ఎస్. ఇంద్రసేన్ రెడ్డి
ఎస్. ఇంద్రసేన్ రెడ్డి | |||
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1943 హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం | ||
మరణం | 27 అక్టోబర్ 2024 హైదరాబాద్ | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
సంతానం | 2 | ||
నివాసం | హైదరాబాద్ |
ఎస్. ఇంద్రసేన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆండ్రాప్ట్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేసి ముఖ్యమంత్రి టి అంజయ్య మంత్రివర్గంలో రాష్ట్రానికి మొదటి ప్రత్యేక ప్రతినిధిగా పనిచేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఇంద్రసేన్ రెడ్డి విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో ఉంటూ 1960ల్లో ఓయూ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, ఎఐసిసి సభ్యుడిగా, 1982-83లో ఆంధ్రప్రదేశ్ స్టోర్స్ కౌన్సిల్ చైర్మన్‌గా, ఎపిఐడిసి చైర్మన్‌గా, శాసనమండలి సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేశాడు.
ఇంద్రసేన్ రెడ్డి ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్, ఎకనామిక్ కమిటీ, ఎగ్జిబిషన్ కమిటి సభ్యుడిగా పనిచేసి మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.
మరణం
[మార్చు]ఎస్. ఇంద్రసేన్ రెడ్డి 81 ఏళ్ళ వయసులో వయోభారంతో చికిత్స పొందుతూ 2024 అక్టోబరు 27న మరణించాడు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.[1][2][3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (28 October 2024). "Senior Congress leader S. Indersain Reddy passes away" (in ఇంగ్లీష్). Retrieved 31 October 2024.
- ↑ Eenadu (28 October 2024). "కాంగ్రెస్ నేత ఇంద్రసేన్‌రెడ్డి కన్నుమూత". Retrieved 31 October 2024.
- ↑ Sakshi (28 October 2024). "మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి కన్నుమూత". Retrieved 31 October 2024.
- ↑ The Hindu (27 October 2024). "Senior Congress leader Indersain Reddy passes away" (in Indian English). Retrieved 31 October 2024.
- ↑ V6 Velugu (28 October 2024). "కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూత". Retrieved 31 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)