Jump to content

ఐదు ఉపనిషత్తులు

వికీపీడియా నుండి

రచయిత స్వయంగా మార్క్సిస్ట్ అయివుండీ కమ్యూనిజం మానవ జాతి విముక్తి హేతువు అని నమ్ముతూ ఉండి ఈ రచన చేశారు. ఐతే రచయిత సుదీర్ఘమైన పీఠిక ద్వారా ప్రాచీన ఉపనిషత్ సాహిత్యం ప్రపంచంలోని అత్యుత్తమమైన తత్త్వ శాస్త్ర గ్రంథాల క్రిందకు వస్తుందనీ, మార్క్సిస్టులు కూడా దానిని అధ్యయనం చేయాల్సివుందని పేర్కొన్నారు. ప్రాచీన భారతీయ సంస్కృతి-తత్త్వం అపురూపమైన మానసిక, తాత్త్విక, భౌతికోన్నతి సాధించి ఉండగా మార్క్సిస్టులు దాని ఔన్నత్యాన్ని అంగీకరించి, పరిశోధనలు చేయడం మాని వ్యతిరేకించడం ద్వారా ఆ గొప్ప సంపదను చేజేతులారా అభివృద్ధి నిరోధకులకు అప్పగించేస్తున్నారని పేర్కొన్నారు. మావో జెడాంగ్ అత్యంత ప్రాచీనమైన తమ తాత్త్విక నేపథ్యాన్ని గొప్పగా వ్యాఖ్యానిస్తూ దానికి కమ్యూనిస్ట్ దృక్పథాన్ని చేరుస్తూ చైనీయుల సాంస్కృతిక సంపదను నిలబెట్టుకుంటూ కమ్యూనిజం సాధించారని, ఇది మన దేశ కమ్యూనిస్టులకు కూడా ఆదర్శం కావాలన్నారు. ఈ నేపథ్యంలో రచయిత సుదీర్ఘమైన పీఠికలోనూ, రచనలోనూ మార్క్సిజాన్నీ, ఉపనిషత్ తత్త్వాన్నీ సమన్వయ దృష్టితో పరిశీలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పుస్తకంలో ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తులను మూలసహితంగా, సటీకగా అందిస్తూ వాటిని తనదైన ప్రత్యేక రీతిలో వ్యాఖ్యానించారు. ఈ గ్రంథాన్ని మార్క్సిస్ట్ అధ్యయన వేదిక వారు ప్రచురించారు.[1]

మూలాలు

[మార్చు]
  1. ఇంగువ, మల్లికార్జునరావు. ఐదు ఉపనిషత్తులు. Retrieved 8 March 2015.