ఎ. కనకదుర్గా రామచంద్రన్
Appearance
కనకదుర్గా రామచంద్రన్[1] విదుషీమణి, రచయిత్రి.
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె 1919 జనవరి 25న యామినీ పూర్ణతిలకమ్మ, నిరాఘాటం రామకోటయ్య దంపతులకు జన్మించింది. ఆమె తల్లి యామినీపూర్ణతిలకమ్మ సంఘసేవకురాలు, జాతీయవాది, కవయిత్రి, భాగవతోత్తమురాలు. తండ్రి నిరాఘాటం రామకోటయ్య సంగీత విద్వాంసుడు. ఆమె విజయవాడలోని రుషి వేలీ పాఠశాలలో, మదనపల్లిలో, మద్రాసులో విద్యాభ్యాసం చేసింది. ఆమె ఎం.ఏ., ఎం.ఇడి. చదివింది. ఈమె భర్త ఏ.రామచంద్రన్ మద్రాసులో న్యాయవాది.1961 సంవత్సరంలో ఈమెను గృహలక్ష్మి స్వర్ణకంకణముతో సత్కరించారు. ఆమె విశ్వనాథవారి రచనలు అభిమానించేది.
రచనలు
[మార్చు]- వేటగాడి కొడుకు - ఇతర విదేశీ కథలు (అనువాదం)[3][4]
- అందమైన లోకం
- ఇంద్రజాల దీపం
- పిల్లల నాట్యకళ
- ఐక్యరాజ్యసమితి
- పిల్లలు కట్టిన చెలిమి వంతెన
ఆంగ్ల గ్రంథాలు
[మార్చు]- విదర్ ఆర్ యు రౌండ్?