ఐలవారిపల్లి
ఐలవారిపల్లి, తెలంగాణ రాష్ట్రం,కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి మండలానికి చెందిన గ్రామం.
ఐలవారిపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | కరీంనగర్ జిల్లా |
మండలం | కరీంనగర్ |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఇక్కడికి జిల్లా రాజధాని కరీంనగర్ నుండి 17 కి.మీ., రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 180 కి.మీ. దూరం కలిగి ఉంది.ఐలవారి పల్లె గ్రామం పన్యాల మల్లారెడ్డి (వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు) చే స్థాపించబడింది. ఇది చిన్న గ్రామమైనా విద్యాధికులు ఎక్కువ. అన్ని రంగాలలోనూ, వివిధ దేశాలలో ఈ పల్లెవారు రాణిస్తున్నారు.పన్యాల రామలింగేశ్వర్ రెడ్డి గారు మొదటి సారి గా ఉప సర్పంచ్ గా ఒక.నిరక్షరాష్యుని చేయడం జరిగింది.[ఆధారం చూపాలి]ఈ పల్లె అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది.
భౌగోళికంగా ఐలవారి పల్లె[మార్చు]
- రేఖాంశాములు - తూర్పు 78030' - 80030'
- అక్షాంశములు - ఉత్తరం 18030' - 19000'
- సముద్ర మట్టం నుండి ఎత్తు 421 అడుగులు (128 మీటర్లు)
గ్రామ విశేషాలు[మార్చు]
ఐలవారి పల్లె చుట్టూరా కొండలున్నాయి. వూరికి పశ్చిమాన 'ఐలోని కుంట' అనబడే చిన్న యేరు, తూర్పున ఖాజీపూర్ అనే చిన్న ఊరు, దక్షిణాన 'నాగుల చెరువు' అనే చెరువు ఉన్నాయి. ఈ వూరివారికి ఈ హద్దులను దాటి కూడా వ్యవసాయ భూములున్నాయి. ప్రధానమైన పల్లె 6 చ.కి.మీ. వైశాల్యం ఉంటుంది.