ఏకాగ్రతా లోపం అతి క్రియాశీలత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 

ఏకాగ్రతా లోపం అతి క్రియాశీలత
ఇతర పేర్లుఅటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్, ఏ.డి.హెచ్.డి .
ప్రత్యేకతసైకియాట్రీ, పీడియాట్రిక్స్
లక్షణాలుశ్రద్ధ వహించడం లో ఇబ్బంది, అధిక క్రియాశీలత , ఆవేశపూరితం |ప్రవర్తనను నియంత్రించడంలో ఇబ్బంది
సాధారణ ప్రారంభం6–12 సంవత్సరాలలోపు
కాల వ్యవధి6 నెలలకంటే ఎక్కువ
కారణాలుజన్యుపరమైన కారకాలు, నికోటిన్ కు గురవడము
రోగనిర్ధారణ పద్ధతిలక్షణాలు
చికిత్సమానసిక వైద్యులతో సంభాషణ (కౌన్సెలింగ్), జీవనశైలి మార్పులు, మందులు
ఔషధంఉద్దీపన మందులు
తరుచుదనము51.1 మిలియన్

ఏకాగ్రతా లోపం అతి క్రియాశీలత అనేది ఒక నాడీ మండల అభివృద్ధిలో (న్యూరో డెవలప్‌మెంటల్ ) లోపం వలన ఏర్పడిన మానసిక రుగ్మత. దీనిని అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ అని ఆంగ్లంలో పేర్కొంటారు . సూక్ష్మంగా ఏ.డి.హెచ్ .డి. ( ADHD ) అంటారు. [1] [2] దీనివలన ఏదేని విషయముపై శ్రద్ధ లోపించి ఇబ్బంది పడడం జరుగుతుంది. అధిక క్రియాశీలత (హైపెరాక్టివిటీ) వలన పర్యవసానాలతో సంబంధం లేకుండా ప్రవర్తించడం జరుగుతుంది, ఇది ఆ వ్యక్తి వయస్సుకి తగిన ప్రవర్తన కాదు.[3] [4] అయినా కూడా ఈ వ్యక్తులు భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బంది పడటం లేదా కార్యనిర్వాహకత్వంతో సమస్యలను కూడా కలుగచేస్తారు. [5][6][7][4]

లక్షణాలు, రోగనిర్ధారణ,

[మార్చు]

ఒక వ్యక్తికి పన్నెండేళ్లు నిండకముందే లక్షణాలు కనిపిస్తే, అవి ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉండి, కనీసం రెండు చోట్ల అంటే పాఠశాల, ఇల్లు లేదా వినోద కార్యకలాపాలు వంటి వాటిల్లో సమస్యలను కలిగిస్తాయి. [8] [9] పిల్లలలో, శ్రద్ధ లోపించే సమస్య వలన పాఠశాలలో పనితీరు బలహీనపడవచ్చు. [3] అదనంగా ఇతర మానసిక రుగ్మతలు ఏర్పడడం వలన పదార్థ దుర్వినియోగం జరగవచ్చు.[10] ఇది బలహీనతకు దారితీసేదయినప్పటికీ, ముఖ్యంగా ఆధునిక సమాజంలో, ADHD ఉన్న చాలా మంది వ్యక్తులు తమకు ఆసక్తికరంగా లేదా ఉపయోగకరంగా భావించే (హైపర్ ఫోకస్ ) పనులపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు .[11][12]

ఇది సాధారణంగా పిల్లలలో యుక్తవయస్కులలో గమనించి, నిర్ధారణ చేయబడిన మానసిక రుగ్మత అయినప్పటికీ, చాలా సందర్భాలలో ఖచ్చితమైన కారణం తెలియదు. జన్యుపరమైన కారకాలు దాదాపు 75% ప్రమాదం కలుగ చేస్తున్నాయని ఓక అంచనా. గర్భధారణ సమయంలో నికోటిన్ కు గురవడము కూడా పర్యావరణ పరంగా ప్రమాదం ఏర్పడవచ్చు. ఇది తల్లిదండ్రుల వ్యవహారశైలికి లేదా క్రమశిక్షణకు సంబంధించినది కాదు.[13]

ప్రాబల్యం

[మార్చు]

DSM-IV (Diagnostic and Statistical Manual of Mental Disorders (DSM) ప్రమాణాల [4] [14] ప్రకారం ఇది 5-7% మంది పిల్లలను ప్రభావితం చేస్తోంది. ICD-10 ప్రమాణాలు ఇది 1-2% మందిని ప్రభావితం చేస్తోంది అని తెలియ చేస్తున్నాయి.[15] 2015 నాటికి, ఇది ప్రపంచవ్యాప్తంగా 51.1 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుందని అంచనా వేశారు.[16] వివిధ దేశాలలో ఈ వ్యాధి ప్రాబల్యం ఇంచు మించు సమానంగా ఉంటుంది. అయితే దీనిని ఎలా నిర్ధారణ చేస్తారనే దానిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.[17]ADHD అనేది బాలికలలో కంటే బాలురలో దాదాపు రెండు రెట్లు ఎక్కువగా కనపడుతుంది.[4] ఈ రుగ్మత తరచుగా బాలికలలో నిర్లక్ష్యం అవుతుంటుంది. ఎందుకంటే వారి లక్షణాలు అబ్బాయిల నుండి భిన్నంగా ఉంటాయి. బాల్యంలో నిర్ధారణ అయిన వారిలో దాదాపు 30-50% మంది యుక్తవయస్సులో కూడా లక్షణాలను కలిగి ఉంటారు. 2-5% మంది పెద్దవాళ్లకు ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. పెద్దలలో అతి క్రియాశీలత బదులుగా కంటే అంతర్గతంగా చంచలత్వం ఏర్పడవచ్చు.[18] వారు తరచుగా వారి బలహీనతలలో కొన్ని లేదా అన్నింటిని సరిదిద్దే 'కోపింగ్' నైపుణ్యాలను (ఒత్తిడితో కూడిన లేదా సంభావ్య హానికరమైన పరిస్థితులను ఎదుర్కోవటానికి ప్రజలు ఉపయోగించే వ్యూహాలు) అభివృద్ధి చేసుకుంటారు. ఈ పరిస్థితిని ఇతర పరిస్థితుల నుండి వేరుగా చెప్పడం కష్టం, అలాగే సాధారణ ప్రవర్తనాస్థాయి నుంచి ఇప్పటికీ ఉన్న అధిక స్థాయి కార్యకలాపాల నుండి వేరుచేయడం.[9]

నిర్వహణ, చికిత్స

[మార్చు]

ADHD నిర్వహణ గురించిన సిఫార్సులు వివిధ దేశాలలో వేరు వేరుగా ఉంటాయి, సాధారణంగా మానసిక వైద్యులతో సంభాషణ (కౌన్సెలింగ్), జీవనశైలి మార్పులు, మందులు ఉంటాయి.[3] పిల్లలలో తీవ్రమైన లక్షణాలున్నప్పుడే మొదటగా మందులను సిఫార్సు చేయాలని బ్రిటీష్ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. పెద్దవాళ్ళు కౌన్సెలింగ్‌ను తిరస్కరించడము లేదా వ్యాధి లక్షణాలను తగ్గించడంలో విఫలమైనప్పుడు మందులను సూచిస్తారు .[19] కెనడా, అమెరికా మార్గదర్శకాలు స్కూలు వయస్సు లోపల ఉన్న పిల్లలలో ప్రవర్తనలో మార్పు, నిర్వహణను మొదటగా సిఫార్సు చేస్తాయి, అయితే మందులు, ప్రవర్తనా చికిత్సను కలిపి ఆ తర్వాత సిఫార్సు చేస్తాయి. [20] [21] [22] ఉద్దీపనలతో చికిత్స కనీసం 14 నెలలకి ప్రభావవంతంగా ఉంటుంది; అయితే వాటి దీర్ఘకాలిక ప్రభావం అస్పష్టం, తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు.[23] [24]

18వ శతాబ్దం నుండి వైద్య సాహిత్యంలో ADHD వంటి లక్షణాలను కనుగొన్నారు ADHD, దాని నిర్ధారణ, చికిత్సలను 1970ల నుండి వివాదాస్పదమయ్యాయి.[25] ఈ వివాదాల్లో వైద్యులు, ఉపాధ్యాయులు, విధాన నిర్ణేతలు, తల్లిదండ్రులు, ప్రసార మాధ్యమాల వారు పాల్గొన్నారు. వివాద అంశాలలో ADHD కి పేర్కొన్న కారణాలు, దాని చికిత్సలో ఉద్దీపన మందుల వాడకం వంటివి ఉన్నాయి. చాలా మంది ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు ADHDని పిల్లలు ఇంకా పెద్దలలో నిజమైన రుగ్మతగా అంగీకరిస్తారు అయితే విజ్ఞాన శాస్త్ర సమాజంలో అది ఎలా నిర్ధారణ చేస్తారు, చికిత్స చేయబడుతుందనే దానిపై చర్చ ప్రధానంగా కేంద్రీకృతమై ఉంది. [26] [27] [28] ఈ పరిస్థితిని అధికారికంగా 1980 నుండి 1987 వరకు 'అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ ( ADD )' అని పిలిచేవారు, అయితే దీనికి ముందు దీనిని 'చిన్ననాటి హైపర్‌కైనెటిక్ రియాక్షన్' అని పిలిచేవారు. [29] [30]

సూచనలు

[మార్చు]
  1. Sroubek A, Kelly M, Li X (February 2013). "Inattentiveness in attention-deficit/hyperactivity disorder". Neuroscience Bulletin. 29 (1): 103–10. doi:10.1007/s12264-012-1295-6. PMC 4440572. PMID 23299717.
  2. Caroline SC, ed. (2010). Encyclopedia of Cross-Cultural School Psychology. Springer Science & Business Media. p. 133. ISBN 9780387717982. Archived from the original on 29 August 2021. Retrieved 8 August 2020.
  3. 3.0 3.1 3.2 "Attention Deficit Hyperactivity Disorder". National Institute of Mental Health. March 2016. Archived from the original on 23 July 2016. Retrieved 5 March 2016.
  4. 4.0 4.1 4.2 4.3 American Psychiatric Association (2013). Diagnostic and Statistical Manual of Mental Disorders (5th ed.). Arlington: American Psychiatric Publishing. pp. 59–65. ISBN 978-0-89042-555-8.
  5. Faraone SV, Rostain AL, Blader J, Busch B, Childress AC, Connor DF, Newcorn JH (February 2019). "Practitioner Review: Emotional dysregulation in attention-deficit/hyperactivity disorder - implications for clinical recognition and intervention". Journal of Child Psychology and Psychiatry, and Allied Disciplines. 60 (2): 133–150. doi:10.1111/jcpp.12899. PMID 29624671. Archived from the original on 27 August 2021. Retrieved 8 August 2020.
  6. Tenenbaum RB, Musser ED, Morris S, Ward AR, Raiker JS, Coles EK, Pelham WE (April 2019). "Response Inhibition, Response Execution, and Emotion Regulation among Children with Attention-Deficit/Hyperactivity Disorder". Journal of Abnormal Child Psychology. 47 (4): 589–603. doi:10.1007/s10802-018-0466-y. PMC 6377355. PMID 30112596.
  7. Lenzi F, Cortese S, Harris J, Masi G (January 2018). "Pharmacotherapy of emotional dysregulation in adults with ADHD: A systematic review and meta-analysis". Neuroscience and Biobehavioral Reviews. 84: 359–367. doi:10.1016/j.neubiorev.2017.08.010. PMID 28837827. Archived from the original on 26 July 2020. Retrieved 31 July 2020.
  8. "Symptoms and Diagnosis". Attention-Deficit / Hyperactivity Disorder (ADHD). Division of Human Development, National Center on Birth Defects and Developmental Disabilities, Centers for Disease Control and Prevention. 29 September 2014. Archived from the original on 7 November 2014. Retrieved 3 November 2014.
  9. 9.0 9.1 Dulcan, Mina K.; Lake, MaryBeth (2011). "Axis I Disorders Usually First Diagnosed in Infancy, Childhood or Adolescence: Attention-Deficit and Disruptive Behavior Disorders". Concise Guide to Child and Adolescent Psychiatry (4th illustrated ed.). American Psychiatric Publishing. pp. 34. ISBN 978-1-58562-416-4 – via Google Books.
  10. Erskine HE, Norman RE, Ferrari AJ, Chan GC, Copeland WE, Whiteford HA, Scott JG (October 2016). "Long-Term Outcomes of Attention-Deficit/Hyperactivity Disorder and Conduct Disorder: A Systematic Review and Meta-Analysis". Journal of the American Academy of Child and Adolescent Psychiatry. 55 (10): 841–50. doi:10.1016/j.jaac.2016.06.016. PMID 27663939.
  11. Kooij JJ, Bijlenga D, Salerno L, Jaeschke R, Bitter I, Balázs J, et al. (February 2019). "Updated European Consensus Statement on diagnosis and treatment of adult ADHD". European Psychiatry. 56: 14–34. doi:10.1016/j.eurpsy.2018.11.001. PMID 30453134.
  12. Walitza S, Drechsler R, Ball J (August 2012). "[The school child with ADHD]" [The school child with ADHD] (PDF). Therapeutische Umschau (in జర్మన్). 69 (8): 467–73. doi:10.1024/0040-5930/a000316. PMID 22851461. Archived (PDF) from the original on 26 July 2020. Retrieved 31 July 2020.
  13. "Does Bad Parenting Cause ADHD?". WebMD. Archived from the original on 26 July 2020. Retrieved 31 July 2020.
  14. Willcutt EG (July 2012). "The prevalence of DSM-IV attention-deficit/hyperactivity disorder: a meta-analytic review". Neurotherapeutics. 9 (3): 490–9. doi:10.1007/s13311-012-0135-8. PMC 3441936. PMID 22976615.
  15. Cowen, Philip; Harrison, Paul; Burns, Tom (2012). "Drugs and other physical treatments". Shorter Oxford Textbook of Psychiatry (6th ed.). Oxford University Press. pp. 546. ISBN 978-0-19-960561-3 – via Google Books.
  16. GBD 2015 Disease and Injury Incidence and Prevalence Collaborators (October 2016). "Global, regional, and national incidence, prevalence, and years lived with disability for 310 diseases and injuries, 1990–2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015". Lancet. 388 (10053): 1545–1602. doi:10.1016/S0140-6736(16)31678-6. PMC 5055577. PMID 27733282. {{cite journal}}: |author= has generic name (help)CS1 maint: numeric names: authors list (link)
  17. Faraone SV (2011). "Ch. 25: Epidemiology of Attention Deficit Hyperactivity Disorder". In Tsuang MT, Tohen M, Jones P (eds.). Textbook of Psychiatric Epidemiology (3rd ed.). John Wiley & Sons. p. 450. ISBN 9780470977408. Archived from the original on 22 December 2020. Retrieved 31 July 2020.
  18. National Collaborating Centre for Mental Health (UK) (2009). Attention deficit hyperactivity disorder : diagnosis and management of ADHD in children, young people, and adults. National Collaborating Centre for Mental Health (Great Britain), National Institute for Health and Clinical Excellence (Great Britain), British Psychological Society., Royal College of Psychiatrists. Leicester: British Psychological Society. p. 17. ISBN 9781854334718. OCLC 244314955. PMID 22420012.
  19. National Collaborating Centre for Mental Health (2009). "Pharmacological Treatment". Attention Deficit Hyperactivity Disorder: Diagnosis and Management of ADHD in Children, Young People and Adults. NICE Clinical Guidelines. Vol. 72. Leicester: British Psychological Society. pp. 303–307. ISBN 978-1-85433-471-8. Archived from the original on 13 January 2016 – via NCBI Bookshelf.
  20. "Canadian ADHD Practice Guidelines" (PDF). Canadian ADHD Alliance. Archived (PDF) from the original on 21 January 2021. Retrieved 4 February 2011.
  21. "Attention-Deficit / Hyperactivity Disorder (ADHD): Recommendations". Centers for Disease Control and Prevention. 24 June 2015. Archived from the original on 7 July 2015. Retrieved 13 July 2015.
  22. Wolraich, ML; Hagan JF, Jr; Allan, C; Chan, E; Davison, D; Earls, M; Evans, SW; Flinn, SK; Froehlich, T; Frost, J; Holbrook, JR; Lehmann, CU; Lessin, HR; Okechukwu, K; Pierce, KL; Winner, JD; Zurhellen, W; SUBCOMMITTEE ON CHILDREN AND ADOLESCENTS WITH ATTENTION-DEFICIT/HYPERACTIVE, DISORDER. (October 2019). "Clinical Practice Guideline for the Diagnosis, Evaluation, and Treatment of Attention-Deficit/Hyperactivity Disorder in Children and Adolescents". Pediatrics. 144 (4): e20192528. doi:10.1542/peds.2019-2528. PMC 7067282. PMID 31570648.
  23. "NIMH » The Multimodal Treatment of Attention Deficit Hyperactivity Disorder Study (MTA):Questions and Answers". NIMH » Home. Archived from the original on 30 January 2021. Retrieved 2019-01-01. Why were the MTA medication treatments more effective than community treatments that also usually included medication? Answer: There were substantial differences in quality and intensity between the study-provided medication treatments and those provided in the community care group.
  24. National Collaborating Centre for Mental Health (2009). Attention Deficit Hyperactivity Disorder: Diagnosis and Management of ADHD in Children, Young People and Adults. NICE Clinical Guidelines. Vol. 72. Leicester: British Psychological Society. ISBN 978-1-85433-471-8. Archived from the original on 13 January 2016 – via NCBI Bookshelf.
  25. Parrillo VN (2008). Encyclopedia of Social Problems. SAGE. p. 63. ISBN 9781412941655. Archived from the original on 4 January 2020. Retrieved 2 May 2009.
  26. Sim MG, Hulse G, Khong E (ఆగస్టు 2004). "When the child with ADHD grows up" (PDF). Australian Family Physician. 33 (8): 615–8. PMID 15373378. Archived (PDF) from the original on 24 సెప్టెంబరు 2015.
  27. Silver LB (2004). Attention-deficit/hyperactivity disorder (3rd ed.). American Psychiatric Publishing. pp. 4–7. ISBN 978-1-58562-131-6.
  28. Schonwald A, Lechner E (April 2006). "Attention deficit/hyperactivity disorder: complexities and controversies". Current Opinion in Pediatrics. 18 (2): 189–95. doi:10.1097/01.mop.0000193302.70882.70. PMID 16601502.
  29. Weiss, Lawrence G. (2005). WISC-IV clinical use and interpretation scientist-practitioner perspectives (1st ed.). Amsterdam: Elsevier Academic Press. p. 237. ISBN 978-0-12-564931-5. Archived from the original on 16 January 2021. Retrieved 31 July 2020.
  30. "ADHD: The Diagnostic Criteria". PBS. Frontline. Archived from the original on 20 April 2016. Retrieved 5 March 2016.