Jump to content

ఎస్.ఏ. ఖలీల్ బాషా

వికీపీడియా నుండి
ఎస్.ఏ. ఖలీల్ బాషా
ఎస్.ఏ. ఖలీల్ బాషా


మైనార్టీ శాఖ మంత్రి
నియోజకవర్గం కడప నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 2004

వ్యక్తిగత వివరాలు

జననం 1947
కడప, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 11 ఆగష్టు 2020
హైదరాబాద్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీ
జీవిత భాగస్వామి హస్మితా తారాబేగం
సంతానం డాక్టర్‌ సొహైల్‌, సుజాత్‌ అహ్మద్‌, తౌహిబ్‌ అహ్మద్‌
వృత్తి రాజకీయ నాయకుడు

ఎస్‌ఏ ఖలీల్‌బాషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా, మైనార్టీ శాఖ మంత్రిగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఖలీల్‌బాషా 1947లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప లో జన్మించాడు. ఆయన 1961లో కడపలోని మునిసిపల్ హైస్కూల్ పదవ తరగతి పూర్తి చేసి, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి 1971లో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసి కడప నగరంలో డాక్టరుగా 1974లో వృత్తి జీవితాన్ని ప్రారంభించి పేదలకు అందుబాటులో ఉంటూ రెండు రూపాయలకే వైద్యం అందిస్తూ రెండు రూపాయల డాక్టర్‌గా ప్రజల అభిమానాన్ని పొందాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఖలీల్ బాషా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994,లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై ఎన్‌టీఆర్ మంత్రివర్గంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. ఆయన 1999లో ఎన్నికల్లో రెండోసారి ఎమ్లెయెగా గెలిచి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

ఖలీల్ బాషా 2004లో టికెట్ దక్కలేదు, ఆయన 2009లో ప్రజా రాజ్యం పార్టీలో చేరి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడంతో తిరిగి టీడీపీలో చేరి 2014లో టికెట్‌ ఆశించినా పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఖలీల్ బాషా 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

మరణం

[మార్చు]

ఖలీల్‌బాషా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 11 ఆగష్టు 2020న మరణించాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (15 March 2019). "కడప.. మంత్రుల గడప". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  2. HMTV (11 August 2020). "మాజీ మంత్రి ఖలీల్ బాషా‌ కన్నుమూత". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  3. Sakshi (12 August 2020). "ప్రజా నాడి తెలిసిన నేత మరిలేరు". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  4. Andhrajyothy (12 August 2020). "మాజీ మంత్రి ఖలీల్‌బాషా మృతి". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.