ఓడ గంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ship bell Titanic.

ఓడపై సమయాన్ని సూచించేందుకు వాడే గంట ఓడ గంట. ఈ గంట ద్వారానే నావికులకు తమ విధుల వేళలు తెలిసేవి. ఓడ గంటను ఇత్తడి లేదా కంచుతో తయారు చేస్తారు. దీనిపై ఓడ పేరు చెక్కబడి ఉంటుంది.

విధుల గంటలు

[మార్చు]

మామూలు గడియారాల్లాగా కాకుండా ఓడ గంటలు ఎంత సమయామైందో అన్ని గంటలు కొట్టవు. ఆ గంటల వ్యవస్థ కింది విధంగా ఉంటుంది. దీన్ని క్లాసికల్ పద్ధతి అంటారు:[1]

గంటల పద్ధతి గంటల సంఖ్య వాచ్
మిడిల్ మార్నింగ్ ఫోర్‌నూన్ ఆఫ్టర్‌నూన్ డాగ్ ఫస్ట్
ఫస్ట్ లాస్ట్
ఒక గంట 1 0:30 4:30 8:30 12:30 16:30 18:30[a] 20:30
రెండు గంటలు 2 1:00 5:00 9:00 13:00 17:00 19:00[a] 21:00
మూడు గంటలు 2 1 1:30 5:30 9:30 13:30 17:30 19:30[a] 21:30
నాలుగు గంటలు 2 2 2:00 6:00 10:00 14:00 18:00 22:00
ఐదు గంటలు 2 2 1 2:30 6:30 10:30 14:30 18:30 22:30
ఆరు గంటలు 2 2 2 3:00 7:00 11:00 15:00 19:00 23:00
ఏడు గంటలు 2 2 2 1 3:30 7:30 11:30 15:30 19:30 23:30
ఎనిమిది గంటలు 2 2 2 2 4:00 8:00 12:00[b] 16:00 20:00 0:00

ఇతర ఉపయోగాలు

[మార్చు]
  • పొగమంచు కప్పినపుడు ఈ గంటలు భద్రత కోసం వాడుతారు. ఆధునిక కాలంలో ఇదే ముఖ్యమైన ఉపయోగం.[3]
  • నౌకాదళ నౌకల్లో, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు నౌక మీదికి వచ్చేటపుడు వేళ్ళేటపుడూ ఈ గంటలను మోగిస్తారు.
  • కొత్త సంవత్సరం మొదలయ్యే క్షణాల్లో 16 సార్లు ఈ గంట కొడతారు - ముగుస్తున్న సంవత్సరానికి 8, కొత్త సంవత్సరానికి 8.
  • నావికులు చనిపోయినపుడు అతడు/ఆమె గౌరవార్థం 8 సార్లు ఈ గంట మోగిస్తారు. దీనర్థం అతడి విధులు ముగిసాయని. నౌకాయాన పరిభాషలో "ఎయిట్ బెల్స్" ను సంస్మరణ సందర్భంలో వాడుతారు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. United States Naval Institute (1996) [1902]. The Bluejackets' Manual (24th. Annapolis, MD. p. 370. ISBN 978-1591141532.
  2. Tony Gray. "Workshop Hints: Ship's Bells". The British Horological Institute. Archived from the original on 12 జూన్ 2011. Retrieved 25 మే 2012.
  3. "Ship's Bell". National Maritime Museum. Archived from the original on 9 December 2008. Retrieved 2008-04-07.

బాహ్య లింకులు

[మార్చు]


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు

"https://te.wikipedia.org/w/index.php?title=ఓడ_గంట&oldid=3583854" నుండి వెలికితీశారు