Jump to content

ఐ.కొండలరావు

వికీపీడియా నుండి

అయితంరాజు కొండలరావు (ఐ. కొండలరావు) మొదటి ఉరుదూ - తెలుగు నిఘంటువు సంకలన కర్త.[1]

మొట్టమొదటి సారిగా 1930 వ దశకంలోనే చెందిన అయితంరాజు కొండలరావు ఎన్నో యేండ్లు కృషి చేసి ఉర్దూ – తెలుగు నిఘంటువుని తయారు చేశాడు. ఇదే మొట్టమొదటి ఉర్దూ తెలుగు నిఘంటువు.[2]

1938 ఉస్మానియా కాలేజీ వరంగల్ లో మాజీ అరబిక్ ప్రొఫెసర్ . ఈ నిఘంటువు అలీఫ్ నుండి లామ్ వరకు కర్నూలులోను మీమ్ నుండి యే వరకు వరంగల్ లోను ప్రింటు చేయబడింది. మొత్తం 857 పేజీలు. దీనిని ముద్రణ చేయుటకు 2012 ప్రపంచ తెలుగు మహా సభలలో పునర్ముద్రించడానికి మండలి బుద్ధప్రసాద్ అంగీకరించాడు. దీనిని త్వరలో మన అధికార భాషా సంఘం పునర్ముద్రించబోతోంది. ఐ.కొండలరావు గారి 1300 పేజీల తెలుగు-ఉర్దూ నిఘంటువు (1938) ను "గీటురాయి" ఎడిటర్ ఎస్.ఎం.మలిక్ తన లైబ్రరీలో నుండి తీసి పునర్ముద్రణ కోసం ఇచ్చారు. హుసేన్, రసూల్ బృందం డీటీపీ పని మొదలుబెట్టింది. ఈ మధ్య ప్రభుత్వం విడుదలచేసిన 18 రకాల తెలుగు యూనీకోడు ఫాంట్లలోనే ఈ నిఘంటువు తయారవుతుంది.

మూలాలు

[మార్చు]
  1. "నిఘంటుశోధన - తెలుగు నిఘంటువు". www.andhrabharati.com. Archived from the original on 2020-01-11. Retrieved 2020-07-05.
  2. "తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ | Janam Sakshi - Telugu Daily News Portal". janamsakshi.org. Archived from the original on 2020-07-06. Retrieved 2020-07-05.