుంది. కొందరు వెనకాటుతారని అనుకుంటున్నాను ఎందుకంటే వారికి వారి ఆలోహనలకు అంతరాయం కలగడం ఇష్టం ఉండదు."[49]
మైకేల్ ఫెరడే యొక్క సమాధి హైగేట్ శ్మశానములో

వీటిని కూడా చూడండి[మార్చు]

ఆధారాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 మైకేల్ ఫెరడే 1911 ఎన్సైక్లోపెడియా బ్రిటానికా లో చేర్చడానికి పూనుకున్న లవ్ టూనో రిట్రీవ్డ్ జనవరి 2007.
 2. 2.0 2.1 2.2 2.3 "ఆర్చివ్స్ బియోగ్రఫీస్: మైకేల్ ఫెరడే", థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎండ్ టేక్నోలోజీ.
 3. Russell, Colin (2000). Michael Faraday: Physics and Faith. New York: Oxford University Press.
 4. http://www.bath.ac.uk/news/2006/10/25/gulp-ford251006.html " విజ్ఞాన చరిత్రలోనే అత్యుత్తమ పరిశోధకుడు."] డాక్టర్ పీటర్ ఫోర్డ్ చెప్పినట్లుగా, యూనివర్సిటీ ఆఫ్ బాత్స్ భౌతిక శాస్త్ర విభాగము నుండి. జనవరి 2007లో అందుబాటులోకి వచ్చింది
 5. "ఐన్స్తీన్స్ హీరోస్: ఇమజింగ్ ది వరల్డ్ త్రూ ది లంగ్వాజ్ ఆఫ్ మాథమేటిక్స్", రాబిన్ ఎరియన్రోడ్ చే UQP, జేన్ గలీసన్-వైట్ చే 10 నవంబరు 2003 నాడు పునః సమీక్ష చేయబడిన థ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్.
 6. Baggott, Jim (2 September 1991). "The myth of Michael Faraday: Michael Faraday was not just one of Britain's greatest experimenters. A closer look at the man and his work reveals that he was also a clever theoretician". New Scientist. Retrieved 2008-09-06.
 7. నేషనల్ పోర్త్రైట్ గ్యాలరీ ఎన్పీజీ 269
 8. 8.0 8.1 ఫ్రాంక్ ఏ. జే. ఎల్. జేమ్స్, ‘ఫెరడే, మైకేల్ (1791–1867)’, ఆక్స్ఫార్డ్ డిక్షనరీ ఆఫ్ నేషనల్ బయోగ్రఫీ, ఆక్స్ఫార్డ్ యూనివర్సిటీ ప్రెస్, సెప్టెంబర్ 2004; ఆన్లైన్ ఎడిషన్, జనవరి 2008 3 మార్చ్ 2009 నాడు అందుబాటులోకి వచ్చిన
 9. ఫేరడే జీఎవితం, చిరుప్రాయ జీవితంతో సహా, గురించిన సంక్లిప్త వివరాలకు 1873లో ఆస్గుడ్ & కో కంబ్రిద్జ్ లో ప్రచురించిన ఎవరి సాటర్డే: ఎ జర్నల్ అఫ్ చాయ్స్ రీడింగ్ పుస్తకంలోని 175-83 పేజీలు చూడండి.
 10. ఈ శాక సభ్యత్వం ద్వారా జేమ్స్ వేరే ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు పొందాడు అని సూచన. జేమ్స్ లండన్ సమావేశ మందిరంలో 20 ఫెబ్రవరి 1791 నాడు చేరాడు. ఆ వెంటనే, తన కుటుంబాన్ని తెచ్చుకున్నాడు. కేన్టర్ యొక్క (1991) మైకేల్ ఫెరడే, సండేమానియన్ అండ్ సైంటిస్ట్ పుస్తకం యొక్క 57-8 పేజీలు చూడండి.
 11. "మైకేల్ ఫెరడే." హిస్టరీ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. హౌటన్ మిఫ్లిన్ కంపెనీ, 2004. Answers.com 4 జూన్ 2007
 12. మూస:Openplaque
 13. John H. Lienhard (1992). "Jane Marcet's Books". The Engines of Our Ingenuity. episode 744. NPR. KUHF-FM Houston. 
 14. జెఫ్రీ కేన్టర్ యొక్క (1991) మైకేల్ ఫెరడే, సండేమానియన్ అండ్ సైంటిస్ట్ పుస్తకం యొక్క 41-43 మరియు 277-80 పేజీలు చూడండి.
 15. పాల్స్ అల్లే బర్బికాన్ కు దక్షిణ వైపు 10 ఇళ్ళు అవతల ఉంది. పేజి 330 చూడండి ఎల్మ్స్ (1831) టోపోగ్రాఫికల్ డిక్షనరీ ఆఫ్ త బ్రిటీష్ మేట్రోపోలిస్ .
 16. సెయింట్ పాల్ కాథడ్రల్ దగ్గర ఉన్న సెయింట్ ఫైత్-ఇన్-థ-వర్జిన్ లోని రిజిస్టరులో జూన్ 12 న వారికి లైసెన్సు ఈయబడినట్లు నమోదు అయింది. సారా యొక్క తండ్రి అయిన ఎడ్వర్డ్ దానికి సాక్షి. వారి వివాహము 1837 నాటి వివాహము మరియు రిజిస్ట్రేషన్ చట్టము అమలులోనికి వచ్చే 16 సంవత్సరాల ముందు జరిగింది. కంటోర్స్(1991) మైకేల్ ఫెరడే, సాన్దేమేనియాన్ మరియు శాస్త్రజ్ఞుడు లోని 59 వ పుటను చూడండి.
 17. Jensen, William B. (2005). "The Origin of the Bunsen Burner" (PDF). Journal of Chemical Education. 82 (4).
 18. చూడండి పేజీ 127: ఫెరడే యొక్క కెమికల్ మానిపులేషన్, బీయింగ్ ఇన్స్ట్రక్షన్స్ టూ స్టూడెంట్స్ ఇన్ కెమిస్ట్రీ (1827)
 19. Faraday, Michael (1821). "On two new Compounds of Chlorine and Carbon, and on a new Compound of Iodine, Carbon, and Hydrogen". Philosophical Transactions. 111: 47. doi:10.1098/rstl.1821.0007.
 20. Faraday, Michael (1859). Experimental Researches in Chemistry and Physics. London: Richard Taylor and William Francis. pp. 33–53.
 21. Williams, L. Pearce (1965). Michael Faraday: A Biography. New York: Basic Books. pp. 122–123.
 22. Faraday, Michael (1823). "On Hydrate of Chlorine". Quartly Journal of Science. 15: 71.
 23. Faraday, Michael (1859). Experimental Researches in Chemistry and Physics. London: Richard Taylor and William Francis. pp. 81–84.
 24. "The Birth of Nanotechnology". Nanogallery.info. 2006. Retrieved 2007-07-25. Faraday made some attempt to explain what was causing the vivid coloration in his gold mixtures, saying that known phenomena seemed to indicate that a mere variation in the size of gold particles gave rise to a variety of resultant colors. Cite web requires |website= (help)
 25. [39] చూడండి ప్లేట్ 4.
 26. హామిల్టన్ యొక్క ఏ లైఫ్ ఇన్ డిస్కవరీ: మైకేల్ ఫెరడే, జైంట్ ఆఫ్ థ సైంటిఫిక్ రెవల్యూషన్ (2004) పుటలు. 165-71, 183, 187-90.
 27. కాంటర్ యొక్క మైకేల్ ఫెరడే, సాన్డిమేనియన్ మరియు శాస్త్రజ్ఞుడు (1991) పుటలు. 231-3.
 28. థోమ్సన్ యొక్క మైకేల్ ఫెరడే, అతని జీవితము మరియు విజ్ఞానము (1901) పుట.95.
 29. థోమ్సన్ (1901) పుట. 91. ఈ పరిశోధనాశాలలో 10 సెప్టెంబరు 1821 న, ఫెరడే, కాంతికి ఎలేక్ట్రోమాగ్నేటిక్ ప్రకృతి పరిణామాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించినట్లు నమోదు అయి ఉంది.
 30. కాంటర్స్ మైకేల్ ఫెరడే, సాన్దిమేనియాన్ మరియు శాస్త్రజ్ఞుడు (1991) పుట. 233.
 31. పుటలు. థోమ్సన్ అందలి పుటలు 95-98 (1901).
 32. థామ్సన్ (1901) పేజి 100.
 33. ఫెరడే యొక్క తొలి పరిశోధనలు నవంబరు 1825 ఆఖరిలో జరగటం ప్రారంభమయింది. అతను పరిశోధనపై తోటి యూరోపుకు చెందిన శాస్త్రవేత్తలు అయిన యామ్పియర్, ఎమాగో,మరియు ఒయిర్స్తేడ్ లు నిర్వహిస్తున్న సమాంతర పరిశోధనల ప్రభావం ఎంతగానో ఉంది. కాంటర్ యొక్క మైకేల్ ఫెరడే: సాన్దిమేనియాన్ మరియు శాస్త్రజ్ఞుడు (1991) పుటలు. 235-44.
 34. Brother Potamian (1913). "Francesco Zantedeschi article at the Catholic Encyclopedia". Wikisource. Retrieved 2007-06-16. Cite web requires |website= (help)
 35. పూర్వం మాల్ మరియు పోల్య్బ్లాంక్ కా. యొక్క చాయాచిత్రం ఆధారంగా హెన్రీ ఎడ్లార్డ్ చేసిన ఒక చెక్కుడు తాలూకు వివరము 1857. నేషనల్ చిత్ర గ్యాలరీ, యుకె
 36. Zeeman, Pieter (1897). "The Effect of Magnetisation on the Nature of Light Emitted by a Substance". Nature. 55: 347. doi:10.1038/055347a0.
 37. "Pieter Zeeman, Nobel Lecture". Retrieved 2008-05-29. Cite web requires |website= (help)
 38. థ సైంటిఫిక్జే పేపర్స్ ఆఫ్ జేమ్స్ క్లెర్క్ మాక్స్వెల్ వాల్యూం 1 పుట 360; కొరియర్ డోవర్ 2003, ఐఎస్ బిఎన్ 0486495604
 39. చూడండి థ ఇల్లస్ట్రెటెడ్ లండన్ న్యూస్ , జులై 1853, లోని ఫెరడే యొక్క వ్యాఖ్యానాలు.
 40. Gladstone, John Hall (1872). Michael Faraday. London: Macmillan and Company. p. 53.
 41. ఫెరడే మరియు ఫెరడే హౌస్ పై ట్వికెన్హాం మ్యూసియం, జూన్ 2006 నుండి అందుబాటులోకి వచ్చింది
 42. Croddy, Eric (2005). Weapons of Mass Destruction: An Encyclopedia of Worldwide Policy, Technology, and History. ABC-CLIO. pp. Page 86. ISBN 1851094903. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 43. మూస:Openplaque
 44. "Withdrawn banknotes reference guide". Bank of England. Retrieved 2008-10-17. Cite web requires |website= (help)
 45. చూడండి 220 పుట: హామిల్టన్ యొక్క ఏ లైఫ్ ఆఫ్ డిస్కవరీ: మైకేల్ ఫెరడే, జైంట్ ఆఫ్ థ సైంటిఫిక్ రెవల్యూషన్ (2002)
 46. 19 మార్చి 1849 నాడు ఫెరడే యొక్క డయరీ లోని మాట
 47. క్రిస్టియన్ ఫ్రెడరిక్ షోన్బీన్ఫె కు ఉద్ధ్యేశించి 19 సెప్టెంబరు 1861 న ఫెరడే వ్రాసిన ఉత్తరం పేజీ 349 ను థ లెటర్స్ ఆఫ్ ఫెరడే ఎండ్ షోన్బీన్ 1836-1862 (1899, లండన్: విలియమ్స్ & నోర్గేట్) ఈ సైట్ లో చూడండి.
 48. చూడండి బట్ స్టిల్ ట్రై
 49. లైఫ్ ఎండ్ లెటర్స్ నుండి, 2:389.

మరింత చదవడానికి[మార్చు]

జీవిత చరిత్రలు[మార్చు]

 • Bence Jones, Henry (1870). The Life and Letters of Faraday. Philadelphia: J. B. Lippincott and Company.
 • Cantor, Geoffrey (1991). Michael Faraday, Sandemanian and Scientist. Macmillian. ISBN 0-333-55077 Check |isbn= value: length (help).
 • Gladstone, J. H. (1872). Michael Faraday. London: Macmillan.
 • Hamilton, James (2002). Faraday: The Life. London: Harper Collins. ISBN 0-00-716376-2.
 • Hamilton, James (2004). A Life of Discovery: Michael Faraday, Giant of the Scientific Revolution. New York publisher = Random House: Random House. ISBN 1-4000-6016-8. Missing pipe in: |location= (help)
 • Hirshfeld, Alan W. (2006). The Electric Life of Michael Faraday. Walker and Company. ISBN 978-0802714701.
 • Thompson, Silvanus (1901). Michael Faraday, His Life and Work. London: Cassell and Company. ISBN 1-4179-7036-7.
 • Tyndall, John (1868). Faraday as a Discoverer. London: Longmans, Green, and Company.
 • Williams, L. Pearce (1965). Michael Faraday: A Biography. New York: Basic Books.
 • థ బ్రిటీష్ ఎలక్ట్రికల్ మరియు అల్లైడ్ నిర్మాణనాకారుల సంస్థ(1931). ఫెరడే . ఆర్. & ఆర్. క్లార్క్, లిమిటెడ్, ఎడింబర్గ్ 1931.
 • Agassi, Joseph (1971). Faraday as a Natural Philosopher. Chicago: University of Chicago Press.
 • Ames, Joseph Sweetman (Ed.) (c1900). The Discovery of Induced Electric Currents. 2. New York: American Book Company. Check date values in: |year= (help)CS1 maint: extra text: authors list (link)
 • Gooding, David (Ed.) (1985). Faraday Rediscovered: Essays on the Life and Work of Michael Faraday, 1791-1867. London/New York: Macmillan/Stockton.CS1 maint: extra text: authors list (link)
 • Thomas, John Meurig (1991). Michael Faraday and the Royal Institution: The Genius of Man and Place. Bristol: Hilger. ISBN 0-7503-0145-7.
 • Russell, Colin A. (Ed. Owen Gingerich) (2000). Michael Faraday: Physics and Faith (Oxford Portraits in Science Series). New York: Oxford University Press. ISBN 0-19-511763-8.

బాహ్య లింకులు[మార్చు]

జీవిత చరిత్రలు[మార్చు]

ఇతరులు[మార్చు]