ఒక క్రిమినల్ ప్రేమకథ
ఒక క్రిమినల్ ప్రేమకథ | |
---|---|
దర్శకత్వం | పి.సునీల్ కుమార్ రెడ్డి |
రచన | పి.సునీల్ కుమార్ రెడ్డి |
నిర్మాత | ఎక్కలి రవీంద్రబాబు |
తారాగణం | మనోజ్ నందన్, ప్రియాంక పల్లవి, సత్యానంద్ |
కూర్పు | అర్చన ఆనంద్ |
సంగీతం | ప్రవీణ్ ఇమ్మడి |
నిర్మాణ సంస్థ | శ్రావ్య ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 18 జూలై 2014 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఒక క్రిమినల్ ప్రేమకథ 2014లో విడుదలైన తెలుగు సినిమా. శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ పై ఎక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ సినిమాకు పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను 18 జూలై 2014న విడుదల చేశారు.[1]
కథ
[మార్చు]ఒక ఊర్లో శీను (మనోజ్) ఒక వీడియోషాప్ లో పని చేస్తూ ఉంటాడు. అలా ఒక ఫంక్షన్ లో బిందు (పల్లవి ప్రియాంక) ని చూసి ప్రేమలో పడతాడు. బిందు కూడా శీనుని ప్రేమించడం మొదలు పెడుతుంది. బిందు తండ్రికి ఆరోగ్య సమస్యలు రావడంతో వారి కుటుంబం విశాఖపట్నంలోని బిందు మామయ్య (సత్యానంద్) ఇంటికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో శీనుని తన కోసం వైజాగ్ రమ్మని చెప్పి బిందు వెళ్లి పోతుంది. శీను విశాఖపట్నం చేరుకొని బిందు చదివే కాలేజీ లో కాంటీన్ లో పని చేసుకుంటూ ఉంటాడు, కాని శీను ని బిందు మాత్రం పట్టించుకోదు. బిందు శీనుని ఎందుకు గుర్తు పట్టనట్టు ప్రవర్తిస్తుంది? బిందు ప్రేమ కోసం శీను ఏమి చేస్తాడు అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
[మార్చు]- మనోజ్ నందన్
- ప్రియాంక పల్లవి
- సత్యానంద్
- అనిల్ కళ్యాణ్
- మాన్ ప్రీత్
- దివ్య
- శృతి
- బుగతా సత్యనారాయణ
- దీక్ష
- మహేష్
- మల్లికా
- సముద్రం వెంకటేష్
- పరమేష్
- డేవిడ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రావ్య ఫిలిమ్స్
- దర్శకత్వం:పి.సునీల్ కుమార్ రెడ్డి
- నిర్మాత :ఎక్కలి రవీంద్రబాబు
- సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి
మూలాలు
[మార్చు]- ↑ Deccan Chronicle (14 June 2014). "A film on crimes & love". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.
- ↑ Sakshi (19 July 2014). "అశ్లీలపు అంచుల్లో ఒక క్రిమినల్ ప్రేమకథ : సినిమా రివ్యూ". Sakshi. Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.