ఎస్.ఎస్. శివశంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్.ఎస్. శివశంకర్

రవాణా శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
29 మార్చ్ 2022
ముందు ఆర్.ఎస్. రాజా కన్నప్పన్

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
7 మే 2021 – 29 మార్చి 2022
ముందు ఎస్. వలర్మతి
తరువాత ఆర్.ఎస్. రాజా కన్నప్పన్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
11 మే 2021
ముందు ఆర్. టీ. రామచంద్రన్
నియోజకవర్గం కున్నం
పదవీ కాలం
23 మే 2011 – 24 మే 2016
ముందు నియోజకవర్గం సృష్టించారు
తరువాత ఆర్. టీ. రామచంద్రన్
నియోజకవర్గం కున్నం
పదవీ కాలం
17 మే 2006 – 22 మే 2011
ముందు జె. గురు
తరువాత నిల్
(నియోజకవర్గం జయంకొండం , కున్నంతో విలీనం చేయబడింది)
నియోజకవర్గం అందిమడం

వ్యక్తిగత వివరాలు

జననం (1969-03-24) 1969 మార్చి 24 (వయసు 55)
దేవనూర్, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
(1993- ప్రస్తుతం)
తల్లిదండ్రులు శివరాజేశ్వరి (తల్లి)
ఎస్. శివసుబ్రమణ్యం (తండ్రి)
జీవిత భాగస్వామి గాయత్రీదేవి
సంతానం శివశరన్
శివసుర్య
పూర్వ విద్యార్థి అన్నామలై యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు
రచయిత
వెబ్‌సైటు http://sssivasankar.blogspot.com/
http://ss-sivasankar.blogspot.com/

ఎస్‌.ఎస్‌. శివశంకర్‌ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడు సార్లు శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఎస్.ఎస్. శివశంకర్ 1978లో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ద్వారా తన రాజకీయ జీవితం ప్రారంభించి, 1993లో పూర్తికాల రాజకీయాల్లోకి ప్రవేశించి, 1999లో ఆండిమడం యూనియన్‌కి డీఎంకే కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆయన 2001లో అరియలూర్ జిల్లా డీఎంకే కార్యదర్శిగా, జిల్లా డీఎంకే యూనిట్‌ను పెరంబలూరు జిల్లా యూనిట్‌లో విలీనం చేసిన తర్వాత ఆండిమడం యూనియన్‌ కార్యదర్శిగా, మరోసారి అరియలూరు జిల్లా కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశాడు.

ఎస్.ఎస్. శివశంకర్ 1996 నుండి 2001 వరకు శివశంకర్ పెరంబలూరు జిల్లా పంచాయతీకి ఉపాధ్యక్షుడిగా, ఆ తర్వాత 2006 వరకు అరియలూరు జిల్లా పంచాయతీ సభ్యునిగా పనిచేశాడు. ఆయన 2006లో తమిళనాడు శాసనసభ ఎన్నికలలో అండిమడమ్‌ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. శివశంకర్ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి కున్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి[1] 2014 జనవరి 31న అప్పటి తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య సంప్రదాయ ప్రసంగం కాపీని చింపివేసినందుకు ఆయనను మొత్తం అసెంబ్లీ సెషన్‌కు సస్పెండ్ చేశారు.

ఎస్.ఎస్. శివశంకర్ 2016లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కున్నం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ 2,621 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన 2021లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 6,329 ఓట్లతో గెలిచి[2] ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో 2021 మే 7 నుండి 2022 మార్చి 29 వరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా[3][4][5] ఆ తరువాత 2022 మార్చి 29 నుండి రవాణా శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.

మూలాలు[మార్చు]

  1. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  2. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  3. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  4. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.