ఎ.వెంకోబారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. అంత్‌పూర్ వెంకోబారావు
అంత్‌పూర్ వెంకోబారావు చిత్రం
జననం
అంత్‌పూర్ వెంకోబారావు

ఆగష్టు 20, 1927
కర్నాటక రాష్ట్రం లోని మంత్రాలయం దగ్గరలో గల కౌతాలం
మరణంసెప్టెంబరు 25, 2005
మధురై
ఇతర పేర్లుఅంత్‌పూర్ వెంకోబారావు
విద్యఎం.బి.బి.ఎస్;ఎం.డి;పి.హెచ్.డి;డె.ఎస్.సి;డ్.పి.ఎం
వృత్తిప్రొఫెసర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
వైద్యులు, సైక్రియాట్రిస్టు
తల్లిదండ్రులు
  • కీ.శే. రాఘవేంద్రరావు (తండ్రి)

ఎ.వెంకోబారావు వైద్య శాస్త్రవేత్త. ఈయన ప్రముఖ సైక్రియాట్రిస్ట్. అనేక పరిశోధానా గ్రంథాలను రచించారు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గరలో గల కౌతాలం గ్రామంలో 1927 ఆగష్టు 20 వ తేదీన జన్మించారు.[1] తండ్రిపేరు రాఘవేంద్రరావు. ఈయన వరుసగా ఎం.బి.బి.ఎస్;ఎం.డి;పి.హెచ్.డి;డె.ఎస్.సి;డ్.పి.ఎం డిగ్రీలను సంపాదించాడు.[2]

ఉద్యోగ జీవితం[మార్చు]

మధురై మెడికల్ కాలేజీలోని ఇనిస్టిట్యూట్ ఆహ్ సైక్రియాట్రీకి అధిపతిగా, ప్రొఫెసర్ గా పనిచేసిన తర్వాత మధురైలోనె ప్రభుత్వ రాజాజీ హాస్పటల్ కు ఎమిరిటస్ ప్రొఫెసర్ గా వుంటూ పరిశోధనన్లు చేసారు.[3]

నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్; ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్; రాయల్ ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ కాలేజీ ఆఫ్ సైకియాట్రిస్ట్స్; రాయల్ కాలేజీ ఆఫ్ సైకియాట్రిస్ట్స్; (ఇంగ్లాండ్) ;అమెరికా సైకియాట్రిక్ అసోసియేషన్ మొ: ప్రఖ్యాత సంస్థల ఫెలోషిప్లను అందుకున్నారు.

పరిశోధనలు[మార్చు]

ప్రొఫెసర్ వెంకోబారావు మానసిక శాస్త్రం మీద గాఢ పరిశోధనలు చేసారు. ఆవేశం, మనోద్వేగంతో కూడిన అపవ్యవస్థకు రోగ నిరోధక చర్యలను అధ్యయనం చేసారు. మానసిక అవయవ నిర్మాణాత్మక మైన లేదా మనస్తాపం వలన కలుగు రుగ్మత, దీని వలన కలుగు లక్షణములు - మూర్తిమత్వ పరిణామములు, వాస్తవికతను గ్రహించలేకపోవడం; భ్రాంతి, భ్రమ, మతి విభ్రమం, బూటకపు దృశ్యాలను నిజమనుకోవడం మొదలగు వాటి నివారణా చర్యలానికి చికిత్సలను ఆవిష్కరించారు. ఆందోళానాత్మకమైన/భావోద్వేగ అపవ్యవస్థలకు చికిత్సా మార్గాలను కనుగొన్నారు. "ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ" మాసపత్రికకు సంపాదకులుగా (1970-77) ఉన్నారు. పలు గ్రంథరచనలు చేసారు. బాగా ప్రసిద్ధి పొందిన వాటిలో కొన్ని: Depressive Diseases, Lithium, psychiatry of Old age in India.

డాక్టర్ వెంబోబారావు అసమాన వైద్య కౌశలానికి అనేక గౌరవ పదవులు లభించాయి. కొన్ని వివరాలు; ఇండియన్ మెడికల్ అసోసియేషన్, న్యూరోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా; ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ మెడిసన్; ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్, వరల్డ్ సైకియాట్రిక్ అసోసియేషన్, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్; సొసైటీ ఫర్ క్లినికల్ సైకితాట్రిస్ట్స్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూసైడోలజీ మొదలగు అంతర్జాతీయ ప్రసిద్ధ సంస్థలు గౌరవ సభ్యత్వాన్ని అందించాయి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ స్యూసైడ్స్ ప్వివెన్షన్ కు ఉఅపధ్యక్షులుగా ఉన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్; అసోసియేషన్ ఆఫ్ గెరొంటోలజీ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్యూసైడాలజీ సంస్థలకు అద్యక్షులుగా వ్యవహరించారు.

అవార్డులు,వివార్డులు[మార్చు]

మానసికశాస్త్ర ఉన్నతికి చేసిన నిరుపమాన సేవలకు పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 1972 లో శాండోజ్ అవార్డు, 1973 లో జె.సి.మార్ఫాతియా అవార్డు; 1975, 1978 లలో కూడా ఈ అవార్డు అందింది. 1975 లో డాక్టర్ పి.ఎస్.రాజు అవార్డు, 1980లో డి.ఎస్.ఎస్.మూర్తి రావు అవార్డు, 1981 లో డాక్టర్ బి.సి.రాయ్ అవార్డు, 1984లో శ్రీరాం అవార్డు, 1984లో మానస హాస్పిటల్ రాజమండ్రి ఒరేషన్ అవార్డ్, 1993లో ఆర్.వి.రాజన్ అవార్డు, 1995లో టి.ఎస్.మూర్తి అవార్డు, పొందారు.[4]

డాక్టర్ వెంకోబారావు మధురై పట్టణంలోనే స్థిరపడి, కె.కె.నగర్లోని "తిలక్" నివాసం ఉన్నారు. "సైకియాట్రీ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఇన్ ఇండియా" మొదలైన 12 వైద్య గ్రంథాలు, 400 లకు పైగా పరిశోధనా వ్యాసాలు వ్రాసారు.

2005 సెప్టెంబరు 25 వ తేదీన మధురైలో మరణించారు.

మూలాలు[మార్చు]

  1. Venkoba Rao passes away, ద హిందూ Monday, Sep 26, 2005
  2. "Deceased Fellow, indian national science academy". Archived from the original on 2016-03-04. Retrieved 2015-12-27.
  3. PSYCHOTHERAPY IN THE INDIAN CONTEXT[permanent dead link]
  4. ఆంధ్ర శాస్త్రవేత్తలు (1 August 2011). ఎ.వెంకోబారావు. శ్రీ వాసవ్య. p. 144.

ఇతర లింకులు[మార్చు]