ఎస్.రాజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్.రాజం
వ్యక్తిగత సమాచారం
జననం(1919-02-10)1919 ఫిబ్రవరి 10
మూలంభారతదేశం
మరణం2010 జనవరి 29(2010-01-29) (వయసు 90)
వృత్తినటుడు, చిత్రకళాకారుడు, సంగీత విద్వాంసుడు

సుందరం రాజం ( 1919 ఫిబ్రవరి 10 – 2010 జనవరి 29) తమిళనాడుకు చెందిన కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు, చలనచిత్ర నటుడు, చిత్రకళాకారుడు. ఇతడు పాపనాశం శివన్ వద్ద సంగీతం నేర్చుకున్నాడు. ఇతని సోదరుడు తమిళ సినిమా దర్శకుడు, వైణికుడు ఎస్.బాలచందర్. ఇతని సోదరి ఎస్.జయలక్ష్మి తమిళ సినిమా నటి. ఇతడు 1934లోసీతా కళ్యాణం సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఇతడు పూర్తి స్థాయి సంగీత విద్వాంసుడిగా మారక మునుపు కొన్ని సినిమాలలో ముఖ్యపాత్రలను ధరించాడు. ఇతడు ఆకాశవాణిలో నిలయ విద్వాంసునిగా, మ్యూజిక్ సూపర్‌వైజర్‌గా బాధ్యతలను నిర్వహించాడు. ఇతడు గీసిన సంగీత త్రిమూర్తుల తైలవర్ణ చిత్రాలు ప్రపంచఖ్యాతిని ఆర్జించాయి. కోటీశ్వర అయ్యర్ రచనలకు ప్రాచుర్యం కల్పించడంతో ఇతడు ప్రధాన భూమిక వహించాడు. ఇతడు మద్రాసు సంగీత అకాడమీ సభ్యునిగా ఉన్నాడు.[1] [2][3][4][5][6][7][8]

పురస్కారాలు

[మార్చు]
 • ఇతనికి 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు కర్ణాటక గాత్రసంగీత విభాగంలో దక్కింది.
 • మద్రాసు సంగీత అకాడమీ ఇతనికి సంగీత కళాచార్య బిరుదును ప్రదానం చేసింది.
 • 2008లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఇతనికి సంగీత కళాశిరోమణి బిరుదును ఇచ్చి సత్కరించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

ఇతడు నటించిన సినిమాలు:

మూలాలు

[మార్చు]
 1. శంకరనారాయణ, వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF) (1 ed.). హైదరాబాదు: శాంతా వసంతా ట్రస్టు. p. 52. Retrieved 19 February 2021.
 2. "S Rajam passes away". Times of India. 30 January 2010. Archived from the original on 11 ఆగస్టు 2011. Retrieved 19 March 2010.
 3. "S. Rajam remembered on birth anniversary". The Hindu. 12 February 2010. Archived from the original on 16 ఫిబ్రవరి 2010. Retrieved 19 March 2010.
 4. "Musician S. Rajam passes away". The Hindu. 30 January 2010. Archived from the original on 2 ఫిబ్రవరి 2010. Retrieved 19 March 2010.
 5. "About Shri.S.Rajam". Indian Heritage.com. Retrieved 19 March 2010.
 6. Randor Guy (5 February 2010). "Rajam's romance with cinema". The Hindu. Archived from the original on 10 ఫిబ్రవరి 2010. Retrieved 19 March 2010.
 7. Ramnarayan, Gowri (5 February 2010). "Extraordinary life". The Hindu. Archived from the original on 9 ఫిబ్రవరి 2010. Retrieved 19 March 2010.
 8. "Rajam: A multifacted personality". Indian Express. 31 January 2010. Retrieved 19 March 2010.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=ఎస్.రాజం&oldid=3318478" నుండి వెలికితీశారు