ఏకావలీ ఖన్నా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏకావలీ ఖన్నా
ఏకావలీ ఖన్నా (2014)
జననం
ఏకావలీ

విద్యాసంస్థమోడరన్ హైస్కూల్‌, కలకత్తా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2009 – ప్రస్తుతం
తల్లిదండ్రులుఅరుణ్ చోప్రా

ఏకావలీ ఖన్నా, బెంగాలీ సినిమా నటి. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది.[1]

జననం, విద్య

[మార్చు]

ఏకావలీ ఖన్నా పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది. కలకత్తాలోని మోడరన్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను, ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ ను పూర్తిచేసింది.[2]

సినిమారంగం

[మార్చు]

2014లో జాతీయ అవార్డు గ్రహీత నీలా మాధబ్ పాండా దర్శకత్వం వహించిన కౌన్ కిత్నే పానీ మెయిన్‌ సినిమాతో ఏకావలీ ఖన్నా సినిమారంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత జెడ్ ప్లస్, డియర్ డాడ్, బయోస్కోప్‌వాలా, అంగ్రేజీ మే కెహ్తే హై, వాట్ విల్ సే మొదలైన సినిమాలలో నటించింది.[3]

2018లో రోహిత్ కర్ణ్ బత్రా దర్శకత్వం వహించిన లైన్ ఆఫ్ డీసెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటించింది. శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించిన వీరే ది వెడ్డింగ్‌ సినిమాలో కూడా ఏకావలీ కీలక పాత్ర పోషించింది. కుముద్ చౌదరి దర్శకత్వం వహించిన చోటే నవాబ్, మయూర్ హర్దాస్ దర్శకత్వం వహించిన డార్క్ లైట్, అమిత్ జోషి దర్శకత్వం వహించిన యార్జిగ్రీ, గణేష్ శెట్టి దర్శకత్వం వహించిన ఆనం, సుమన్ ఘోష్ దర్శకత్వం వహించిన ఆధార్ మొదలైన సినిమాలలో నటించింది. రాజ్ చక్రవర్తి దర్శకత్వం వహించిన కాట్మండు, సుమన్ ఘోష్ దర్శకత్వం వహించిన ద్వాండో, చంద్రశిష్ రే దర్శకత్వం వహించిన నిరొంటోర్ వంటి బెంగాలీ సినిమాలలో కూడా నటించింది.[4]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష మూలాలు
2010 మెమోరీస్ ఇన్ మార్చి ఏకావలీ ఖన్నా ఇంగ్లీషు సినిమా
2013 గణేష్ టాకీస్ డాలీ బెంగాలీ సినిమా
2014 జెడ్ ప్లస్ సయీదా హిందీ సినిమా
2014 ఖోలా హవా మోనాలిసా బెంగాలీ సినిమా
2015 కాట్ముండు భానుప్రియ బెంగాలీ సినిమా [5]
2015 కౌన్ కిత్నే పానీ మే గులాబీ హిందీ సినిమా
2016 బాలీవుడ్ డైరీస్ రవీనా హిందీ సినిమా
2016 డియర్ డాడ్ నూపూర్ హిందీ సినిమా
2017 వాట్ విల్ పీపుల్ సే నజ్మా నార్వేజియన్ [6]
2017 లైన్ ఆఫ్ దాస్సెంట్ నైమా ఇంగ్లీష్/హిందీ సినిమా [7]
2018 బయోస్కోప్‌వాలా శోభిత హిందీ సినిమా
2018 వీరే ది వెడ్డింగ్ పరోమిత హిందీ సినిమా
2018 అంగ్రేజీ మే కెహతే హై కిరణ్ బత్రా హిందీ సినిమా

మూలాలు

[మార్చు]
  1. "Ekavali Khanna: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. 2022-04-11. Archived from the original on 2021-04-11. Retrieved 2022-04-11. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-05-04 suggested (help)
  2. "Ekavali Khanna (Actress)". The Wiki. 2021-09-11. Retrieved 2022-04-11.
  3. Kumar, P. k Ajith (2021-05-01). "Ekavali Khanna on 'Bombay Begums' getting her global recognition". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2022-04-11. Retrieved 2022-04-11.
  4. "Ekavali Khanna: It's important to pick right roles on right time". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-04-25. Archived from the original on 2021-06-04. Retrieved 2022-04-11.
  5. "Kath Mundu". All News View. Retrieved 2022-04-11.
  6. "The Times Group". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2018-07-28. Retrieved 2022-04-11.
  7. "The Times Group". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-11.[permanent dead link]