ఒరాకిల్ డేటాబేసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒరాకిల్ కార్పొరేషన్
అభివృద్ధిచేసినవారు ఒరాకిల్ కార్పొరేషన్
సరికొత్త విడుదల 11g
ప్రోగ్రామింగ్ భాష సి
నిర్వహణ వ్యవస్థ Cross-platform
భాషల లభ్యత Multiple languages
రకము RDBMS
లైసెన్సు Proprietary
వెబ్‌సైట్ http://www.oracle.com/

ఒరాకిల్ అనేది ఒక డేటాబేస్. డేటాబేస్‌ను ఏదైనా సమాచారమును భద్రపరుచుకోవడానికి ఉపయోగిస్తారు.

నేపధ్యము

[మార్చు]
ఒరాకిల్ డేటాబేస్ చిహ్నం

ఒరాకిల్ డేటాబేస్ రిలేషనల్ డేటాబేస్ రకానికి చెందినది. ఈ రకమైన డేటాబేస్ లలో సమాచారాన్ని పట్టికలు (టేబుల్స్) లలో భద్రపరుస్తారు. ప్రపంచ డేటాబేస్ విపణిలో ఒరాకిల్ సింహభాగాన్ని ఆక్రమిస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ ను తయారు చేసిన ఒరాకిల్ సంస్థ ప్రపంచ సాఫ్ట్ వేర్ కంపెనీలలో రెండవ అతి పెద్ద కంపెనీ. (మొదటిది హెచ్.పి)

1977 లో లారీ ఎల్లిసన్, ఆయన మిత్రులు కొంతమంది కలిసి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లాబొరేటరీస్ అనే ఒక సంస్థను నెలకొల్పారు.1979 లో దాన్ని రిలేషనల్ సాఫ్ట్‌వేర్ గా మార్చారు. అప్పుడే ఒరాకిల్ డేటాబేస్ రెండవ వర్షన్ విడుదలైంది. అయితే అందులో లావాదేవీలకు (ట్రాన్సాక్షన్లకు) ఆసరా ఉండేది కాదు. కేవలం సీక్వెల్ ఆధారంగా డేటాబేస్ నుంచి సమాచారాన్ని ప్రశ్నించి వెలికి తీయడం (క్వెరీ చెయ్యడం), డేటాబేసులోని పట్టికలను కలపడం వంటి ప్రాథమిక అవసరాలను మాత్రం తీర్చగలిగారు.

ఇంతవరకు విడుదలైన వెర్షన్లు

[మార్చు]
  • ఒరాకిల్:7: 7.0.16 — 7.3.4
  • ఒరాకిల్:8 డేటాబేస్: 8.0.3 — 8.0.6
  • ఒరాకిల్:8i డేటాబేస్ రిలీజ్: 8.1.5.0 — 8.1.5.1
  • ఒరాకిల్:8i డేటాబేస్ రిలీజ్ 2: 8.1.6.0 — 8.1.6.3
  • ఒరాకిల్:8i డేటాబేస్ రిలీజ్ 3: 8.1.7.0 — 8.1.7.4
  • ఒరాకిల్:9i డేటాబేస్ రిలీజ్ 1: 9.0.1.0 — 9.0.1.5 (డిసెంబరు 2003 ప్యాచ్ సెట్[ఆధునీకరించబడినది])
  • ఒరాకిల్:9i డేటాబేస్ రిలీజ్ 2: 9.2.0.1 — 9.2.0.8 (ఏప్రిల్ 2007 ప్యాచ్ సెట్[ఆధునీకరించబడినది])
  • ఒరాకిల్: డేటాబేస్ 10g రిలీజ్ 1: 10.1.0.2 — 10.1.0.5 (ఫిబ్రవరి 2006 ప్యాచ్ సెట్[ఆధునీకరించబడినది])
  • ఒరాకిల్: డేటాబేస్ 10g రిలీజ్ 2: 10.2.0.1 — 10.2.0.4 (ఏప్రిల్ 2008 ప్యాచ్ సెట్[ఆధునీకరించబడినది])
  • ఒరాకిల్:డేటాబేస్ 11g రిలీజ్1: 11.1.0.6 — 11.1.0.7 (సెప్టెంబరు 2008 ప్యాచ్ సెట్[ఆధునీకరించబడినది])

బయటి లింకులు

[మార్చు]