ఏకశిలా పార్కు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏకశిలా పార్కు
ఏకశిలా పార్కు is located in Telangana
ఏకశిలా పార్కు
తెలంగాణలో స్థానం
స్థానమువరంగల్, తెలంగాణ
అక్షాంశరేఖాంశాలు18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°E / 18.0167; 79.6333Coordinates: 18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°E / 18.0167; 79.6333
నవీకరణ2001 (2001)
నిర్వహిస్తుందితెలంగాణ ప్రభుత్వం

ఏకశిలాపార్కు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణ జిల్లా, వరంగల్ లో గల ఒక పిల్లల పార్కు.

విశేషాలు[మార్చు]

2001లో ఖిలా వరంగల్‌ మధ్యకోటలో కోట సందర్శనానికై వచ్చిన పర్యాటకులు ప్రకృతిలో కాసేపు సేదతీరటం కోసం సుమారు 50 లక్షల రూపాయల పెట్టుబడితో ఈ పార్కును నిర్మించారు. ఈ పార్కులో చిన్న పిల్లల కోసం ఆట వస్తువులు, ఊయ్యాలలు, జారుడు బండలు, సైకిలింగ్‌, రంగుల రాట్నం, రెండు హైట్‌ స్టాండ్స్‌, రెండు ఆర్మీ స్టాంగ్‌, ఫ్యామిలీ ఊయ్యాలలు ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళలో వాటర్‌ పాల్‌, రంగు రంగు లైట్లతో పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. పార్కులో ఓ కాంటీన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్కులో గుండు చెరువు అని పిలువబడే ఓ చెరువు కూడా ఉంది. ఈ చెరువులో బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ చెరువు పక్కనే ఏకశిలగుట్టగా పిలువబడే ఎత్తైన కొండ కూడా ఉంటుంది. ఈ గుట్ట మీద ఓ పురాతన ఆలయం, సైనికులు ప్రహారా చేసే భవనం ఉంటుంది. పార్కుకు వచ్చిన ప్రతి ఒక్కరూ గుండు చెరువు అందాలను, ఏకశిలగుట్టను తప్పక వీక్షించే వెళతారు. పార్కు పరిరక్షణ కోసం 25 మంది సిబ్బంది సేవలందిస్తుంటారు. ఈ పార్కు ఎంతో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉండటం వల్ల సినిమాల షూటింగ్‌ లు సైతం ఇక్కడ జరుగుతుంటాయి.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]