ఎస్సీ జమీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్సీ జమీర్
ఒడిస్సా గవర్నర్
In office
2013 మార్చి 21 – 2018 మార్చి 20
ముఖ్యమంత్రినవీన్ పట్నాయక్
అంతకు ముందు వారుచంద్రకాంత్
తరువాత వారుసత్యపాల్ మాలిక్
మహారాష్ట్ర గవర్నర్
In office
2008 మార్చి 9 – 2010 జనవరి 22
ముఖ్యమంత్రిఅశోక్ చవాన్
అంతకు ముందు వారుఎస్ఎం కృష్ణ
తరువాత వారుకే సత్యనారాయన్
గుజరాత్ గవర్నర్
In office
2009 జూలై 30 – 2009 నవంబర్ 26
ముఖ్యమంత్రినరేంద్ర మోడీ
అంతకు ముందు వారుకిషోర్ శర్మ
తరువాత వారుకమలా బెనివాల
వ్యక్తిగత వివరాలు
జననం1931 అక్టోబర్ 17
నాగాలాండ్ భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ
పదవులు
యునైటెడ్ పార్టీ డెమొక్రటిక్ పార్టీ
సంతానం5
కళాశాలఅలహాబాద్ విశ్వవిద్యాలయం

సేనయాంగ్బా చుబతోషి జమీర్ (జననం 17 అక్టోబర్ 1931 [1] ) ఒక భారతీయ రాజకీయవేత్త ఒడిషా మాజీ గవర్నర్ . ఆయన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు పార్లమెంటరీ కార్యదర్శిగా ఇందిరా గాంధీ హయాంలో సహాయ మంత్రిగా ఉన్నారు. ఎస్సీ జమీర్ నాగాలాండ్ ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా, గుజరాత్ గవర్నర్‌గా & గోవా గవర్నర్‌గా పనిచేశారు. అతను పబ్లిక్ వ్యవహారాలలో చేసిన కృషికి 2020లో భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం, పద్మ భూషణ్‌ను అందుకున్నాడు. [2]

బాల్యం[మార్చు]

చుడుతో జమీర్ తకతులకు దంపతులకు 1931 అక్టోబర్ 17న ఎస్సీ జమీర్ జన్మించాడు. [3] ఎస్సీ జమీర్ తన ప్రారంభ విద్యను మోకోక్‌చుంగ్‌లో, కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కాలేజీలో ఆర్ట్స్‌లో ఇంటర్మీడియట్, [4] అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించాడు .

రాజకీయ జీవితం[మార్చు]

ఎస్సీజమీర్ 1961లో నాగాలాండ్ రాష్ట్రం నుండి మొదటి లోక్ సభ సభ్యునిగా పార్లమెంటు ఎన్నికయ్యారు. [5] 1961 నుండి 1970 వరకు, అతను పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు ఈ కాలంలో అతను రైల్వేలు, లేబర్ & పునరావాసం కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశాడు, 1968 నుండి 1970 వరకు, కేంద్ర కమ్యూనిటీ డెవలప్‌మెంట్ & కోఆపరేషన్, ఫుడ్ సహాయ మంత్రిగా పనిచేశాడు. ఎస్సీ జమీర్ జవహర్లాల్ నెహ్రూ హయాంలో పార్లమెంట్ కార్యదర్శి గా పనిచేశాడు.

గవర్నర్[మార్చు]

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒడిశా మాజీ గవర్నర్ డాక్టర్ ఎస్సీ జమీర్‌తో సమావేశమయ్యారు

ఎస్సీజమీర్ జూలై 2004 నుండి జూలై 2008 వరకు గోవా గవర్నర్‌గా పనిచేశాడు [6] మహారాష్ట్ర గవర్నర్ SM కృష్ణ రాజీనామా తర్వాత, 6 మార్చి 2008న, మహారాష్ట్ర తాత్కాలిక గవర్నర్గా పనిచేశాడు. [6] [7] 9 మార్చి 2013న ఒడిశా గవర్నర్‌గా నియమితులయ్యారు. [6] [8]

  1. "S.C. Jamir sworn in Maharashtra Governor". The Hindu. PTI. 19 July 2008. Archived from the original on 14 September 2008. Retrieved 3 July 2023.
  2. "Padma Awards 2020 Announced". pib.gov.in. Retrieved 10 October 2023.
  3. "Hon'ble Shri Mohammed Fazal". Archived from the original on 20 February 2012. Retrieved 21 December 2012.
  4. Some Alumni of Scottish Church College in 175th Year Commemoration Volume.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Jamir Reference2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. 6.0 6.1 6.2 "Prominent Cong leader from Nagaland SC Jamir gets Padma Bhushan". Business Standard India. 26 January 2020. Retrieved 26 February 2021.
  7. "Krishna resignation accepted, Jamir in charge of State". Sify.com. 5 March 2008. Archived from the original on 17 April 2008. Retrieved 10 October 2023.
  8. "Ex-CBI Director Ashwani Kumar appointed Nagaland Governor, S C Jamir in Odisha". India Today. 9 March 2013. Retrieved 31 May 2019.