Jump to content

ఎస్. సెంథిల్ కుమార్

వికీపీడియా నుండి
ఎస్. సెంథిల్ కుమార్

పదవీ కాలం
2019 – 2024
ముందు అన్బుమణి రామదాస్
తరువాత ఎ. మణి
నియోజకవర్గం ధర్మపురి లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1977-06-22) 1977 జూన్ 22 (వయసు: 48)
ధర్మపురి
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
జీవిత భాగస్వామి శోభన
వృత్తి డాక్టర్, రాజకీయవేత్త

ఎస్. సెంథిల్ కుమార్ (జననం 1977 జూన్ 22) తమిళనాడు రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడు ధర్మపురి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అభ్యర్థి.[3]

కెరీర్

[మార్చు]

2019 లోక్‌సభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీ చేసి పాట్టాళి మక్కల్ కట్చి అభ్యర్థి అన్బుమణి రామదాస్ పై 70,753 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.[4]

వివాదాలు

[మార్చు]

లోక్‌సభలో చర్చల సమయంలో హిందీ-హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాలను విమర్శనాత్మక పద్ధతిలో 'గోమూత్ర రాష్ట్రాలు' గా పేర్కొనడంతో వివాదం చోటుచేసుకుంది. ఆ తరువాత, ఆయన ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు.[5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2002 జనవరిలో అన్నామలై విశ్వవిద్యాలయం, చిదంబరం నుండి ఎంబీబీఎస్ పూర్తి చేసాడు. ఆ తరువాత, 2016 జూన్ లో శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, (ప్రస్తుతం, శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (SRIHER)) శ్రీ రామచంద్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.డి పూర్తి చేసాడు.[6] ఆయన తాత డి. ఎన్. వడివేలు గౌండర్ 1965లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "DMK's Senthil Kumar defeats Anbumani Ramadoss in Dharmapuri". Times of India. Retrieved 27 May 2019.
  3. "DHARMAPURI→DNV SENTHILKUMAR.S(Criminal & Asset Declaration)". Myneta. Retrieved 27 May 2019.
  4. "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2019". Election Commission. Retrieved 27 May 2019.
  5. Livemint (2023-12-05). "Senthilkumar of DMK clarifies 'Gaumutra' remark following controversy, says used it before". mint (in ఇంగ్లీష్). Retrieved 2023-12-06.
  6. "DHARMAPURI→DNV SENTHILKUMAR.S(Criminal & Asset Declaration)". Myneta. Retrieved 27 May 2019.
  7. "Breaking Dharmapuri's re-election jinx: PMK leader Anbumani's task cut out". New Indian Express. Retrieved 27 May 2019.