అప్పడవేదుల లక్ష్మీనారాయణ

వికీపీడియా నుండి
(ఎ.ఎల్.నారాయణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అప్పడవేదుల లక్ష్మీనారాయణ
Appadvedula Lakshmi Narayana
జననం1887
ముక్కామల (అంబాజీపేట), తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
మరణం7 మార్చి 1973
మద్రాసు, భారత దేశము
పౌరసత్వంIndia
జాతీయతIndian
జాతిహిందూమతం
రంగములుభౌతికశాస్త్రం
వృత్తిసంస్థలుమహారాజా కళాశాల, Kodaikanal Solar Observatory, ఆంధ్ర విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుమద్రాసు విశ్వవిద్యాలయం

ఎ. ఎల్. నారాయణ గా ప్రసిద్ధిచెందిన అప్పడవేదుల లక్ష్మీనారాయణ (Appadvedula Lakshmi Narayan) B.A., M.A., D.Sc., F.I.P. (b: 1887 - d: 7 మార్చి 1973) భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. ఇతడు కొడైకెనాల్ లోని సూర్య దర్శిని విభాగపు మొదటి అధ్యక్షుడు.

తొలినాళ్ళు

[మార్చు]

వీరు 1887 లో అప్పడవేదుల వ్యాసులు, మహాలక్ష్మి దంపతులకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముక్కామల (అంబాజీపేట) గ్రామంలో జన్మించారు. వీరు కొత్తపేటలోని ఉన్నతపాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్చిచేసారు. తర్వాత శాస్త్రవిజ్ఞానం మీద మక్కువతో రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్ కళాశాలలో చేరి బి.ఎ. పూర్చిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో ఎం.ఎ. 1914 చదివారు. అనంతరం విజయనగరం లోని మహారాజా కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేశారు.

గౌరవ పురస్కారాలు

[మార్చు]
  • వీరు లండన్ లోని భౌతికశాస్త్ర సంస్థ ఫెలో (Fellow of the Institute of Physics) గా ఎన్నుకోబడ్డారు.
  • వీరు భారత జాతీయ సైన్సు అకాడమీ ఫెలో (Fellow of the National Institute of Sciences, India (presently, Indian National Science Academy) గా ఎన్నుకోబడ్డారు.
  • బెనారస్ లో జరిగిన భారత సైన్సు కాంగ్రెసు యొక్క భౌతికశాస్త్ర విభాగానికి అధ్యక్షత వహించారు.
  • ఆంధ్ర ప్రదేశ్ ప్లానింగ్ కమిషన్ సభ్యునిగా పనిచేశారు.
  • వీరు నిర్వహించిన శాస్త్ర పరిశోధనలకు గాను తిరువాన్కూరు మహారాజుగారి కర్జన్ స్మారక బహుమతిని పొందారు.

శాస్త్ర ప్రచురణలు

[మార్చు]
  • On sounds of splashes. A. L. Narayan, Philosophical Magazine Series 6, 1941-5990, Volume 42, Issue 251, 1921, Pages 773 – 775.[1]
  • Coupled vibration by means of a double Pendulum. A. L. Narayan, Series 6, Philosophical Magazine, Volume 43, Issue 255, March 192, Pages 567 - 574.
  • Mechanical illustration of three magnetically coupled oscillating circuits. A. L. Narayan, Series 6, Philosophical Magazine, Volume 43, Issue 255, March 1922, Pages 575-580.[2]
  • A modified form of double slit spectrophotometer, A. L. Narayana Philosophical Magazine Series 6, Volume 43, Issue 256 April 1922, pages 662 - 663.[3]
  • Surface tension of soap solutions for different concentrations. A. L. Narayan; G. Subrahmanyam, Philosophical Magazine Series 6, Volume 43, Issue 256 April 1922, pages 663 - 671.[4]
  • Emission and absorption of halogens in the visible and ultra-violet regions. A. L. Narayan; D. Gunnayya, Philosophical Magazine Series 6, Volume 45, Issue 269 May 1923, pages 827 - 830.[5]
  • Absorption of Potassium Vapor at High Temperatures, and Its Bearing on the Selection Principle of Quantum Theory. A. L. Narayan; D. Gunnayya, Astrophysical Journal, vol. 57, p. 191, April 1923.[6]

మూలాలు

[మార్చు]