ఒక చిన్న విరామం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక చిన్న విరామం
(2020 తెలుగు సినిమా)
దర్శకత్వం సందీప్ చేగురి
నిర్మాణం సందీప్ చేగురి
తారాగణం పునర్నవి భూపాలం, నవీన్ నేని
సంగీతం భరత్ మాచిరాజు
నిర్మాణ సంస్థ వాక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ 14 ఫిబ్రవరి 2020
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఒక చిన్న విరామం 2020లో విడుదలైన తెలుగు సినిమా. వాక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సందీప్ చేగురి నిర్మించి దర్శకత్వం వహించాడు. సంజయ్ వర్మ , గరీమ సింగ్, పునర్నవి భూపాలం, నవీన్ నేని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 14 ఫిబ్రవరి 2020న విడుదలైంది.[1]ఈ సినిమా 2021 జూలై 9 నుంచి ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[2]

కథ[మార్చు]

సంజయ్ వర్మ (దీపక్) సమీర (గరీమా సింగ్) భార్యాభర్తలు. ఒక అపరిచిత వ్యక్తి నుండి దీపక్ కు అనుమానాస్పద ఫోన్ వస్తుంది. అతడు డబ్బు కోసం దీపక్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. డబ్బును ఇవ్వడానికి బయలుదేరిన దీపక్ కు దారిలో కార్ రిపేర్ అవుతుంది. అటుగా వెళ్తున్న బాలా (నవీన్ నేని), మాయ (పునర్నవి భూపాలం) దీపక్ కి లిఫ్ట్ ఇస్తారు. ఆ తరువాత దీపక్ ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాడు ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • దర్శకత్వం : సందీప్ చేగురి
  • నిర్మాత‌ : సందీప్ చేగురి
  • సంగీతం : భరత్ మాచిరాజు
  • సినిమాటోగ్రఫర్ : రోహిత్ బెచు
  • ఎడిటర్: అశ్వత్ శివకుమార్

మూలాలు[మార్చు]

  1. Cine Josh (3 February 2020). "ఫిబ్రవరి 14న ఒక చిన్న విరామం!". CineJosh. Archived from the original on 6 జూలై 2021. Retrieved 6 July 2021.
  2. TV9 Telugu (6 July 2021). "'ఆహా'లో పునర్నవి భూపాలం మూవీ 'ఒక చిన్న విరామం'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే." Archived from the original on 6 జూలై 2021. Retrieved 6 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Times of India (14 February 2020). "Oka Chinna Viramam Movie Review: A decent thriller". Archived from the original on 6 జూలై 2021. Retrieved 6 July 2021.

బయటి లింకులు[మార్చు]