ఎ.ఆర్.ఎఫ్ చరిత్ర మ్యూజియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎ.ఆర్.ఎఫ్ చరిత్ర మ్యూజియం
Հ. Յ. Դաշնակցութեան պատմութեան թանգարան հիմնադրամ
ప్రదేశంయెరెవాన్, ఆర్మేనియా
రకంచరిత్ర మ్యూజియం
డైరక్టరుఅనుష్ అంసేయాన్
వెబ్‌సైటుఅధికారిక వెబ్సైటు

ఆర్మేనియన్ రివల్యూషనరీ ఫెడరేషన్ హిస్టరీ మ్యూజియం (అర్మేనియన్:Հ. Յ. Դաշնակցութեան պատմութեան թանգարան հիմնադրամ) ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లో ఒక మ్యూజియం. ఇక్కడ ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా, ఎ.ఆర్.ఎఫ్ కు చెందిన ముఖ్యమైన వ్యక్తుల చరిత్రను ప్రదర్శించారు.

ఈ మ్యూజియాన్ని 1946లో పారిన్, ఫ్రాన్సులో ప్రారంభించారు, అనంతరం దాదాపుగా 3000 కళాఖండాలను ఇక్కడ భద్రపరిచారు. దీనిని యెరెవాన్లో 2007 జూలై 13 న అధికారిక వేడుకలలో క్రిస్టఫోర్ మికేలియన్ సెంటరు వద్ద ప్రారంభించారు. ఇది దషాంక్ నాయకులైన హ్రాంత్ మర్కారియన్, ఇతరులు పర్యవేక్షనలో ప్రారంభమైనది. అంతర్జాతీయ సామ్యవాద అధ్యక్షుడు లూయిస్ అయల కూడా ప్రారంభసమయంలో సందర్శించి, ఈ చారిత్రక మ్యూజియాన్ని ప్రారంభించడం ఎ.ఆర్.ఎఫ్ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా పేర్కొన్నారు.[1]

ఈ మ్యూజియంలో ప్రభుత్వం పత్రాలు, స్టాంపులు, ఇతర కళాకృతులను ప్రదర్శిస్తారు. 1918 నుండి 1920 వరకు ఇక్కడ ప్రదర్శించిన వస్తువులను డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ అర్మేనియా కు అంకితం చేశారు. ఇక్కడ 1919లో వేర్సైల్లెస్ ఒప్పందం పై అర్మేనియా జారీ చేసిన అధికారిక పత్రాలు, రెపబ్లిక్ ప్రధాన మంత్రుల యొక్క వ్యక్తిగత ప్రభావాలు; హామో ఒహంజన్యన్, అలెగ్జాండర్ ఖతిస్యాన్, సైమన్ వ్రాట్సియన్, హోవ్హాన్నెస్ ఖత్చాజ్నౌని మొదలగున వారివి. జనరల్ ఆంధ్రానిక్ ఒజన్యాన్, ద్రస్తామాట్ కనయన్ ల యొక్క వ్యక్తిగత సమాచారాలను కూడా భద్రపరిచారు.

జెనోసైడ్ మ్యూజియం, ఇన్స్టిట్యూట్ డైరెక్టరు హైక్ డెమొయాన్ సేకరించినవి ఇక్కడ ఉంచిన మొదటి ప్రదర్శనలు, వాటిని ఎంతో గొప్ప వాటిగా ఆర్మేనియా చరిత్రలో "అత్యంత నాటకీయ" సేకరణగా పరిగణిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "ARF History Museum Opens in Yerevan". Retrieved 2007-08-11.