ఐషాని శెట్టి
ఐషాని శెట్టి | |
---|---|
జననం | పుత్తూరు, కర్ణాటక, భారతదేశం |
విద్యాసంస్థ | సెయింట్ జోసెఫ్ కళాశాల, బెంగళూరు |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2014 – ప్రస్తుతం |
ఐషాని శెట్టి భారతీయ సినిమా నటి, దర్శకురాలు. ఆమె ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమలో పని చేస్తుంది. ఆమె 2015లో వాస్తు ప్రకార చిత్రంలో తన నటనకు ఉత్తమ నటిగా ఐఫా(IIFA) ఉత్సవం అవార్డుకు ఎంపికైంది. ఆమె రాకెట్ (2015), నడువే అంతరవిరాలి (2018), ధరణి మదల మధ్యదొలగే (2022)లలో తన నటనతో ప్రసిద్ధిచెందింది.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఐషాని శెట్టి స్వస్థలం బెంగళూరు కాగా బిషప్ కాటన్ బాలికల పాఠశాలలో తన పాఠశాల విద్యను, జ్యోతి నివాస్ కళాశాలలో అండర్-గ్రాడ్యుయేషన్‌ను అభ్యసించింది. ఆమె సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పుచ్చుకుంది.[1]
కెరీర్
[మార్చు]నటిగా
[మార్చు]ఐషాని శెట్టి 2015 సంవత్సరంలో యోగరాజ్ భట్ దర్శకత్వం వహించిన వాస్తు ప్రకార చిత్రంతో కన్నడ చలనచిత్ర పరిశ్రమలో ప్రసిద్ధిచెందింది.[2] ఆమె ఈ చిత్రానికి IIFA ఉత్సవం ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.[3] ఆమె నవంబరు 2015లో విడుదలైన సతీష్ నినాసం సరసన రాకెట్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో ఆమె గాయనిగా అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన 'తన్నగే ఇద్వి' పాటకు మహిళా గాత్రాన్ని అందించింది.[4] ఆమె మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న సమయంలో సినిమాల నుండి కొంత విరామం తీసుకుంది. ఈ కాలంలో ఆమె కన్నడ రొమాంటిక్ డ్రామా నడువే అంతరవిరళిలో నటించింది.[5] 2022లో ఆమె ధరణి మండల మధ్యదోలగే చిత్రంలో మెప్పించింది.
దర్శకురాలిగా
[మార్చు]ఆమె తన నటనా జీవితంతో పాటు 'కాజీ' అనే షార్ట్ ఫిల్మ్‌తో దర్శకురాలిగా రంగప్రవేశం చేసింది. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం 2017లో బెంగుళూరు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, పింక్ సిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అధికారికంగా ప్రదర్శించబడింది. కాజీ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు(SIIMA)లో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్ పింక్ సిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా అనేక అవార్డులను గెలుచుకుంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "SJC's versatile 'Sheroes' make it big". www.sjc.ac.in. 7 March 2020. Archived from the original on 6 డిసెంబరు 2019. Retrieved 22 ఏప్రిల్ 2023.
- ↑ "Aishani Shetty talks about Vaastu Prakaara". www.sjc.ac.in. 7 March 2020.
- ↑ "IIFA Utsavam 2015 Nominees - Kannada". iifautsavam.com. 7 March 2020. Archived from the original on 27 ఫిబ్రవరి 2017. Retrieved 22 ఏప్రిల్ 2023.
- ↑ "Rocket was meant to be my film: Aishani". timesofindia.indiatimes.com. 22 November 2015.
- ↑ "Playing Nithya in Naduve Antaravirali was beyond me: Aishani Shetty". newindianexpress. 4 October 2018.
- ↑ "Sathish: It is our duty to the society". bangaloremirror. 14 May 2019.